Meteor
-
మానవ సృష్టి ఉల్కాపాతం
ప్రపంచ చరిత్రలో మానవులు సృష్టించిన మొట్టమొదటి ఉల్కాపాతం(మిటియోర్)గా డైమార్ఫోస్ ఉల్కపాతం రికార్డుకెక్కబోతోందని అంతరిక్ష పరిశోధకులు చెబుతున్నారు. భూగోళం వైపు దూసుకొస్తూ ముప్పుగా మారిన గ్రహశకలాలను దారి మళ్లించడానికి అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ ‘నాసా’ సైంటిస్టులు డబుల్–అస్టరాయిడ్ రీడైరెక్షన్ టెస్టు(డార్ట్) నిర్వహించారు. ఈ ప్రయోగం కోసం డైమార్ఫోస్ అనే గ్రహశకలాన్ని (అస్టరాయిడ్) ఎంచుకున్నారు. నిజానికి ఈ అస్టరాయిడ్తో భూమికి ముప్పు లేనప్పటికీ ప్రయోగానికి అనువుగా ఉండడంతో ఎంపిక చేశారు. ‘డార్ట్’లో భాగంగా 2021 నవంబర్ 24న స్పేస్‌క్రాఫ్ట్‌ను ప్రయోగించారు. ఇది 2022 సెపె్టంబర్ 26న భూమికి 1.1 కోట్ల కిలోమీటర్ల మైళ్లు) దూరంలో ఉన్న డైమార్ఫోస్‌ను గంటకు 13,645 కిలోమీటర్ల వేగంతో విజయవంతంగా ఢీకొట్టింది. దాంతో ఆ గ్రహశకలం దారిమళ్లింది. భవిష్యత్తులో గ్రహశకలాల నుంచి భూమికి ముప్పు తప్పించడానికి డార్ట్ ప్రయోగం దోహదపడింది. 10 లక్షల కిలోల రాళ్లు, దుమ్ము ధూళి: నాసా స్పేస్‌క్రాఫ్ట్ అత్యంత వేగంగా ఢీకొట్టడంతో డైమార్ఫోస్ నుంచి చిన్నచిన్న రాళ్లు, దుమ్ము ధూళీ వెలువడుతున్నట్లు గుర్తించారు. 2 మిలియన్ పౌండ్లకు (10 లక్షల కిలోలు) పైగా బరువైన రాళ్లు, దుమ్ము ధూళి వెలువడే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. వీటిని దాదాపు 7 రైలు పెట్టెల్లో నింపొచ్చు. వీటిలో కొన్ని ఇసుక పరిమాణంలో, మరికొన్ని సెల్‌ఫోన్ పరిమాణంలో ఉంటాయని చెబుతున్నారు. అయితే, డైమార్ఫోస్ నుంచి వెలువడిన రాళ్లు, ధూళి చివరకు ఎక్కడికి చేరుకుంటాయన్నది ఆసక్తికరంగా మారింది. ఇవి మరో 30 సంవత్సరాల్లోగా భూమి, అంగారక గ్రహాల సమీపంలోకి చేరుకుంటా యని చెబు తున్నారు. కొన్ని రాళ్లు, ధూళి మరో ఏడేళ్లలో అరుణ గ్రహానికి చేరే అవకాశం ఉందని అంటున్నారు. మరో పదేళ్లలో చిన్నపాటి రాళ్లు భూవాతావరణంలోకి ప్రవేశిస్తాయని అంచనా వేస్తున్నా రు. చాలా చిన్నవి కావడంతో ఇవి భూమి ని ఢీకొట్టినా ఎలాంటి ప్రమాదం ఉండదని భరో సా ఇస్తున్నారు. డైమార్ఫోస్ నుంచి వెలువడిన రాళ్లు, ధూళి ఉలా్కపాతాలుగా మారి భూమి, అంగారక గ్రహంపైకి చేరడం 100 సంవత్సరాలపాటు కొన సాగుతుందని ఇటలీలోని పాలిటెక్నిక్ యూనివర్సిటీ ఆఫ్ మిలన్కు చెందిన డీప్–స్పేస్ అస్ట్రోడైనమిక్స్ రీసెర్చ్ అండ్ టెక్నాలజీ గ్రూప్ పోస్టు డాక్టోరల్ పరిశోధకుడు అసెన్సియో చెప్పారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఆహా.. సూపర్ పవర్ భూమ్మీదకొచ్చిందా?.. వైరల్ వీడియోలు
ఉల్కాపాతం.. ఈ పేరు చాలామందికి తెలియంది కాదు. ఆకాశం నుంచి ప్రకాశవంతంగా దూసుకొస్తూ.. భూమ్మీద మీద పడే సమయంలో అవి మెరుస్తూ అద్భుతాన్ని తలపిస్తుంటాయి. అయితే.. తాజాగా శనివారం రాత్రి అలాంటి అనుభూతిని పొందారు స్పెయిన్, పోర్చుగల్ ప్రజలు. స్పెయిన్, పొరుగు దేశం పొర్చుగల్ ప్రజలు శనివారం రాత్రి ఆకాశంలో అరుదైన కాంతిని వీక్షించారు. నీలి రంగులో మెరుస్తూ ఉల్క ఒకటి భూమ్మీదకు రయ్‌మని దూసుకొచ్చింది. ఆ దృశ్యాలు సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. వాహనాల్లో వెళ్లే వాళ్లు, పార్టీలు చేసుకునేవాళ్లు.. అనుకోకుండా ఆ దృశ్యాలను బంధించారు. Tires, Cascais, Portugal. ☄️#Tires #Cascais#Portugal #Fireball #Meteor #meteoro #meteorito #España#Spainpic.twitter.com/HDtnhQEYG7— Mr. Shaz (@Wh_So_Serious) May 19, 2024అవి చూసి భూమ్మీదకు సూపర్ పవర్ ఏదైనా దూసుకొచ్చిందా? అంటూ ఆశ్చర్యపోతున్నారు పలువురు. తోక చుక్కలు, ఉల్కాపాతంను కనివినీ ఎరుగని ఒక జనరేషన్ అయితే.. ఈ దృశ్యాల్ని చూసి సంభ్రమాశ్చర్యాలకు లోనవుతోంది. ఇది ఏలియన్ల పనేనా?.. సూపర్ పవర్ ఏదైనా భూమ్మీదకు వచ్చిందా? అంటూ తమదైన ఎగ్జయిట్‌మెంట్‌ను ప్రదర్శిస్తోంది. A meteor lit up the sky with bright light during the night in Portugal and Spain.Source: X#Meteor #Spain #Portugal #Fireball #Sky #DTNext #DTnextNews pic.twitter.com/09Ma6GO0sg— DT Next (@dt_next) May 19, 2024అయితే ఆ ఉల్క ఎక్కడ పడిందనేదానిపై ఇంకా ఎలాంటి ప్రకటన వెలువడలేదు. అయితే కొందరు మాత్రం కాస్ట్రో డెయిర్లో పడిందని, మరికొందరేమో పిన్హెయిరోలో పడిందని చెబుతూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. JUST IN: Meteor spotted in the skies over Spain and Portugal.This is insane.Early reports claim that the blue flash could be seen darting through the night sky for hundreds of kilometers.At the moment, it has not been confirmed if it hit the Earth’s surface however some… pic.twitter.com/PNMs2CDkW9— Collin Rugg (@CollinRugg) May 19, 2024 రెండు వారాల కిందటే.. అక్కడి ఖగోళ శాస్త్రవేత్తలు ఉల్క పడొచ్చని అంచనా వేశారు. హెలీ తోకచుక్క నుంచి వెలువడే శకలాల కారణంగా రాబోయే రోజుల్లో ఉల్కాపాతం ఎక్కువే ఉండొచ్చని వాళ్లు అంచనా వేస్తున్నారు. -
ఆకాశంలో అద్భుతం.. ఆకుపచ్చ కాంతిలో ఉల్కపాతం
అంకారా: టర్కీలో శనివారం రాత్రి అద్భుత దృశ్యం అవిష్కృతమైంది. నిప్పలు చిమ్ముతూ నేలరాలాల్సిన ఉల్కపాతం.. గ్రీన్‌కలర్‌లో కాంతిని వెదజల్లుతూ భూమి వైపుకు దూసుకొచ్చింది. గుముషానే ప్రావిన్స్‌లోని ఎర్జురం నగరం ప్రాంతానికి వచ్చే సరిగి గ్రీన్ కలర్ రంగులో కాంతిని వెదజల్లిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. A large green meteor was spotted blazing through the sky in Turkey moments ago. Wow. pic.twitter.com/eQEYLG2ihB — Nahel Belgherze (@WxNB_) September 2, 2023 టర్కీలో రాత్రిపూట అంతా ప్రశాంతంగా ఉండగా.. ఒక్కసారిగా ఆకాశంలో నుంచి ఉల్కపాతం సంభవించింది. అయితే.. అది గ్రీన్ కలర్ రంగులో కాంతిని వెదజల్లింది. ఈ దృశ్యాలను చూపుతున్న వీడియోలో ఓ బాలుడు బెలూన్‌తో ఆడుకుంటున్నట్లు కనిపిస్తోంది. ఈ వీడియోను నహెల్ బెల్గెర్జ్ తన ట్విట్టర్ (ఎక్స్) వేదికగా షేర్ చేశారు. Green meteor lights up the sky over Turkey on Saturday.pic.twitter.com/Y89ORYz6CP — Science girl (@gunsnrosesgirl3) September 3, 2023 అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ(నాసా) ప్రకారం అంతరిక్షంలో దుమ్ము, దూళి కణాలు కలిగిన శిలలు భూవాతావరణంలో కిందికి పడిపోయినప్పుడు భారీ స్థాయిలో కాంతిని వెదజల్లుతాయి. అతి వేగంగా భూమి వైపుకు ప్రయాణిస్తాయి. అయితే.. తాజాగా టర్కీలో సంభవించిన ఘటనపై అధికారులు ఎలాంటి అధికారిక ధ్రువీకరణ ఇవ్వలేదు. గత వారంలో కొలరాడోలోనూ ఇలాంటి ఘటనే వెలుగులోకి వచ్చింది. తెల్లవారుజామున 3.30 సమయంలో ఉల్కలు నెలరాలాయి. Malatya, Erzurum, Elazığ, Gaziantep, Diyarbakır ve çevre illerden görülen büyük ve çok parlak bir göktaşı düşüşü gözlemlendi. İşte o anlar... ☄️👀 #göktaşı #meteor #malatya #erzincan #elazığ #gaziantep #malatya #erzurum pic.twitter.com/lDWTYGzAZM — Hava Forum (@HavaForum) September 2, 2023 ఇదీ చదవండి: Plane Crash: సంతోషంగా పార్టీ.. అందరూ చూస్తుండగా కళ్ల ముందే ఘోర ప్రమాదం! -
రాయల్‌ఎన్‌ఫీల్డ్ సూపర్ బైక్ వచ్చేసింది..సూపర్ ఫీచర్లతో
సాక్షి,ముంబై: స్టయిలిష్ అండ్ లగ్జరీ బైక్ మేకర్ రాయిల్ ఎన్ఫీల్డ్ మరో కొత్త బైక్‌ను లాంచ్ చేసింది. ఎప్పటినుంచో ఎదురు చూస్తున్న బైక్ ప్రియులను ఆకట్టుకునేలా అద్భుత ఫీచర్లతో 650 సీసీ క్రూయిజర్ ‘సూపర్ మెటోర్ 650’ బైక్‌ను తీసుకొచ్చింది. అతి త్వరలో భారతీయ మార్కెట్లలో కూడా సందడి చేయనుంది. రాయల్ ఎన్ఫీల్డ్ 350 సిరీస్‌లో భాగంగా ఇటలీలోని మిలన్లో జరుగుతున్న 2022 EICMA షోలో ఈకొత్త బైక్‌ను అధికారికంగా ఆవిష్కరించింది. క్లాసికల్ క్రూయిజర్ డిజైన్‌తో రెండు వేరియంట్లలో (స్టాండర్డ్ ,టూరర్) మొదటిది ఐదు రంగులలో, రెండోది రెండు రంగుల్లో ఆకర్షణీయ లుక్‌లో అదరగొడుతోంది. ఇంటర్‌సెప్టర్ 650, కాంటినెంటల్ జీటీ 650 ఆధారంగా, 6 స్పీడ్ ట్రాన్స్మిషన్, 648 సీసీ ట్విన్ ఇంజీన్‌ను ఇందులో అమర్చింది. 7,250 ఆర్ఎంపీ వద్ద 47 హెచ్‌పీ పవర్‌ను, 5650 ఆర్ఎంపీ వద్ద 52 గరిష్క టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. టియర్ డ్రాప్ ఆకారంలో 15.7 లీటర్ల ఫ్యూయల్ ట్యాంకును అమర్చింది. 19 ఇంచెస్ ఫ్రంట్ వీల్, 16 అంగుళాల అల్లాయ్ వీల్ కాంబినేషన్, ఫ్రంట్ 320 మిమీ డిస్క్ బ్రేక్, రియర్‌లో 300 డిస్క్ తో డ్యూయల్ -ఛానల్ ఏబిసి ఉంది. రౌండ్ LED హెడ్‌ల్యాంప్, ట్రిప్పర్ నావిగేషన్‌తో కూడిన డ్యూయల్-పాడ్ ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ , డ్యూయల్ ఎగ్జాస్ట్ లాంటి ఫీచర్లు ఉన్నాయి.భారతదేశంలో దాదాపు రూ. 3.4 లక్షల (ఎక్స్-షోరూమ్) ధర ఉంటుందని అంచనా. -
పండుగ వేళ ఆకాశంలో అద్భుతం...! అసలు విషయం తెలిస్తే షాకవుతారు..!
తెలంగాణ, మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాల్లో ఉగాది (ఏప్రిల్ 3) రోజున ఆకాశం నుంచి పదుల సంఖ్యలో ఉల్కలు నేలరాలుతూ కనువిందు చేసిన విషయం తెలిసిందే. గడ్చిరోలి, సిర్వంచ, వాంకిండి, కోటపల్లి ప్రాంతాల్లోని ప్రజలు ఈ అరుదైన దృశ్యాలను తమ స్మార్ట్ఫోన్లలో బంధిస్తూ తెగ సంబరపడిపోయారు. ఈ వీడియో కాస్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది. కాగా ఆకస్మాత్తుగా ఆకాశం నుంచి నేలరాలిన ఉల్కపాతంపై ఆస్ట్రోఫిజిక్స్ శాస్త్రవేత్తలు సంచలన విషయాలను తెలియజేశారు. అవి ఉల్కలు కాదు...! ఏప్రిల్ 2న ఆకాశంలో వెలుగులు విరజిమ్ముత్తూ కన్పించినవి ఉల్కలు కాదని ఆస్ట్రోఫిజిక్స్ సైంటిస్టులు నిర్ధారించారు. సెంటర్ ఫర్ ఆస్ట్రోఫిజిక్స్ ఖగోళ శాస్త్రవేత్త జోనాథన్ మెక్‌డోవెల్ ఈ ఉల్కాపాతంపై స్పందిస్తూ పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ‘ ఆకాశం నుంచి నేల రాలిన వస్తువులు ఉల్కలు కాదని అవి గతంతో డ్రాగన్ కంట్రీ చైనా ప్రయోగించిన రాకెట్ శకలాలని ట్విటర్లో పేర్కొన్నారు. #WATCH | Maharashtra: In what appears to be a meteor shower was witnessed over the skies of Nagpur & several other parts of the state. pic.twitter.com/kPUfL9P18R — ANI (@ANI) April 2, 2022 చైనా ఫిబ్రవరి 2021లో ప్రారంభించిన చాంగ్ జెంగ్ 3B సీరియల్ నంబర్ Y77 రాకెట్ మూడవ దశ భాగాలని అభిప్రాయపడ్డారు. ఇదే విషయంపై నాగ్‌పూర్‌కు చెందిన స్కైవాచ్ గ్రూప్ ప్రెసిడెంట్ సురేష్ చోపడే కూడా స్పందించారు. మహారాష్ట్ర-తెలంగాణ సరిహద్దులో కన్పించినా ఈ అరుదైన దృశ్యాలు ఉల్కలు కాదంటూ పేర్కొన్నారు. అవి శాటిలైట్‌కు సంబంధించిన గ్రహశకలాలని వెల్లడించారు. ఇదిలా ఉండగా మహారాష్ట్రలోని ఓ గ్రామంలో శాటిలైట్‌కు సంబంధించిన భారీ శకలాలు పడి ఉన్నట్లు గమనార్హం. I believe this is the reentry of a Chinese rocket stage, the third stage of the Chang Zheng 3B serial number Y77 which was launched in Feb 2021 - it was expected to reenter in the next hour or so and the track is a good match pic.twitter.com/BetxCknAiK — Jonathan McDowell (@planet4589) April 2, 2022 చదవండి: రష్యా-ఉక్రెయిన్ వార్ ఎఫెక్ట్...ఇన్ఫోసిస్ సంచలన నిర్ణయం..!