classic
-
‘రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350’ లేటెస్ట్ ఎడిషన్ వచ్చేసింది..
రాయల్ ఎన్ఫీల్డ్ ద్విచక్ర వాహనాలకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వాహనప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350 లేటెస్ట్ ఎడిషన్ ఎట్లకేలకు వచ్చేసింది. రూ. 1.99 లక్షల ప్రారంభ ధరతో ఈ బైక్ 2024 ఎడిషన్ భారత మార్కెట్లో విడుదలైంది.2024 క్లాసిక్ 350 టాప్ వేరియంట్ ధర రూ.2.30 లక్షలు. ఈ బైక్ బుకింగ్‌లు, టెస్ట్ రైడ్లు సెప్టెంబర్ 1 నుండి ప్రారంభమయ్యాయి. 2024 మోడల్ కోసం క్లాసిక్ 350ని కొత్త కలర్ ఆప్షన్లతో సరికొత్తగా, అదనపు ఫీచర్లతో మెరుగుపరిచారు. క్లాసిక్ 350 మొత్తం శ్రేణిలో లేనివిధంగా ఎల్ఈడీ పైలట్ లైట్లు, హెడ్‌లైట్, టెయిల్ లైట్ అప్డేటెడ్ ఎడిషన్‌లో ఉన్నాయి. అంతేకాకుండా ప్రీమియం మోడల్స్‌లో అయితే ఎల్ఈడీ ఇండికేటర్లు సైతం ఉన్నాయి.క్లాసిక్ 350 లేటెస్ట్ ఎడిషన్‌లో అడ్జస్టబుల్ క్లచ్, బ్రేక్ లివర్, గేర్ పొజిషన్ ఇండికేటర్ ఉన్నాయి. అలాగే ఇందులో యూఎస్బీ టైప్-సీ ఛార్జర్ కూడా ఉంది.ఈ బైక్ లో ఇచ్చిన 349cc సింగిల్-సిలిండర్ ఇంజన్‌ను ఐదు-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జత చేశారు. ఇది 6,100rpm వద్ద 20.2bhp, 4,000rpm వద్ద 27Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది.ఇక కలర్ ఆప్షన్ల విషయానికి వస్తే హెరిటేజ్ (మద్రాస్ రెడ్, జోధ్‌పూర్ బ్లూ), హెరిటేజ్ ప్రీమియం (మెడాలియన్ బ్రాంజ్), సిగ్నల్స్ (కమాండో శాండ్), డార్క్ (గన్ గ్రే, స్టెల్త్ బ్లాక్), క్రోమ్ (ఎమరాల్డ్) అనే ఐదు వేరియంట్లలో ఏడు కొత్త రంగులను ప్రవేశపెట్టింది. వీటిలో స్టెల్త్ బ్లాక్ వేరియంట్ మాత్రమే స్టైలిష్ అల్లాయ్ వీల్స్‌తో రావడం విశేషం. -
క్లాసిక్ గోల్డ్ బనారసీ చీరలో అందాల ‘రాశి’ (ఫోటోలు)
-
ఒకప్పుడు క్లాసిక్ డైరెక్టర్.. ఇప్పుడో అద్భుతమైన యాక్టర్.. గుర్తుపట్టారా? (ఫొటోలు)
-
టీవీఎస్ జూపిటర్ క్లాసిక్ లాంచ్.. ధర ఎంతంటే?
సాక్షి, ముంబై: ప్రముఖ టూవీలర్ సంస్థ టీవీఎస్ కొత్తగా అప్డేట్ చేసిన జూపిటర్ వెహికల్నులాంచ్ చేసింది. దేశంలో 50 లక్షల స్కూటర్ల మైలు రాయిని చేరుకున్న సందర్భానికి గుర్తుగా స్పెషల్ ఎడిషన్‌గా ‘‘ ఫాస్టెస్ట్ ఫైవ్ మిలియన్ వెహికిల్స్ ఆన్ రోడ్’’ అంటూ టీవీఎస్ జూపిటర్ క్లాసిక్ స్కూటర్‌ను తెచ్చింది. ఈ స్కూటర్లు మిస్టిక్ గ్రే, రీగల్ పర్పుల్ రంగుల్లో లభ్యం. క్లాసిక్ టాప్-స్పెక్ ట్రిమ్‌లో మాత్రమే అందుబాటులో ఉంటుంది. దీని ధరను రూ. 85,866 (ఎక్స్ షోరూం) గా కంపెనీ నిర్ణయించింది. కాస్మెటిక్ మార్పులు, ఇంజీన్ జూపిటర్ క్లాసిక్ ఇతర వేరియంట్లతో పోల్చినప్పుడు అది ప్రత్యేకంగా కనిపించేలా పలు బ్యూటీ అప్డేట్స్ ఇచ్చింది. ముందు ,బ్రౌన్ బాడీ ప్యానెల్ల వద్ద లేతరంగు గల విజర్‌ను పొందుతుంది (ఇతర వేరియంట్లు బ్లాక్ ప్యానెల్). మిర్రర్లు ఇతర వేరియంట్లలో క్రోమ్‌తో పోలిస్తే బ్లాక్ ఫినిషింగ్‌ను ఇచ్చింది. ఫ్రంట్ ఆప్రాన్ న్యూ గ్రాఫిక్స్, పైనుంచి కిందికి జుపిటర్ బ్యాడ్జింగ్ లాంటివి యాడ్ చేసింది. జూపిటర్ క్లాసిక్ నెక్స్ట్ జెన్ అల్యూమినియం, 109.7 సిసి, సింగిల్ సిలిండర్ ఫ్యూయల్ ఇంజెక్షన్ ఇంజన్ 7.47 పిఎస్ పవర్, 8.4 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది మోటార్ పేటెంట్ ఎకోనోమీటర్తో కూడా వస్తుంది, ఇది 'ఎకో మోడ్' ,'పవర్ మోడ్' రెండింటిలోనూ రైడర్లను గైడ్ చేస్తుంది. ఎలక్ట్రిక్ స్టార్టర్,కిక్ స్టార్టర్ రెండింటితోపాటు, బ్రేకింగ్ హార్డ్‌వేర్, ముందు డిస్క్, రియర్ డ్రమ్ బ్రేక్‌ను కలిగి ఉంటుంది. టెలిస్కోపిక్ఫోర్క్, త్రిస్టెప్ ఎడ్జస్టబుల్ ట్విన్ షాక్ అబ్జార్బర్ ఇందులో ఉన్నాయి. -
రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ బైక్‌ల రీకాల్
న్యూఢిల్లీ: బ్రేక్ భాగంలో సమస్యలను పరిష్కరించేందుకు క్లాసిక్ 350 మోడల్‌కు సంబంధించి 26,300 బైక్‌లను రీకాల్ చేస్తున్నట్లు మోటర్‌సైకిల్ తయారీ దిగ్గజం రాయల్ ఎన్ఫీల్డ్ వెల్లడించింది. వీటిల్లో సమస్యలు తలెత్తే అవకాశాలను తమ సాంకేతిక బృందం గుర్తించడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించింది. వెనుక బ్రేకు పెడల్పై భారీ స్థాయిలో ఒత్తిడి పడినప్పుడు, అసాధారణంగా బ్రేకింగ్ సామర్థ్యం దెబ్బతినే అవకాశాలు ఉన్నట్లు పేర్కొంది. ఈ ఏడాది సెప్టెంబర్ 1 నుంచి డిసెంబర్ 5 మధ్య తయారైన సింగిల్ చానెల్, ఏబీఎస్, రియర్ డ్రమ్ బ్రేక్ క్లాసిక్ 350 మోడల్స్‌కు ఈ సమస్య పరిమితమని వివరించింది. కస్టమర్ల భద్రతను దృష్టిలో ఉంచుకుని, ముందు జాగ్రత్త చర్యగా వీటిని వెనక్కి రప్పిస్తున్నట్లు కంపెనీ తెలిపింది. నిర్దిష్ట కాల వ్యవధిలో తయారైన మోటర్‌సైకిళ్ల గుర్తింపు నంబరు (వీఐఎన్) ఆధారంగా రాయల్ ఎన్ఫీల్డ్ సర్వీస్ బృందాలు లేదా స్థానిక డీలర్లు.. వాటి వినియోగదారులను సంప్రదిస్తారని పేర్కొంది. అలాగే ఈ సమస్య గురించి వినియోగదారులు స్వయంగా కంపెనీ వెబ్సైట్ ద్వారా తెలియజేయవచ్చని లేదా స్థానిక వర్క్‌షాపులను సంప్రదించవచ్చని తెలిపింది. -
మాటలన్నీ ఎమోజీలుగా మారిపోతాయా?
ప్రేమ..సంతోషం, అసూయ..బాధ ఇలా ఎన్నో భావాల్ని ఒక్క ఎమోజీతో చెప్పొచ్చు. మాట్లాడే అవసరం లేకుండా భావోద్వేగాల్ని వ్యక్తం చేయడంలో బాగా పాపులర్ అయ్యింది. అందుకే ప్రతి ఏడాది జులై 17న వరల్డ్ ఎమోజీడేని జరుపుకుంటాము.ఈ సందర్భంగా ఎమోజీ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. అమెరికాకు చెందిన ప్రముఖ సోషల్ మీడియా సంస్థ 'బంబుల్' వరల్డ్ ఎమోజీ సందర్భంగా ఏ ఎమోజీని ఎక్కువగా వినియోగిస్తున్నారో తెలుసుకునే ప్రయత్నం చేసింది. కరోనా కారణంగా ఎమోజీల వినియోగం 2020 నుంచి 2021 మధ్యకాలంలో 86శాతానికి పెరగడంతో పాటు సోషల్ మీడియా, డేటింగ్ సైట్లలో యాక్టీవ్ గా ఉన్నట్లు నిర్ధారించింది. ఇక ఇండియన్స్‌కు చెందిన మిలీనియల్స్!! (దాదాపు 22–37 సంవత్సరాల మధ్య ఉన్నయువత) క్లాసిక్ రెడ్ హార్ట్ ఎమోజీని ఎక్కువగా వినియోగిస్తున్నారు. ఈ ఎమోజీల్లో టాప్ 5లో ఉంది. రెడ్ హార్ట్, కన్నుగీటేది, కన్నీళ్లతో ఉన్న ఎమోజీ, సన్ గ్లాసెస్ ఎమోజీ, కళ్లతో నవ్వే స్మైల్‌ని వినియోగిస్తున్నారు. సోషల్ మీడియా ప్రొఫైళ్లలో నెటిజన్లు రెడ్ హార్ట్ ఎమోజీని వినియోగిస్తున్నారని బంబుల్ ఇండియా కమ్యూనికేషన్స్ డైరెక్టర్ సమర్పిత సమద్దర్ తెలిపారు. ఎమోజీ ఎలా పుట్టుకొచ్చింది. తొలిసారి ఎమోజీని అమెరికా 16వ అధ్యక్షుడు అబ్రహం లింకన్ ప్రసంగంతో వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తోంది. 1862లో లింకన్ తన ప్రసంగంలో పెట్టిన వివిధ రకాల ఆహభావాలు అభిమానుల్ని అలరించాయి. ఆ ఎక్స్‌ప్రెషన్స్‌లో కన్నుగీటేది బాగా పాపులర్ అయ్యింది. నాడు పలుమీడియా సంస్థలు పేపర్లలో ఆయన ప్రసంగం పక్కనే కన్ను గీటే ఎమోజీల్ని పెట్టారు. అలా ఎమోజీలు వెలుగులోకి వచ్చాయని చరిత్రకారులు చెబుతున్నారు. భవిష్యత్‌లో ఎమోజీలు ఇలా ఉంటాయా? బంబుల్ నివేదిక ప్రకారం ఎమోజీల వినియోగం ఎక్కువగా ఉండడంతో.. ఆయా కంపెనీలు యూజర్లను అట్రాక్ట్ చేసేలా వాయిస్‌ను సెండ్ చేస్తే దానికి తగ్గట్లు డీఫాల్ట్‌గా ఎమోజీ రెడీ అయ్యేలా డిజైన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. చదవండి: పిల్లల కోసం నెట్‌ఫ్లిక్స్ కొత్త ఫీచర్లు, ఖర్చు లేకుండా చూడొచ్చు! -
మూవీ మ్యాటర్స్ క్లాసిక్
-
క్లాసిక్
-
భారత మార్కెట్ లోకి పెబెల్
నాలుగు మోడళ్ల ఆవిష్కరణ అమెజాన్‌తో జట్టు న్యూఢిల్లీ: స్మార్ట్‌వాచ్‌ల తయారీ సంస్థ పెబెల్ దేశీ వేరబుల్ మార్కెట్లోకి అడుగుపెట్టింది. సంస్థ తాజాగా నాలుగు స్మార్ట్‌వాచ్ మోడళ్లను మార్కెట్లో ఆవిష్కరించింది. క్లాసిక్, టైమ్, టైమ్ స్టీల్, టైమ్ రౌండ్ అనే వీటి ధరలు రూ.5,999-రూ.15,999 శ్రేణిలో ఉన్నాయి. వీటి విక్రయాల కోసం సంస్థ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. కొత్త స్మార్ట్‌వాచ్‌లు ఆండ్రాయిడ్, ఐఫోన్ స్మార్ట్ఫోన్లలో పనిచేస్తాయని సంస్థ తెలిపింది. -
కోఠి మహిళా కళాశాల వార్షికోత్సవం
-
‘ఇండియన్’ సూపర్ బైక్స్
న్యూఢిల్లీ: పొలారిస్ ఇండియా కంపెనీ ఇండియన్ బ్రాండ్ మోటార్‌సైకిళ్లను బుధవారం భారత మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. అమెరికాకు చెందిన పొలారిస్ ఇండస్ట్రీస్‌కు అనుబంధంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న పొలారిస్ ఇండియా కంపెనీ ఇండియన్ బ్రాండ్ కింద మూడు మోడళ్లను అందిస్తోంది. చీఫ్ మోడల్లో క్లాసిక్(ధర రూ. 26.5 లక్షలు), వింటేజ్(ధర రూ. 29.5 లక్షలు), చీఫ్టైన్(ధర రూ. 33 లక్షలు) బైక్‌లను అందిస్తున్నామని పొలారిస్ ఇండియా ఎండీ పంకజ్ దుబే చెప్పారు. ఈ బైక్‌లను అమెరికా నుంచి దిగుమతి చేసుకొని ఇక్కడ విక్రయిస్తామని తెలిపారు. ఈ మూడు బైక్‌లకు బుకింగ్స్ ప్రారంభించామని, మార్చి నుంచి డెలివరీలు ప్రారంభిస్తామని తెలిపారు. బైక్స్ ప్రత్యేకతలు ఇవీ... వి-ట్విన్ ధండర్ స్ట్రోక్ 111 ఇంజిన్(1,811సీసీ)తో రూపొందిన ఈ సూపర్ బైక్‌ల్లో 6 గేర్లు, ఏబీఎస్, క్రూయిస్ కంట్రోల్, కీలెస్ ఇగ్నీషన్, అల్యూమినియం ఫ్రేమ్ వంటి ఫీచర్లున్నాయి. ఇక క్లాసిక్ బైక్‌లో టెలిస్కోపిక్ కార్ట్రిడ్జ్ ఫోర్క్ ఫీచర్ ఉండగా, వింటేజ్‌లో లెక్సన్ విండ్ షీల్డ్ ఫీచరుంది. చీఫ్టైన్లో టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, పవర్డ్ విండ్‌షీల్డ్, స్మార్ట్‌ఫోన్, బ్లూటూత్‌తో 100 వాట్స్ స్టీరియో సిస్టమ్ వంటి ప్రత్యేకతలున్నాయి. ఇండియన్ అనేది అమెరికాలో అత్యంత పురాతనమైన మోటార్‌సైకిల్ బ్రాండ్. ఇక్కడ హార్లే డేవిడ్సన్, ట్రయంఫ్‌తో పోటీపడనుంది.