హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: సుజుకి మోటార్‌సైకిల్ ఇండియా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఏడు లక్షలకు పైగా యూనిట్లను విక్రయించాలని లకి‡్ష్యంచింది. 2017–18లో అయిదు లక్షల పైచిలుకు సుజుకి టూవీలర్లు రోడ్డెక్కాయి. 2020 నాటికి 10 లక్షల యూనిట్ల మార్కును చేరుకోవాలన్నది లక్ష్యమని సంస్థ సేల్స్, మార్కెటింగ్ జోనల్ మేనేజర్ కేఎన్‌వీఎస్ సురేశ్ సోమవారం తెలిపారు.
బర్గ్‌మ్యాన్ స్ట్రీట్ స్కూటర్‌ను హైదరాబాద్ మార్కెట్లో విడుదల చేసిన సందర్భంగా రీజినల్ మేనేజర్ పంకిత్ మోడి తో కలిసి మీడియాతో మాట్లాడారు. ‘యాక్సెస్ 125 స్కూటర్‌కు మంచి డిమాండ్ ఉంది. సీబీఎస్ వేరియంట్‌తోపాటు స్పెషల్ ఎడిషన్‌ను ఇటీవలే ప్రవేశపెట్టాం. 150 సీసీ సెగ్మెంట్‌లో కంపెనీకి 8% వాటా ఉంది. ఈ విభాగంలో ఇంట్రూడర్ హల్‌చల్ చేస్తోంది. నెలకు 5,000లకుపైగా యూనిట్లు అమ్ముడవుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఈ సంఖ్య 200 ఉంది. కంపెనీ మొత్తం అమ్మకాల్లో కర్నాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ 25 శాతం వాటా చేజిక్కించుకున్నాయి.’ అని వివరించారు. హైదరాబాద్ ఎక్స్‌షోరూంలో బర్గ్‌మ్యాన్ స్ట్రీట్ ధర రూ.70,292 ఉంది.
Comments
Please login to add a commentAdd a comment