ఇండిపెండెన్స్ డే స్పెషల్‌గా నోకియా 5 సేల్
ఇండిపెండెన్స్ డే స్పెషల్‌గా నోకియా 5 సేల్
Published Mon, Aug 14 2017 3:28 PM | Last Updated on Sun, Sep 17 2017 5:31 PM
నోకియా 5 బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ ఎట్టకేలకు కస్టమర్ల చేతిలోకి వచ్చేస్తోంది. గత నెల రోజులుగా చేపట్టిన ప్రీ-ఆర్డర్ల అనంతరం ఈ ఫోన్‌ను దేశవ్యాప్తంగా విక్రయానికి తీసుకురావాలని హెచ్‌ఎండీ గ్లోబల్ నిర్ణయించింది. స్వాతంత్య్ర దినోత్సవ సందర్భంగా ఆగస్టు 15 నుంచి దీన్ని విక్రయించనున్నట్టు హెచ్‌ఎండీ గ్లోబల్ తెలిపింది. ముందస్తు ఫోన్లకు భిన్నంగా ఎక్స్‌క్లూజివ్‌గా ఆఫ్‌లైన్ రిటైలర్ల వద్దనే ఈ స్మార్ట్‌ఫోన్‌ను అందుబాటులో ఉంచనుంది. దేశవ్యాప్తంగా 10కి పైగా నగరాల్లో ఎంపికచేసిన రిటైల్ అవుట్‌లెట్లలో ఈ ఫోన్‌ను విక్రయించనున్నామని గాడ్జెట్స్ 360కి హెచ్‌ఎండీ గ్లోబల్ ధృవీకరించింది.
నాలుగు రంగుల్లో ఈ ఫోన్ లాంచ్ అయింది. మేట్ బ్లాక్, సిల్వర్, టెంపెడ్ బ్లూ, కాపర్ రంగుల్లో అందుబాటులో ఉండనుంది. అయితే ప్రస్తుతం కేవలం మేట్ బ్లాక్ కలర్ డివైజ్ మాత్రమే వినియోగదారుల ముందుకు రానుంది. నోకియా 5 విక్రయానికి రానున్న సిటీల్లో ఢిల్లీ ఎన్‌సీఆర్, ముంబై, బెంగళూరు, చెన్నై, ఛండీఘర్, జైపూర్, కోల్‌కత్తా, లక్నో, ఇండోర్, హైదరాబాద్, పుణే, అహ్మదాబాద్, కాలికట్‌లు ఉన్నాయి. ఇంకా మరిన్ని నగరాల్లో మున్ముందు అందుబాటులోకి తీసుకొస్తామని కంపెనీ తెలిపింది. మరోవైపు నోకియా 6 స్మార్ట్‌ఫోన్ కూడా ఎక్స్‌క్లూజివ్‌గా అమెజాన్‌లో విక‍్రయానికి వస్తోంది. ఇప్పటికే దీని రిజిస్ట్రేషన్లు కూడా ప్రారంభమయ్యాయి. ఆగస్టు 23 నుంచి మొదటి అమ్మకం ప్రారంభం కానుంది.
నోకియా 5 ధర, లాంచ్ ఆఫర్లు
నోకియా 5 స్మార్ట్‌ఫోన్ ధర 12,499 రూపాయలు. ఇప్పటికే కొన్ని లాంచ్ ఆఫర్లను హెచ్‌ఎండీ గ్లోబల్ రివీల్ చేసింది. నెలకు రూ.149 రీఛార్జ్‌తో వొడాఫోన్ కస్టమర్లకు నెలకు 5జీబీ డేటాను ఇవ్వనుంది. ఇలా ఈ స్మార్ట్‌ఫోన్‌పై 3 నెలల పాటు అందించనుంది. మేక్‌మైట్రిప్. కామ్‌లో రూ.2500 తగ్గింపును(హోటల్స్‌పై 1,800 రూపాయల తగ్గింపు, దేశీయ విమానాలపై రూ.700 తగ్గింపు) వినియోగదారులు పొందనున్నారు.
నోకియా 5 స్పెషిఫికేషన్లు, ఫీచర్లు
5.2 అంగుళాల హెచ్‌డీ డిస్‌ప్లే
ఆండ్రాయిడ్ 7.1.1 నోగట్
క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 430 ఎస్‌ఓసీ
2జీబీ ర్యామ్
16జీబీ ఇన్‌బిల్ట్ స్టోరేజ్
128జీబీ వరకు విస్తరణ మెమరీ
13 మెగాపిక్సెల్ వెనుక కెమెరా
8 మెగాపిక్సెల్ ముందు కెమెరా
3000 ఎంఏహెచ్ బ్యాటరీ
Advertisement
Advertisement