2024లో బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లు: ధర రూ. 25వేలు కంటే తక్కువే.. | Best Smartphones Under Rs 25000 in India | Sakshi
Sakshi News home page

2024లో బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లు: ధర రూ. 25వేలు కంటే తక్కువే..

Published Sat, Dec 7 2024 8:51 PM | Last Updated on Sun, Dec 8 2024 8:40 AM

Best Smartphones Under Rs 25000 in India

2024 ముగుస్తోంది. లెక్కకు మించిన స్మార్ట్‌ఫోన్‌లు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. ఈ కథనంలో రూ.25,000 లోపు ధర వద్ద లభించే బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌ల గురించి వివరంగా తెలుసుకుందాం.

వన్‌ప్లస్‌ నార్డ్ సీఈ4 (OnePlus Nord CE4)
ప్రస్తుతం మార్కెట్లో రూ. 25వేలలోపు ధర వద్ద లభిస్తున్న అత్యుత్తమ స్మార్ట్‌ఫోన్‌లలో 'వన్‌ప్లస్‌ నార్డ్ సీఈ4' ఒకటి. ఇది మంచి పనితీరును అందించడం మాత్రమే కాకుండా.. బ్యాటరీ కెపాసిటీ కూడా ఉత్తమగానే ఉంటుంది. 6.74 ఇంచెస్ వైబ్రెంట్ అమోలెడ్ డిస్‌ప్లే కలిగి ఉన్న ఈ ఫోన్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 3 చిప్‌సెట్ పొందుతుంది. మంచి ఫోటోల కోసం లేదా ఫ్లాగ్‌షిప్ గ్రేడ్ డిస్‌ప్లే క్వాలిటీ వంటివి కోరుకునవారికి ఇది బెస్ట్ ఆప్షన్.

రెడ్‌మీ నోట్ 13 ప్రో (Redmi Note 13 Pro)
మంచి డిస్‌ప్లే, బెస్ట్ పర్ఫామెన్స్ కోరుకునే వారికి 'రెడ్‌మీ నోట్ 13 ప్రో' ఉత్తమ ఎంపిక. దీని ధర కూడా రూ. 25వేలు కంటే తక్కువే. 6.67 ఇంచెస్ 1.5కే అమోలెడ్ డిస్‌ప్లే కలిగిన ఈ ఫోన్.. 120 Hz అడాప్టివ్ రిఫ్రెష్ రేట్ పొందుతుంది. ఇందులో స్నాప్‌డ్రాగన్ 7ఎస్ జెన్ 2 ప్రాసెసర్ ఉంటుంది. 5100mAh కెపాసిటీ కలిగిన బ్యాటరీ రోజంతా పనిచేస్తుంది.

మోటరోలా ఎడ్జ్ 50 ఫ్యూజన్ (Motorola Edge 50 Fusion)
అద్భుతమైన డిజైన్ కలిగి, మంచి పనితీరును అందించే స్మార్ట్‌ఫోన్‌ కోసం ఎదురు చూసేవారికి మోటరోలా ఎడ్జ్ 50 ఫ్యూజన్ ఓ మంచి ఆప్షన్. ఇది స్నాప్‌డ్రాగన్ 7ఎస్ జెన్ 2 ప్రాసెసర్ పొందుతుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ డిస్‌ప్లే 6.7 ఇంచెస్ వరకు ఉంటుంది. ఇందులోని 5000 mAh బ్యాటరీ.. 68 వాట్స్ ఫాస్ట్ ఛార్జర్‌కు సపోర్ట్ చేస్తుంది.

మోటరోలా ఎడ్జ్ 50 నియో (Motorola Edge 50 Neo)
మోటరోలా ఎడ్జ్ 50 నియో కూడా మన జాబితాలో చెప్పుకోదగ్గ స్మార్ట్‌ఫోన్. ఇది డైనమిక్ 120 Hz రిఫ్రెష్ రేట్‌తో కూడిన.. 6.4 ఇంచెస్ డిస్‌ప్లే పొందుతుంది. IP68 వాటర్ రెసిస్టెన్స్, 15 వాట్స్ వైర్‌లెస్ ఛార్జింగ్, గుండ్రంగా ఉండే కెమెరా సిస్టమ్ వంటి ఫీచర్స్ ఇందులో ఉన్నాయి. 50 MP ప్రైమరీ లెన్స్ & 32 MP సెల్ఫీ షూటర్‌ వంటివి ఈ స్మార్ట్‌ఫోన్‌లో ఉన్నాయి.

వివో టీ3 ప్రో (Vivo T3 Pro)
లెదర్ బ్యాక్‌తో సొగసైన.. స్లిమ్ డిజైన్‌ పొందిన ఈ స్మార్ట్‌ఫోన్ 6.77 ఇంచెస్ అమోలెడ్ డిస్‌ప్లే పొందుతుంది. క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 3 చిప్‌సెట్ కలిగిన ఈ ఫోన్ 5500 mAh బ్యాటరీ పొందుతుంది. డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ కలిగి ఉండటం వల్ల తక్కువ కాంతిలో కూడా ఫోటోలు తీసుకోవడానికి ఉత్తమంగా ఉంటుంది.

నథింగ్ ఫోన్ (2ఏ) (Nothing Phone (2a))
పాలికార్బోనేట్ బ్యాక్‌తో, ప్లాస్టిక్ బిల్డ్ కలిగిన ఈ ప్రీమియం ఫోన్ ధర కూడా రూ. 25వేలు కంటే తక్కువే. ఇందులోని గ్లిఫ్ ఇంటర్‌ఫేస్ ప్రత్యేకంగా నిలుస్తుంది. రోజువారీ వినియోగానికి మాత్రమే కాకుండా.. గేమింగ్ కోసం కూడా ఇది చాలా అనుకూలంగా ఉంటుంది. 5000 mAh బ్యాటరీ కలిగిన ఈ ఫోన్ రోజు వినియోగాన్ని నిర్ధారిస్తుంది. ఇది డ్యూయల్ 50 MP రియర్ కెమెరాలు కలిగి ఉండటం వల్ల ఉత్తమ ఫోటో అనుభవాన్ని పొందవచ్చు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement