
ప్రముఖ టూవీలర్ దిగ్గజం హోండా మోటార్‌సైకిల్స్ అండ్ స్కూటర్ ఇండియా భారత మార్కెట్లలోకి Honda CB300R బైక్‌ను బుధవారం రోజున మళ్లీ పరిచయం చేసింది. ఈ బైక్ ధర రూ. 2.77 లక్షలు(ఢిల్లీ, ఎక్స్‌షోరూమ్ ధర). 2022 Honda CB300R రెండు కలర్ వేరియంట్లో కొనుగోలుదారులకు అందుబాటులో ఉండనుంది. పెరల్ స్పార్టన్ రెడ్, మాట్ స్టీల్ బ్లాక్‌తో రానుంది. అంతకుముందు హోండా లాంచ్ చేసిన సీబీ300ఆర్‌మాదిరిగానే కొన్ని అదనపు హాంగులతో రానుంది. ఈ బైక్ కేవలం హోండా బిగ్‌వింగ్ టాప్‌లైన్ అవుట్‌లెట్లలోనే అందుబాటులో ఉండనుంది.
ఇంజిన్ విషయానికి వస్తే..!
2022 CB300R బైక్ BS-VI వేరియంట్‌తో రానుంది. ఇంజిన్ విషయానకి వస్తే 286.01cc సింగిల్-సిలిండర్, లిక్విడ్-కూల్డ్ మోటారును అమర్చారు. పవర్ , టార్క్ అవుట్‌పుట్‌లు ఎక్కడా రాజీపడకుండా 30.7hp పవర్‌ను, 27.5Nm గరిష్ట టార్క్‌ను 2022 CB300R ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 6-స్పీడ్ ట్రాన్స్‌మిషన్‌తో , స్లిప్, అసిస్ట్ క్లచ్‌తో జత చేయబడింది.
2022 Honda CB300R బైక్‌లో డిజైన్, స్టైలింగ్ పరంగా పెద్దగా ఎలాంటి మార్పు లేదు. నియో స్పోర్ట్స్ కేఫ్ స్ఫూర్తి సీబీ300ఆర్‌ను రూపొందించారు. చిన్న చిన్న మార్పులలో ఫ్యూయల్ ట్యాంక్, రేడియేటర్ గ్రిల్ క్రింద ఉన్న ష్రౌడ్‌పై మ్యాట్ బ్లాక్ ఫినిషింగ్‌తో వచ్చాయి. ఎగ్జాస్ట్ పైప్(సైలెన్సర్)పై గోల్డెన్ ఫినిషింగ్ ఉంది.
మిగిలిన భాగాలు 2019 మోడల్ బైక్‌లాగే ఉన్నాయి. 17-అంగుళాల వీల్స్‌తో, సస్పెన్షన్ సెటప్‌లో ముందువైపు 41ఎమ్‌ఎమ్ యూఎస్‌డీ ఫోర్క్, వెనుకవైపు 7-దశల మోనోషాక్ కల్గి ఉంది. ముందు భాగంలో 296mm డిస్క్ ఉండగా, వెనుక భాగంలో 220mm డిస్క్ బ్రేకింగ్ వ్యవస్థను మంచి సామర్థ్యంతో పనిచేస్తుంది. బైక్‌లో డ్యూయల్-ఛానల్ ABS(యాన్టీ బ్రేకింగ్ సిస్టమ్)ను ఏర్పాటు చేశారు.
చదవండి: Skoda: హల్‌చల్ చేస్తోన్న స్కోడా ఎలక్ట్రిక్ కారు..! రేంజ్ ఎంతంటే...?