ప్రముఖ టూవీలర్ దిగ్గజం హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా (హెచ్‌ఎంఎస్‌ఐ) మిడ్‌వెయిట్ అడ్వెంచర్ బైక్‌పై ఏకంగా రూ. లక్షకు పైగా ధరను తగ్గించింది. హోండా మోటార్స్‌లోని సీబీ500ఎక్స్ బైక్ ధరలను కంపెనీ సవరించింది.
సవరించిన ధరలు ఇలా..!
గత ఏడాది మార్చి 2021లో హోండా CB500X బైక్ హోండా భారత్ మార్కెట్లలో లాంచ్ చేసింది. ఈ మోటార్‌సైకిల్ ధర రూ. 1.08 లక్షల తగ్గింపును పొందింది. దీంతో రూ. 5.79 లక్షలకు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) కొనుగోలుదారులకు అందుబాటులో ఉండనుంది. కొద్దిరోజుల క్రితం హోండా సీబీ500ఎక్స్ పూర్తిగా కొత్త హాంగులతో తొలుత యూరప్ మార్కెట్లలోకి వచ్చింది. ఈ మోడల్ భారత్‌లో త్వరలో వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే కొత్త మోడల్‌ను ప్రవేశపెట్టే క్రమంలో పాత హోండా CB500X మోడల్ ధరను తగ్గించినట్లు తెలుస్తోంది.
ఇంజిన్ విషయానికి వస్తే..
హోండా సీబీ500ఎక్స్ బైక్‌లో 471 cc సమాంతర-ట్విన్ సిలిండర్, 8-వాల్వ్, లిక్విడ్-కూల్డ్ ఇంజన్‌ను ఏర్పాటు చేశారు. ఇది 8,500 rpm వద్ద 47 bhp సామర్థంతో, 6,500 rpm వద్ద 43.2 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ బైక్‌లో 6-స్పీడ్ గేర్‌బాక్స్‌ను జత చేశారు. ఈ బైక్ ప్రస్తుతం గ్రాండ్ ప్రిక్స్ రెడ్ మరియు మ్యాట్ గన్‌పౌడర్ బ్లాక్ మెటాలిక్ అనే రెండు రంగులలో అందుబాటులో ఉంది.
చదవండి: స్కూటర్ల కొనుగోలుపై ప్రత్యేక ఆఫర్లను ప్రకటించిన యహహా మోటార్స్..!
Comments
Please login to add a commentAdd a comment