Honda Motorcycle and Scooter India
-
హోండా 100 సీసీ షైన్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ద్విచక్ర వాహన తయారీ దిగ్గజం హోండా మోటార్‌సైకిల్, స్కూటర్ ఇండియా (హెచ్ఎంఎస్ఐ) తాజాగా 100 సీసీ షైన్ 100 బైక్‌ను ఆవిష్కరించింది. మహారాష్ట్ర ఎక్స్‌షోరూంలో పరిచయ ఆఫర్ ధర రూ.64,900 ఉంది. డెలివరీలు మే నుంచి మొదలు కానున్నాయి. ఏడాదిలో 3 లక్షల యూనిట్ల విక్రయం లక్ష్యంగా చేసుకున్నట్టు కంపెనీ తెలిపింది. వచ్చే మూడు ఏళ్లలో దీనిని 6 లక్షల యూనిట్లకు తీసుకువెళతామని వివరించింది. దేశంలో టూవీలర్ల మార్కెట్లో 100 సీసీ విభాగం మూడింట ఒక వంతు కైవసం చేసుకుంది. ద్విచక్ర వాహనాలకు డిమాండ్ తిరిగి పుంజుకోవడంతో గుజరాత్ ప్లాంటులో కొత్త తయారీ లైన్ ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్టు హోండా మోటార్‌సైకిల్, స్కూటర్ ఇండియా ఎండీ, ప్రెసిడెంట్, సీఈవో అట్సుషి ఒగటా తెలిపారు. షైన్ 100 రాకతో కంపెనీ చరిత్రలో తొలిసారిగా వచ్చే ఏడాది పూర్తి తయారీ సామర్థ్యంతో ప్లాంట్లు నడిచే అవకాశం ఉందన్నారు. దేశంలో గ్రామీణ ప్రాంతాల్లో హెచ్ఎంఎస్ఐకి 35 శాతం వాటా ఉంది. 2024 మార్చినాటికి భారత్‌లో హోండా ఎలక్ట్రిక్ స్కూటర్ రంగ ప్రవేశం చేయనుంది. -
హోండా డియో స్పోర్ట్స్ లాంచ్, ఆశ్చర్యంగా ధర తక్కువే!
సాక్షి,ముంబై: హోండా మోటార్ సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా కొత్త స్పోర్టీ బైక్‌ను మార్కెట్లో విడుదల చేసింది. హోండా డియో స్పోర్ట్స్ పేరుతో రెగ్యులర్ డియో మోటో-స్కూటర్ స్పోర్టీ వెర్షన్‌గా లాంచ్ చేసింది. అయితే లిమిటెడ్ ఎడిషన్‌గా తీసుకొచ్చిన హోండా స్పోరర్ట్స్ పరిమిత కాలంలోనే అందుబాటులో ఉంటుంది. స్టాండర్డ్ వేరియంట్ ధర 68,317/- (ఎక్స్-షోరూమ్). టాప్-ఎండ్ డీలక్స్ వేరియంట్ ధర రూ. 73,317 (ఎక్స్-షోరూమ్) గా కంపెనీ ప్రకటించింది. రెగ్యులర్ డియో స్టాండర్డ్ , డీలక్స్ ధర రూ. 73,599, రూ. 77,099 (ఎక్స్-షోరూమ్)ధరలతో పోలిస్తే కొత్త లిమిటెడ్ ఎడిషన్ ధరలు చౌకగా ఉండటం విశేషం. ఆకర్షణీయమైన గ్రాఫిక్స్ స్పోర్టీ రెడ్ రియర్ సస్పెన్షన్‌తో తీసుకొచ్చిన హోడా డియో స్పోర్ట్స్ స్కూటర్ బ్లాక్‌తో స్ట్రోంటియమ్ సిల్వర్ మెటాలిక్ ,స్పోర్ట్స్ రెడ్ విత్ బ్లాక్ 2 కలర్ స్కీమ్‌లలో వస్తుంది. డీలక్స్ వేరియంట్ అదనంగా అల్లాయ్ వీల్స్‌ను అందిస్తుంది. 110 cc PGM-FI ఇంజిన్‌తో మెరుగైన స్మార్ట్ పవర్ (eSP) సాంకేతికతను అందిస్తుంది. టెలిస్కోపిక్ సస్పెన్షన్, ఇంటిగ్రేటెడ్ డ్యూయల్ ఫంక్షన్ స్విచ్, ఎక్స్టర్నల్ ఫ్యూయల్ లిడ్, పాస్ స్విచ్ , ఇంజన్ కట్-ఆఫ్‌తో కూడిన సైడ్ స్టాండ్ ఇండికేటర్ ప్రధాన ఫీచర్లుగా ఉన్నాయి. ఇంకా డియో స్పోర్ట్స్‌లో హోండా కాంబి-బ్రేక్ సిస్టమ్ (CBS) ఈక్వలైజర్, 3-స్టెప్ అడ్జస్టబుల్ రియర్ సస్పెన్షన్, మెరుగైన ఇంధన సామర్థ్యం కోసం 3-స్టెప్ ఎకో ఇండికేటర్‌ని జోడించింది. -
హోండా సరికొత్త రికార్డులు.. ఏకంగా 30 లక్షలకుపైగా..
ప్రముఖ టూవీలర్ దిగ్గజం హోండా మోటార్ సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా(హెచ్ఎంఎస్ఐ) సరికొత్త రికార్డులను నెలకొల్పింది. భారత్ నుంచి సుమారు 30 లక్షల యూనిట్ల టూవీలర్ వాహనాలను ఇతర దేశాలకు ఎగుమతి చేసింది. భారీ డిమాండ్..! హోండా మోటార్ సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా 21 వ వసంతంలోకి అడుగుపెట్టింది. ఈ అరుదైన ఘనతతో భారత్‌లో అగ్రశ్రేణి స్కూటర్ ఎగుమతిదారుగా హోండా స్థానాన్ని మరింత బలోపేతం చేసింది. ఇటీవలి కాలంలో హోండాకు ఇతర దేశాల్లో భారీ డిమాండ్ నెలకొంది. దీంతో అమ్మకాలు భారీగా పెరిగాయి. 2001లో హోండా ఎగుమతులను మొదలుపెట్టగా...15 లక్షల యూనిట్లను ఎగుమతి చేయడానికి సుమారు 16 సంవత్సరాల సమయం పట్టింది. కాగా మరో 15 లక్షల యూనిట్ల ఎగుమతులను కేవలం ఐదేళ్లలోనే సాధించడం గమనార్హం. ఈ అమ్మకాలు మునుపటి కంటే మూడు రెట్లు అధికం. 18 పైగా ఎగుమతులు..! తొలిసారి యాక్టివా టూవీలర్ బైక్‌ను 2001లో ఎగుమతి చేసింది. ఇప్పటి వరకు 18పైగా టూవీలర్ వాహనాలను హోండా ఇతర దేశాలకు ఎగుమతి చేస్తోంది. దేశీయ మార్కెట్లో టూవీలర్ అమ్మకాల జాబితాలో హోండా యాక్టివా రెండవ స్థానంలో నిలిచింది. ఎగుమతుల్లో హోండా డియో తొలి స్థానాన్ని కైవసం చేసుకుంది. భారత్ నుంచి నవీ, డియో, ఎక్స్-బ్లేడ్, డ్రీమ్, సీబీ షైన్, హార్నెట్, యునికార్న్, యాక్టివా, సీబీ350 వంటివి భారీగా ఎగుమతి అయ్యాయి. చదవండి: పెట్రోల్‌పై రూ.100 ఖర్చు చేసే వారు.. భవిష్యత్తులో వాటితో కేవలం రూ. 10 ఖర్చు చేయొచ్చు -
హోండా బంపరాఫర్..! ఆ బైక్‌పై ఏకంగా రూ. లక్ష తగ్గింపు..!
ప్రముఖ టూవీలర్ దిగ్గజం హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా (హెచ్ఎంఎస్ఐ) మిడ్వెయిట్ అడ్వెంచర్ బైక్‌పై ఏకంగా రూ. లక్షకు పైగా ధరను తగ్గించింది. హోండా మోటార్స్‌లోని సీబీ500ఎక్స్ బైక్ ధరలను కంపెనీ సవరించింది. సవరించిన ధరలు ఇలా..! గత ఏడాది మార్చి 2021లో హోండా CB500X బైక్ హోండా భారత్ మార్కెట్లలో లాంచ్ చేసింది. ఈ మోటార్‌సైకిల్ ధర రూ. 1.08 లక్షల తగ్గింపును పొందింది. దీంతో రూ. 5.79 లక్షలకు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) కొనుగోలుదారులకు అందుబాటులో ఉండనుంది. కొద్దిరోజుల క్రితం హోండా సీబీ500ఎక్స్ పూర్తిగా కొత్త హాంగులతో తొలుత యూరప్ మార్కెట్లలోకి వచ్చింది. ఈ మోడల్ భారత్‌లో త్వరలో వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే కొత్త మోడల్‌ను ప్రవేశపెట్టే క్రమంలో పాత హోండా CB500X మోడల్ ధరను తగ్గించినట్లు తెలుస్తోంది. ఇంజిన్ విషయానికి వస్తే.. హోండా సీబీ500ఎక్స్ బైక్‌లో 471 cc సమాంతర-ట్విన్ సిలిండర్, 8-వాల్వ్, లిక్విడ్-కూల్డ్ ఇంజన్‌ను ఏర్పాటు చేశారు. ఇది 8,500 rpm వద్ద 47 bhp సామర్థంతో, 6,500 rpm వద్ద 43.2 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ బైక్‌లో 6-స్పీడ్ గేర్‌బాక్స్‌ను జత చేశారు. ఈ బైక్ ప్రస్తుతం గ్రాండ్ ప్రిక్స్ రెడ్ మరియు మ్యాట్ గన్‌పౌడర్ బ్లాక్ మెటాలిక్ అనే రెండు రంగులలో అందుబాటులో ఉంది. చదవండి: స్కూటర్ల కొనుగోలుపై ప్రత్యేక ఆఫర్లను ప్రకటించిన యహహా మోటార్స్..! -
సరికొత్తగా హోండా సీబీఆర్300ఆర్ బైక్..! ధర ఎంతంటే...?
ప్రముఖ టూవీలర్ దిగ్గజం హోండా మోటార్‌సైకిల్స్ అండ్ స్కూటర్ ఇండియా భారత మార్కెట్లలోకి Honda CB300R బైక్‌ను బుధవారం రోజున మళ్లీ పరిచయం చేసింది. ఈ బైక్ ధర రూ. 2.77 లక్షలు(ఢిల్లీ, ఎక్స్‌షోరూమ్ ధర). 2022 Honda CB300R రెండు కలర్ వేరియంట్లో కొనుగోలుదారులకు అందుబాటులో ఉండనుంది. పెరల్ స్పార్టన్ రెడ్, మాట్ స్టీల్ బ్లాక్‌తో రానుంది. అంతకుముందు హోండా లాంచ్ చేసిన సీబీ300ఆర్మాదిరిగానే కొన్ని అదనపు హాంగులతో రానుంది. ఈ బైక్ కేవలం హోండా బిగ్‌వింగ్ టాప్‌లైన్ అవుట్లెట్లలోనే అందుబాటులో ఉండనుంది. ఇంజిన్ విషయానికి వస్తే..! 2022 CB300R బైక్ BS-VI వేరియంట్‌తో రానుంది. ఇంజిన్ విషయానకి వస్తే 286.01cc సింగిల్-సిలిండర్, లిక్విడ్-కూల్డ్ మోటారును అమర్చారు. పవర్ , టార్క్ అవుట్‌పుట్‌లు ఎక్కడా రాజీపడకుండా 30.7hp పవర్‌ను, 27.5Nm గరిష్ట టార్క్‌ను 2022 CB300R ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 6-స్పీడ్ ట్రాన్స్‌మిషన్‌తో , స్లిప్, అసిస్ట్ క్లచ్‌తో జత చేయబడింది. 2022 Honda CB300R బైక్‌లో డిజైన్, స్టైలింగ్ పరంగా పెద్దగా ఎలాంటి మార్పు లేదు. నియో స్పోర్ట్స్ కేఫ్ స్ఫూర్తి సీబీ300ఆర్‌ను రూపొందించారు. చిన్న చిన్న మార్పులలో ఫ్యూయల్ ట్యాంక్, రేడియేటర్ గ్రిల్ క్రింద ఉన్న ష్రౌడ్‌పై మ్యాట్ బ్లాక్ ఫినిషింగ్‌తో వచ్చాయి. ఎగ్జాస్ట్ పైప్(సైలెన్సర్)పై గోల్డెన్ ఫినిషింగ్ ఉంది. మిగిలిన భాగాలు 2019 మోడల్ బైక్‌లాగే ఉన్నాయి. 17-అంగుళాల వీల్స్‌తో, సస్పెన్షన్ సెటప్‌లో ముందువైపు 41ఎమ్ఎమ్ యూఎస్డీ ఫోర్క్, వెనుకవైపు 7-దశల మోనోషాక్ కల్గి ఉంది. ముందు భాగంలో 296mm డిస్క్ ఉండగా, వెనుక భాగంలో 220mm డిస్క్ బ్రేకింగ్ వ్యవస్థను మంచి సామర్థ్యంతో పనిచేస్తుంది. బైక్‌లో డ్యూయల్-ఛానల్ ABS(యాన్టీ బ్రేకింగ్ సిస్టమ్)ను ఏర్పాటు చేశారు. చదవండి: Skoda: హల్చల్ చేస్తోన్న స్కోడా ఎలక్ట్రిక్ కారు..! రేంజ్ ఎంతంటే...? -
హోండా బీఎస్–6 డియో స్కూటర్
బెంగళూరు: హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా కంపెనీ డియో మోడల్లో బీఎస్–6 వేరియంట్‌ను బెంగళూరు మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. ఈ స్కూటర్ ధరలు రూ.64,584(ఎక్స్ షోరూమ్, బెంగళూరు) నుంచి ఆరంభమవుతాయని కంపెనీ తెలిపింది. ఈ స్కూటర్ రెండు వేరియంట్లు–స్టాండర్డ్, డీలక్స్ల్లో లభ్యమవుతుందని వెల్లడించింది. మార్కెట్లోకి విడుదల చేసిన రోజే 301 స్కూటర్లను డెలివరీ చేశామని పేర్కొంది. దక్షిణాదిలో తమదే నంబర్ వన్ టూ వీలర్ బ్రాండని, ఈ ప్రాంతంతో తమ మార్కెట్ వాటా 34 శాతమని వివరించింది. -
మార్కెట్లోకి ‘హోండా యాక్టివా 6జీ’
ముంబై: ద్విచక్ర వాహన తయారీ సంస్థ హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా లిమిటెడ్ (హెచ్ఎంఎస్ఐ).. భారత్ స్టేజ్ (బీఎస్)–6 ఉద్గార నిబంధనలకు అనుగుణంగా ఉన్న మరో స్కూటర్‌ను గురువారం మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. ‘యాక్టివా 6జీ’ పేరిట విడుదలైన ఈ అధునాతన స్కూటర్ స్టాండర్డ్, డీలక్స్ వేరియంట్లలో లభిస్తుండగా.. వీటి ధరల శ్రేణి రూ. 63,912– 65,412 (ఎక్స్–షోరూం, ఢిల్లీ) వద్ద నిర్ణయించింది. మును పటి మోడలైన స్టాండర్డ్ 5జీతో పోల్చితే నూతన స్కూటర్ ధర రూ.7,978 అధికం కాగా, డీలక్స్ ధర రూ. 7,613 ఎక్కువగా ఉంది. ‘బీఎస్–6 నూతన ఉద్గార ప్రమాణాలతో కూడిన మూడవ యాక్టివా ఇది. ఈ నెలాఖరుకు లేదా ఫిబ్రవరి మొదటివారంలో ఇది అందుబాటులోకి వస్తుంది’ అని కంపెనీ సేల్స్ అండ్ మార్కెటింగ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ వై.ఎస్ గులేరియా తెలిపారు. -
హోండా మానెసర్ ప్లాంట్ మూసివేత
న్యూఢిల్లీ: హర్యానాలోని మానెసర్ ప్లాంట్‌ను మూసివేసినట్లు ప్రముఖ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా (హెచ్ఎంఎస్ఐ) మంగళవారం ప్రకటించింది. ఆందోళనలో ఉన్న కారి్మకులతో చర్చలు విఫలం కావడం వల్ల ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. నవంబర్ 11 (సోమవారం) నుంచే ఈ నిర్ణయం అమల్లో ఉండగా.. మళ్లీ తిరిగి ప్లాంట్ ఎప్పుడు ప్రారంభమౌతుందనే విషయాన్ని కంపెనీ వెల్లడించలేదు. -
హోండా ‘సీబీఆర్650ఆర్’ స్పోర్ట్స్ బైక్
న్యూఢిల్లీ: ద్విచక్ర వాహన తయారీ కంపెనీ ‘హోండా మోటర్ సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా’ (హెచ్ఎంఎస్ఐ).. ‘సీబీఆర్650ఆర్’ పేరుతో కొత్త స్పోర్ట్స్ బైక్‌ను సోమవారం మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. సీబీఆర్650ఎఫ్ స్థానాన్ని భర్తీ చేస్తూ విడుదలైన ఈ బైక్.. 649–సీసీ లిక్విడ్ కూల్డ్ ఫోర్ సిలిండర్ ఇంజిన్‌తో అందుబాటులోకి వచ్చింది. బైక్ ధర రూ.7.7 లక్షలుగా కంపెనీ ప్రకటించింది. ఈ సందర్భంగా హెచ్ఎంఎస్ఐ సేల్స్ అండ్ మార్కెటింగ్ విభాగం సీనియర్ వైస్ ప్రెసిడెంట్ యద్వీందర్ సింగ్ గులేరియా మాట్లాడుతూ.. ‘గతవారంలోనే కొత్త ప్రీమియం బిగ్ బైక్ వర్టికల్‌పై ప్రకటన చేశాం. ఇందుకు అనుగుణంగా హోండా బిగ్‌వింగ్ క్యాటగిరిలో ఈ నూతన బైక్ విడుదలైంది’ అని అన్నారు. -
‘సీబీ యూనికార్న్’ కొత్త
న్యూఢిల్లీ: హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా (హెచ్ఎంఎస్ఐ) తన పాపులర్ మోటార్‌సైకిళ్లలో నూతన వేరియంట్లను బుధవారం విడుదలచేసింది. ఇందులో భాగంగా ‘సీబీ యూనికార్న్’ను అధునాతన ఫీచర్లతో అప్డేట్ చేసి మార్కెట్‌కు పరిచయంచేసింది. యాంటీ–లాక్ బ్రేకింగ్ సిస్టమ్ (ఏబీఎస్) కలిగిన ఈ 150సీసీ బైక్ ధర రూ.78,815. కాంబి–బ్రేకింగ్ వ్యవస్థ(సీబీఎస్)ను కలిగిన ‘సీబీ షైన్’ డ్రమ్ వేరియంట్ ధర రూ.58,338 కాగా, ఇదే వ్యవస్థతో విడుదలైన ‘సీడీ110 డ్రీమ్’ ధర రూ.50,028.. ‘నవీ’ 2019 సీబీఎస్ -
రూ.15 వేలతో హోండా సూపర్ బైక్ ప్రీ బుకింగ్
సాక్షి, న్యూఢిల్లీ: హోండా మోటార్ సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా (హెచ్ఎమ్ఎస్ఐ) తన రాబోయే బైక్‌కోసం బుకింగ్స్‌ను ప్రారంభించింది. మిడ్ రేంజ్ స్పోర్ట్ బైక్ మోడల్ సీబీఆర్ 650 ఆర్ బుకింగ్‌లను బుధవారంనుంచి మొదలుపెట్టినట్టు ప్రకటించింది. దీని ధరను రూ. 8లక్షలు లోపే ఉండవచ్చని తెలిపింది. 22 నగరాల్లో ఉన్నతమ డీలర్ల ద్వారా రూ.15వేల డౌన్ పేమెంట్ ఈ బైక్‌ను ముందస్తుగా బుక్ చేసుకోవచ్చని సంస్థ వైస్ ప్రెసిడెంట్ యాదవిందర్ సింగ్ గులేరియా ప్రకటించారు. 649 సీసీ లిక్విడ్ కూల్డ్ ఫోర్ సిలిండర్ ఇంజీన్, డ్యుయల్ చానల్ ఏబీఎస్ మోడల్ (యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్) ఆధునిక సెక్యూరిటీ ఫీచర్లు ఈ బైక్ సొంతం. గ్రాండ్ ప్రిక్స్ రెడ్, మెటాలిక్ బ్లాక్ రెండు రంగుల్లో లభ్యం కానుంది. -
హోండా విస్తరణ వ్యూహాలు : బైక్‌లపై భారీ తగ్గింపు
సాక్షి, న్యూఢిల్లీ: ప్రముఖ ద్విచక్ర వాహనాల ఉత్పత్తుల సంస్థ హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా (హెచ్ఎంఎస్ఐ) మరో టూ వీలర్ దిగ్గజానికి షాకిచ్చేలా దూసుకుపోతోంది. వచ్చే ఏడాది నాటికి డబుల్ డిజిట్ గ్రోత్ సాధన లక్ష్యంగా పెట్టుకున్నట్టు ప్రకటించింది. 2019 ఆర్థిక సంవత్సరంలో రూ .800 కోట్ల పెట్టుబడులతోపాటు వరుసగా మూడేళ్ల పాటు రెండంకెల వృద్ధిరేటు లక్ష్యంగా పెట్టుకున్నామని హెచ్ఎంఎస్ఐ అధ్యక్షుడు, సీఈఓ మనోరు కటో మంగళవారం తెలిపారు. త్వరలోనే ఒక కొత్త ప్రొడక్ట్‌ను ప్రారంభిస్తామన్నారు. దీంతో తమ ఉనికిని, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో పెంచుతామన్నారు. అలాగే ఈ ఏడాదిలో 18 ఇతర ఉత్పత్తులను అప్‌గ్రేడ్ చేస్తామని ఆయన ప్రకటించారు. 2018-19 నాటికి, గత ఆర్థిక సంవత్సరంలో 5,700 అవుట్లెట్ల నుంచి 6వేల టచ్ పాయింట్స్‌ను పెంచుతామని తద్వారా విక్రయాల నెట్‌వర్క్‌ను విస్తరించాలని యోచిస్తోంది. అయితే 2020 నాటికి టూవీలర్ ఇండస్ట్రీ బీఎస్-6 ఎమిషన్ నిబంధనలకు అప్‌గ్రేడ్‌తో ధరలు పెరిగే అవకాశం ఉందని చెప్పారు. బైక్‌లపై భారీగా ధర తగ్గింపు మరోవైపు ఫ్లాగ్షిప్ సూపర్‌బైక్ మోడళ్లపై ధరలను భారీగా తగ్గించింది. సీబీఆర్1000ఆర్ఆర్ ఫైర్‌బ్లేడ్ మోడల్స్‌పై రూ. 2.5లక్షల వరకు ధరను తగ్గించినట్లు హోండా తెలిపింది. దిగుమతి చేసుకునే పూర్తిగా నిర్మితమైన యూనిట్ల(కంప్లీట్లీ బిల్ట్ యూనిట్స్)పై సుంకాన్ని 25శాతం తగ్గిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఈ ప్రయోజనాలను వినియోగదారులకు బదిలీ చేసేందుకే బైక్‌లపై ధరలను తగ్గించినట్టు చెప్పింది. సవరించిన ధరల ప్రకారం.. హోండా సీబీఆర్1000ఆర్ఆర్ మోడల్ ధర రూ. 16.79లక్షల(ఎక్స్‌షోరూం దిల్లీ) నుంచి రూ. 14.78లక్షలకు (ఎక్స్‌షోరూం దిల్లీ) పడిపోయింది. ఇక సీబీఆర్1000ఆర్ఆర్ ఎస్పీ మోడల్ ధర రూ. 21.22లక్షల(ఎక్స్‌షోరూం దిల్లీ) నుంచి రూ. 18.68లక్షలకు(ఎక్స్‌షోరూం దిల్లీ) తగ్గింది. ఈ న్యూ జెనరేషన్ ఫైర్‌బ్లేడ్ మోడళ్లను హోండా గతేడాది భారత మార్కెట్లోకి తీసుకొచ్చింది. కాగా.. ఇప్పటికే బీఎండబ్ల్యూ, డుకాటి, సుజుకీ, హర్లీ డేవిడ్సన్, యమహా కూడా తాము దిగుమతి చేసుకుంటున్న సీబీయూ ఉత్పత్తులపై ధరలను తగ్గిస్తున్నట్లు ప్రకటించాయి 2018 ఆర్థిక సంవత్సరంలో, హోండా అమ్మకాలు 22శాతం పెరుగుదల నమోదు చేసింది. 6.12 మిలియన్ యూనిట్లను విక్రయించింది. అంతేకాదు 7.59 మిలియన్ యూనిట్ల విక్రయాలతో 2016-17 లో ప్రధాన ప్రత్యర్థి హీరో మోటోను అధిగమించింది. దేశంలోనే అతిపెద్ద స్కూటర్ తయారీదారుగా ఉన్న సంస్థ దేశంలో 50శాతం స్కూటర్లను విక్రయిస్తోంది. హర్యానాలోని మనేసర్‌లో, రాజస్థాన్‌లోని తపుకారాలో, కర్ణాటకలోని నరస్పురా, గుజరాత్‌లోని విఠలాపూర్లలో ప్రస్తుతం నాలుగు కర్మాగారాలలో 6.4 మిలియన్ యూనిట్ల ఉత్పత్తి సామర్ధ్యం కలిగి ఉంది. -
హోండా యాక్టివా @ కోటి అమ్మకాలు
న్యూఢిల్లీ: హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా(హెచ్ఎంఎస్ఐ) కంపెనీ యాక్టివా స్కూటర్ మోడల్ కోటి అమ్మకాల మైలురాయిని సాధించింది. 2001లో ఈ మోడల్‌ను మార్కెట్లోకి తెచ్చామని హెచ్ఎంఎస్ఐ ప్రెసిడెంట్, సీఈఓ కీత మురమత్సు చెప్పారు. భారత్‌లో స్కూటర్ సెగ్మెంట్‌కు పునరుత్తేజం ఇచ్చిన ఈ మోడల్ ప్రస్తుతం అగ్రస్థానంలో ఉందని వివరించారు. పదేళ్ల క్రితం భారత్‌లో అత్యధికంగా అమ్ముడయ్యే టూవీలర్గా స్కూటర్ మోడల్ నిలుస్తుందని ఎవరూ ఊహించలేదని కంపెనీ సీనియర్ వైస్-ప్రెసిడెంట్ (సేల్స్ అండ్ మార్కెటింగ్) యధ్‌విందర్ సింగ్ గులేరియా చెప్పారు. మార్కెట్లోకి తెచ్చిన తొలి ఏడాదిలోనే 55 వేల యాక్టివా స్కూటర్లు అమ్ముడయ్యాయని, దేశీయ మార్కెట్లో గతేడాది 21 లక్షలు అమ్ముడయ్యాయని వివరించారు. -
హోండా నుంచి టూరింగ్ బైక్
న్యూఢిల్లీ: హోండా మోటార్ సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా (హెచ్ఎంఎస్ఐ) టూరింగ్ మోటార్ సైకిల్, గోల్డ్ వింగ్-జీఎల్ 1800ను భారత మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. ఈ బైక్‌ను రెండు వేరియంట్లలో అందిస్తున్నామని హెచ్ఎంఎస్ఐ ప్రెసిడెంట్, సీఈఓ కీత మురమత్సు చెప్పారు. గోల్డ్ వింగ్ ఆడియో కంఫర్ట్ ధర రూ.28.5 లక్షలని, గోల్డ్ వింగ్ ఎయిర్‌బ్యాగ్(ఎయిర్‌బ్యాగ్‌తో కూడిన మోడల్) ధర రూ. 31.5 లక్షలని (రెండు ధరలు ఎక్స్ షోరూమ్, ఢిల్లీ) పేర్కొన్నారు. ఆరు సిలిండర్లు, 1,832 సీసీ ఇంజిన్‌తో లభిస్తున్న ఈ బైక్‌ల్లో వినూత్నమైన ఫీచర్లున్నాయని వివరించారు. సీట్లను అడ్జస్ట్ చేసుకోవచ్చని, కాళ్లను వేడిబరిచే సిస్టమ్ ఉందని, 6-స్పీకర్ల సరౌండ్ సౌండ్ సిస్టమ్, కంబైన్డ్ బ్రేకింగ్ సిస్టమ్, యాంటీ లాకింగ్ బ్రేకింగ్ సిస్టమ్ కూడా ఉన్నాయని తెలిపారు. చిన్న చిన్న సందుల్లో, పార్కింగ్ ప్రదేశాల్లో సులభంగా రివర్స్ చేసుకునేలా ఎలక్ట్రిక్ రివర్స్ సిస్టమ్ ఈ బైక్ ప్రత్యేకత అని వివరించారు. ఈ బైక్ లగేజ్ కెపాసిటీ 150 లీటర్లని, ఎలక్ట్రానిక్ క్రూయిజ్-కంట్రోల్ సిస్టమ్ ఉందని వివరించారు. ఈ బైక్‌ను ప్రపంచవ్యాప్తంగా 1975లో మా ర్కెట్లోకి తెచ్చామని, బైక్‌ల మీద యాత్రలు చేయాలనుకునే ఔత్సాహికులకు ఇది ఫేవరెట్ బైక్ అని పేర్కొన్నారు. భారత్‌లో టూరింగ్ కల్చర్ పెరుగుతోందని, ఈ ధోరణి మరింత పెరగడానికి గోల్డ్ వింగ్ బైక్ తోడ్పడగలదని హెచ్ఎంఎస్ఐ వైస్ ప్రెసిడెంట్ (సేల్స్, మార్కెటింగ్) యధ్‌విందర్ సింగ్ గులేరియా చెప్పారు.