Honda Dio Sports Launched Price and Features ​​​​Here - Sakshi
Sakshi News home page

Honda Dio Sports: హోండా డియో స్పోర్ట్స్  లాంచ్‌, ఆశ్చర్యంగా ధర తక్కువే!

Published Thu, Aug 4 2022 2:01 PM | Last Updated on Thu, Aug 4 2022 2:25 PM

Honda Dio Sports Launched Price and Features ​​​​here - Sakshi

సాక్షి,ముంబై: హోండా మోటార్‌ సైకిల్  అండ్‌  స్కూటర్ ఇండియా కొత్త స్పోర్టీ బైక్‌ను మార్కెట్లో విడుదల చేసింది. హోండా డియో స్పోర్ట్స్‌ పేరుతో రెగ్యులర్ డియో మోటో-స్కూటర్ స్పోర్టీ వెర్షన్‌గా లాంచ్‌ చేసింది. అయితే లిమిటెడ్‌ ఎడిషన్‌గా తీసుకొచ్చిన  హోండా  స్పోరర్ట్స్‌ పరిమిత కాలంలోనే అందుబాటులో ఉంటుంది.

 స్టాండర్డ్ వేరియంట్  ధర  68,317/- (ఎక్స్-షోరూమ్). టాప్-ఎండ్ డీలక్స్ వేరియంట్ ధర రూ. 73,317 (ఎక్స్-షోరూమ్) గా కంపెనీ ప్రకటించింది. రెగ్యులర్‌ డియో స్టాండర్డ్ , డీలక్స్ ధర రూ. 73,599,  రూ. 77,099 (ఎక్స్-షోరూమ్)ధరలతో పోలిస్తే  కొత్త లిమిటెడ్‌  ఎడిషన్  ధరలు చౌకగా ఉండటం విశేషం.

ఆకర్షణీయమైన గ్రాఫిక్స్  స్పోర్టీ రెడ్ రియర్ సస్పెన్షన్‌తో తీసుకొచ్చిన హోడా డియో స్పోర్ట్స్‌ స్కూటర్ బ్లాక్‌తో స్ట్రోంటియమ్ సిల్వర్ మెటాలిక్ ,స్పోర్ట్స్ రెడ్ విత్ బ్లాక్  2 కలర్ స్కీమ్‌లలో వస్తుంది. డీలక్స్ వేరియంట్ అదనంగా అల్లాయ్ వీల్స్‌ను అందిస్తుంది. 

110 cc PGM-FI ఇంజిన్‌తో మెరుగైన స్మార్ట్ పవర్ (eSP) సాంకేతికతను అందిస్తుంది.  టెలిస్కోపిక్ సస్పెన్షన్, ఇంటిగ్రేటెడ్ డ్యూయల్ ఫంక్షన్ స్విచ్, ఎక్స్‌టర్నల్ ఫ్యూయల్ లిడ్, పాస్ స్విచ్ , ఇంజన్ కట్-ఆఫ్‌తో కూడిన సైడ్ స్టాండ్ ఇండికేటర్ ప్రధాన ఫీచర్లుగా ఉన్నాయి.  ఇంకా  డియో స్పోర్ట్స్‌లో హోండా కాంబి-బ్రేక్ సిస్టమ్ (CBS) ఈక్వలైజర్, 3-స్టెప్ అడ్జస్టబుల్ రియర్ సస్పెన్షన్, మెరుగైన ఇంధన సామర్థ్యం కోసం 3-స్టెప్ ఎకో ఇండికేటర్‌ని జోడించింది. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement