
సాక్షి,ముంబై: స్టయిలిష్ అండ్ లగ్జరీ బైక్ మేకర్ రాయిల్ ఎన్‌ఫీల్డ్ మరో కొత్త బైక్‌ను లాంచ్ చేసింది. ఎప్పటినుంచో ఎదురు చూస్తున్న బైక్ ప్రియులను ఆకట్టుకునేలా అద్భుత ఫీచర్లతో 650 సీసీ క్రూయిజర్ ‘సూపర్ మెటోర్ 650’ బైక్‌ను తీసుకొచ్చింది. అతి త్వరలో భారతీయ మార్కెట్లలో కూడా సందడి చేయనుంది. రాయల్ ఎన్‌ఫీల్డ్ 350 సిరీస్‌లో భాగంగా ఇటలీలోని మిలన్‌లో జరుగుతున్న 2022 EICMA షోలో ఈకొత్త బైక్‌ను అధికారికంగా ఆవిష్కరించింది. క్లాసికల్ క్రూయిజర్ డిజైన్‌తో రెండు వేరియంట్లలో (స్టాండర్డ్ ,టూరర్) మొదటిది ఐదు రంగులలో, రెండోది రెండు రంగుల్లో ఆకర్షణీయ లుక్‌లో అదరగొడుతోంది.
ఇంటర్‌సెప్టర్ 650, కాంటినెంటల్ జీటీ 650 ఆధారంగా, 6 స్పీడ్ ట్రాన్స్మిషన్, 648 సీసీ ట్విన్ ఇంజీన్‌ను ఇందులో అమర్చింది. 7,250 ఆర్‌ఎంపీ వద్ద 47 హెచ్‌పీ పవర్‌ను, 5650 ఆర్‌ఎంపీ వద్ద 52 గరిష్క టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. టియర్ డ్రాప్ ఆకారంలో 15.7 లీటర్ల ఫ్యూయల్ ట్యాంకును అమర్చింది.
19 ఇంచెస్ ఫ్రంట్ వీల్, 16 అంగుళాల అల్లాయ్ వీల్ కాంబినేషన్, ఫ్రంట్ 320 మిమీ డిస్క్ బ్రేక్, రియర్‌లో 300 డిస్క్ తో డ్యూయల్ -ఛానల్ ఏబిసి ఉంది. రౌండ్ LED హెడ్‌ల్యాంప్, ట్రిప్పర్ నావిగేషన్‌తో కూడిన డ్యూయల్-పాడ్ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్ , డ్యూయల్ ఎగ్జాస్ట్ లాంటి ఫీచర్లు ఉన్నాయి.భారతదేశంలో దాదాపు రూ. 3.4 లక్షల (ఎక్స్-షోరూమ్) ధర ఉంటుందని అంచనా.
Comments
Please login to add a commentAdd a comment