హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ద్విచక్ర వాహన తయారీ దిగ్గజం హోండా మోటార్‌సైకిల్, స్కూటర్ ఇండియా (హెచ్‌ఎంఎస్‌ఐ) తాజాగా 100 సీసీ షైన్ 100 బైక్‌ను ఆవిష్కరించింది. మహారాష్ట్ర ఎక్స్‌షోరూంలో పరిచయ ఆఫర్ ధర రూ.64,900 ఉంది. డెలివరీలు మే నుంచి మొదలు కానున్నాయి. ఏడాదిలో 3 లక్షల యూనిట్ల విక్రయం లక్ష్యంగా చేసుకున్నట్టు కంపెనీ తెలిపింది. వచ్చే మూడు ఏళ్లలో దీనిని 6 లక్షల యూనిట్లకు తీసుకువెళతామని వివరించింది.
దేశంలో టూవీలర్ల మార్కెట్లో 100 సీసీ విభాగం మూడింట ఒక వంతు కైవసం చేసుకుంది. ద్విచక్ర వాహనాలకు డిమాండ్ తిరిగి పుంజుకోవడంతో గుజరాత్ ప్లాంటులో కొత్త తయారీ లైన్ ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్టు హోండా మోటార్‌సైకిల్, స్కూటర్ ఇండియా ఎండీ, ప్రెసిడెంట్, సీఈవో అట్సుషి ఒగటా తెలిపారు. షైన్ 100 రాకతో కంపెనీ చరిత్రలో తొలిసారిగా వచ్చే ఏడాది పూర్తి తయారీ సామర్థ్యంతో ప్లాంట్లు నడిచే అవకాశం ఉందన్నారు. దేశంలో గ్రామీణ ప్రాంతాల్లో హెచ్‌ఎంఎస్‌ఐకి 35 శాతం వాటా ఉంది. 2024 మార్చినాటికి భారత్‌లో హోండా ఎలక్ట్రిక్ స్కూటర్ రంగ ప్రవేశం చేయనుంది.
Comments
Please login to add a commentAdd a comment