చాలా ఊహాగానాల తరువాత ప్రముఖ జపనీస్ ఆటోమొబైల్ దిగ్గజం సుజుకీ భారత మార్కెట్లలోకి సరికొత్త స్కూటీను లాంచ్ చేసింది. స్కూటీ వేరియంట్లలో ‘అవెనీస్’ పేరుతో కొత్త స్కూటీను సుజుకీ మోటార్‌సైకిల్ ఇండియా ఆవిష్కరించింది. యువతను, టెక్ సావీలను లక్ష్యంగా చేసుకొని ఈ స్కూటీను సుజుకీ తయారు చేసింది. ఈ కొత్త స్కూటీ వచ్చే నెల డిసెంబర్‌లో కొనుగోలుదారులకు అందుబాటులో ఉండనుంది.
రేసింగ్ ఎడిషన్‌గా పరిచయం చేసిన అవెనీస్ మెటాలిక్ ట్రిటాన్ బ్లూ కలర్‌తో సహా ఐదు రంగుల వేరియంట్స్‌తో రానుంది. రేస్ ఎడిషన్ వేరియంట్‌లో సుజుకి రేసింగ్ గ్రాఫిక్స్‌ను అమర్చారు. రేస్ ఎడిషన్ సుజుకీ అవెనీస్ బేస్ వేరియంట్ ధర రూ. 86,700 ( ఢిల్లీ ఎక్స్-షోరూమ్ ధర)గా ఉంది.
చదవండి: కొత్త కారు.. కొనక్కర్లేదు.. అద్దెతోనే నడిపేయండి
జెన్ జీ...టెక్ సావీలే లక్ష్యంగా ఫీచర్స్..!
జెన్‌జీ, టెక్‌సావీలను లక్ష్యంగా చేసుకొని అద్భుతమైన ఫీచర్స్‌తో సుజుకీ అవెనీస్ సుజుకీ మోటార్‌సైకిల్ ఇండియా లాంచ్ చేసింది. ఈ స్కూటీలో ముఖ్యంగా అవెనీస్ కాలర్ ఐడీ, ఎస్‌ఎమ్‌ఎస్ అలర్ట్, వాట్సాప్ అలర్ట్, స్పీడ్ అలర్ట్, ఫోన్ బ్యాటరీ స్థాయి డిస్‌ప్లేను అందించనుంది. ఐవోఎస్, ఆండ్రాయిడ్ ప్లాట్‌ఫారమ్స్‌తో కనెక్ట్ చేయవచ్చును.
సుజుకీ అవెనీస్ ఇంజిన్ విషయానికి వస్తే...ఎఫ్1 టెక్నాలజీతో 125సీసీ ఇంజిన్ అమర్చారు. 6750 ఆర్‌పీఎమ్ వద్ద 8.7 పీఎస్ పవర్‌ను డెలివరీ చేస్తోంది. 5500ఆర్‌పీఎమ్ వద్ద 10ఎన్‌ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేయనుంది. ఈ స్కూటీలో బాడీ మౌంటెడ్ ఎల్‌ఈడీ, భారీ స్టోరేజ్ స్పేస్, యూఎస్‌బీ ఛార్జింగ్ పోర్ట్, ఎల్‌ఈడీ టెయిల్ ల్యాంప్, స్పోర్టీ మఫ్లర్ కవర్, అల్లాయ్ వీల్, క్యాచీ గ్రాఫిక్స్, సైడ్ స్టాండ్ లాక్, ఇంజన్ కిల్ స్విచ్, డ్యూయల్ లగేజ్ హుక్స్, ఫ్రంట్ రాక్ స్టోరేజ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. సుజుకీ అవెనిస్ కోసం కొత్తగా ఎక్స్‌టర్నల్ హింజ్ టైప్ ఫ్యూయల్ క్యాప్‌ను సుజుకి మోటార్‌సైకిల్ ఇండియా పరిచయం చేసింది.
చదవండి: ఎలక్ట్రిక్ వాహన ప్రపంచంలో లూసిడ్ రికార్డు.. 840 కి.మీ రేంజ్, ధర ఎంతో తెలుసా?
Comments
Please login to add a commentAdd a comment