
అదిరిపోయే లుక్‌తో రాయల్ ఎన్‌ఫీల్డ్ మరో కొత్త బైక్ ‘రాయల్ ఎన్‌ఫీల్డ్ గోవాన్ క్లాసిక్ 350’ను ను లాంచ్ చేసింది. అలనాటి బాబర్ మోటార్‌సైకిల్ శైలిలో ప్రముఖ క్లాసిక్ 350 మోడల్‌కు అప్‌డేట్ ఫీచర్లతో గోవాలో జరిగిన మోటోవెర్స్ 2024 ఈవెంట్‌లో ఈ బైక్‌ను కంపెనీ ఆవిష్కరించింది.
రాయల్ ఎన్‌ఫీల్డ్ గోవాన్ క్లాసిక్ 350 మోటార్‌సైకిల్ సింగిల్-టోన్ వేరియంట్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 2.35 లక్షలు కాగా డ్యూయల్-టోన్ మోడల్ ధర రూ. 2.38 లక్షలుగా కంపెనీ ప్రకటించింది. ఈ మోటార్‌సైకిల్ రేవ్ రెడ్, ట్రిప్ టీల్, పర్పుల్ హేజ్, షాక్ బ్లాక్ అనే నాలుగు కలర్ స్కీమ్‌లలో లభిస్తుంది.

కొత్త గోవాన్ క్లాసిక్ 350 ఇప్పటికే ఉన్న క్లాసిక్ 350 మోడల్‌కు సరికొత్త రూపంగా ఉంటుంది. బాబర్ తరహాలో విలక్షణంగా దీన్ని లుక్‌ను తీర్చిదిద్దారు. దీంట్లో చేసిన ముఖ్యమైన అప్‌గ్రేడ్‌ల విషయానికి వస్తే ఏప్ హ్యాంగర్ హ్యాండిల్‌బార్లు, ఫార్వర్డ్-సెట్ ఫుట్‌పెగ్‌లు, స్లాష్-కట్ ఎగ్జాస్ట్ పైపు వంటివి ఉన్నాయి.

క్లాసిక్ 350 లాగే గోవాన్ క్లాసిక్ 350 కూడా అదే 349సీసీ జె-సిరీస్ ఇంజన్‌తో వస్తుంది. ఫైవ్-స్పీడ్ గేర్‌బాక్స్‌తో వచ్చే సింగిల్-సిలిండర్, ఎయిర్-ఆయిల్ కూల్డ్ ఇంజిన్ 20.2 బీహెచ్‌పీ, 27 ఎన్‌ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment