‘రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350’ లేటెస్ట్‌ ఎడిషన్ వచ్చేసింది.. | Royal Enfield Classic 350 2024 Edition Launched In India, Check Price And Specifications | Sakshi
Sakshi News home page

‘రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350’ లేటెస్ట్‌ ఎడిషన్ వచ్చేసింది..

Published Sun, Sep 1 2024 2:02 PM | Last Updated on Sun, Sep 1 2024 4:57 PM

Royal Enfield Classic 350 2024 edition launched in India

రాయల్ ఎన్‌ఫీల్డ్ ద్విచక్ర వాహనాలకు ఉన్న క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వాహనప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350 లేటెస్ట్‌ ఎడిషన్ ఎట్లకేలకు వచ్చేసింది. రూ. 1.99 లక్షల ప్రారంభ ధరతో ఈ బైక్‌ 2024 ఎడిషన్ భారత మార్కెట్లో విడుదలైంది.

2024 క్లాసిక్ 350 టాప్ వేరియంట్ ధర రూ.2.30 లక్షలు. ఈ బైక్‌ బుకింగ్‌లు, టెస్ట్ రైడ్‌లు సెప్టెంబర్ 1 నుండి ప్రారంభమయ్యాయి. 2024 మోడల్ కోసం క్లాసిక్ 350ని కొత్త కలర్ ఆప్షన్‌లతో సరికొత్తగా, అదనపు ఫీచర్లతో మెరుగుపరిచారు. క్లాసిక్ 350 మొత్తం శ్రేణిలో లేనివిధంగా ఎల్‌ఈడీ పైలట్ లైట్లు, హెడ్‌లైట్, టెయిల్ లైట్‌ అప్‌డేటెడ్‌  ఎడిషన్‌లో ఉన్నాయి. అంతేకాకుండా ప్రీమియం మోడల్స్‌లో అయితే ఎల్‌ఈడీ ఇండికేటర్లు సైతం ఉన్నాయి.

క్లాసిక్ 350 లేటెస్ట్‌ ఎడిషన్‌లో అడ్జస్టబుల్‌ క్లచ్, బ్రేక్ లివర్, గేర్ పొజిషన్ ఇండికేటర్‌ ఉన్నాయి. అలాగే ఇందులో యూఎస్‌బీ టైప్-సీ ఛార్జర్ కూడా ఉంది.ఈ బైక్ లో ఇచ్చిన 349cc సింగిల్-సిలిండర్ ఇంజన్‌ను ఐదు-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జత చేశారు. ఇది 6,100rpm వద్ద 20.2bhp, 4,000rpm వద్ద 27Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది.

ఇక కలర్‌ ఆప్షన్ల విషయానికి వస్తే హెరిటేజ్ (మద్రాస్ రెడ్, జోధ్‌పూర్ బ్లూ), హెరిటేజ్ ప్రీమియం (మెడాలియన్ బ్రాంజ్‌), సిగ్నల్స్ (కమాండో శాండ్), డార్క్ (గన్ గ్రే, స్టెల్త్ బ్లాక్), క్రోమ్ (ఎమరాల్డ్‌) అనే ఐదు వేరియంట్‌లలో ఏడు కొత్త రంగులను ప్రవేశపెట్టింది. వీటిలో స్టెల్త్ బ్లాక్ వేరియంట్ మాత్రమే స్టైలిష్ అల్లాయ్ వీల్స్‌తో రావడం విశేషం.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement