తెలంగాణ, మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాల్లో ఉగాది (ఏప్రిల్ 3) రోజున ఆకాశం నుంచి పదుల సంఖ్యలో ఉల్కలు నేలరాలుతూ కనువిందు చేసిన విషయం తెలిసిందే. గడ్చిరోలి, సిర్వంచ, వాంకిండి, కోటపల్లి ప్రాంతాల్లోని ప్రజలు ఈ అరుదైన దృశ్యాలను తమ స్మార్ట్‌ఫోన్లలో బంధిస్తూ తెగ సంబరపడిపోయారు. ఈ వీడియో కాస్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది. కాగా ఆకస్మాత్తుగా ఆకాశం నుంచి నేలరాలిన ఉల్కపాతంపై ఆస్ట్రోఫిజిక్స్ శాస్త్రవేత్తలు సంచలన విషయాలను తెలియజేశారు.
అవి ఉల్కలు కాదు...!
ఏప్రిల్ 2న ఆకాశంలో వెలుగులు విరజిమ్ముత్తూ కన్పించినవి ఉల్కలు కాదని ఆస్ట్రోఫిజిక్స్ సైంటిస్టులు నిర్ధారించారు. సెంటర్ ఫర్ ఆస్ట్రోఫిజిక్స్ ఖగోళ శాస్త్రవేత్త జోనాథన్ మెక్‌డోవెల్ ఈ ఉల్కాపాతంపై స్పందిస్తూ పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ‘ ఆకాశం నుంచి నేల రాలిన వస్తువులు ఉల్కలు కాదని అవి గతంతో డ్రాగన్ కంట్రీ చైనా ప్రయోగించిన రాకెట్ శకలాలని ట్విటర్‌లో పేర్కొన్నారు.
#WATCH | Maharashtra: In what appears to be a meteor shower was witnessed over the skies of Nagpur & several other parts of the state. pic.twitter.com/kPUfL9P18R
— ANI (@ANI) April 2, 2022
చైనా ఫిబ్రవరి 2021లో ప్రారంభించిన చాంగ్ జెంగ్ 3B సీరియల్ నంబర్ Y77 రాకెట్ మూడవ దశ భాగాలని అభిప్రాయపడ్డారు. ఇదే విషయంపై నాగ్‌పూర్‌కు చెందిన స్కైవాచ్ గ్రూప్ ప్రెసిడెంట్ సురేష్ చోపడే కూడా స్పందించారు. మహారాష్ట్ర-తెలంగాణ సరిహద్దులో కన్పించినా ఈ అరుదైన దృశ్యాలు ఉల్కలు కాదంటూ పేర్కొన్నారు. అవి శాటిలైట్‌కు సంబంధించిన గ్రహశకలాలని వెల్లడించారు. ఇదిలా ఉండగా మహారాష్ట్రలోని ఓ గ్రామంలో శాటిలైట్‌కు సంబంధించిన భారీ శకలాలు పడి ఉన్నట్లు గమనార్హం.
I believe this is the reentry of a Chinese rocket stage, the third stage of the Chang Zheng 3B serial number Y77 which was launched in Feb 2021 - it was expected to reenter in the next hour or so and the track is a good match pic.twitter.com/BetxCknAiK
— Jonathan McDowell (@planet4589) April 2, 2022
చదవండి: రష్యా-ఉక్రెయిన్ వార్ ఎఫెక్ట్...ఇన్ఫోసిస్ సంచలన నిర్ణయం..!
Comments
Please login to add a commentAdd a comment