Suzuki Motorcycle India plant shut for a week due to cyber-attack; details - Sakshi
Sakshi News home page

Suzuki Motorcycle: సుజుకి మోటార్‌సైకిల్ కంపెనీపై సైబర్ అటాక్ - నిలిచిపోయిన ఉత్పత్తి

Published Sat, May 20 2023 2:34 PM | Last Updated on Sat, May 20 2023 3:01 PM

Cyber ​​attack on suzuki motorcycle company plant shut for a week details - Sakshi

Cyber Attack: భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన టూ వీలర్ తయారీ సంస్థ 'సుజుకి మోటార్‌సైకిల్ ఇండియా' గత కొంత కాలంగా ఫ్యాక్టరీలలో ఉత్పత్తిని నిలిపివేసింది. సైబర్ దాడుల కారణంగానే ఉత్పత్తి నిలిచిపోయినట్లు కంపెనీ ప్రకటించింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

నిలిచిపోయిన ఉత్పత్తి..
నివేదికల ప్రకారం, 2023 మే 10 నుంచి సుజుకి మోటార్‌సైకిల్ ఉత్పత్తిని నిలిపివేసింది. ఫ్యాక్టరీలో ఉత్పత్తి నిలిచిపోవడంతో ఈ కాలంలో దాదాపు 20,000 వాహనాల ఉత్పత్తి నిలిచిపోయినట్లు సమాచారం. అంతే కాకుండా వచ్చే వారం జరగాల్సిన వార్షిక సరఫరాదారుల సమావేశాన్ని కూడా సంస్థ వాయిదా వేసింది.

దీని గురించి సుజుకి మోటార్‌సైకిల్ ఇండియా ప్రతినిధి మాట్లాడుతూ.. ఈ సంఘటన గురించి తెలిసిన వెంటనే సంబంధిత ప్రభుత్వ విభాగానికి నివేదించామని, ప్రస్తుతం దీనిపైనా విచారణ జరుగుతోంది, భద్రతా ప్రయోజనాల దృష్ట్యా దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు అందించలేమని అన్నారు. అయితే మళ్ళీ ఉత్పత్తి ఎప్పుడు ప్రారంభమవుతుందనే విషయం కూడా ప్రస్తావించలేదు. కానీ త్వరలోనే ఉత్పత్తి ప్రారంభమవుతుందని భావిస్తున్నాము.

(ఇదీ చదవండి: ఉద్యోగం పోతుందని భయమా? ఈ టిప్స్ మీకోసమే..!)

భారతదేశంలో అతిపెద్ద వాహన తయారీ సంస్థగా కీర్తి పొందిన సుజుకి మోటార్‌సైకిల్ ఇప్పటికే దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లలో మిలియన్ యూనిట్ల ద్విచక్ర వాహనాలను విక్రయించింది. అంతే కాకుండా కంపెనీకి భారత్ మాత్రమే కాకుండా జపాన్ కూడా అతిపెద్ద మార్కెట్ కావడం విశేషం. సుజుకి మోటార్ కార్పొరేషన్ గ్లోబల్ అవుట్‌పుట్‌లో భారతదేశం 50% వాటాను కలిగి ఉంది. అంతే కాకుండా గత ఆర్థిక సంవత్సరం కూడా అమ్మకాల్లో మంచి వృద్ధిని సాధించగలిగింది. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాలు ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి సాక్షి బిజినెస్ చూస్తూ ఉండండి.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement