హోండా ‘సీబీఆర్‌650ఆర్‌’ స్పోర్ట్స్‌ బైక్‌  | Honda Motorcycle and Scooter India launches sports bike CBR650R priced at Rs 7.7 lakh | Sakshi
Sakshi News home page

హోండా ‘సీబీఆర్‌650ఆర్‌’ స్పోర్ట్స్‌ బైక్‌ 

Published Tue, Apr 23 2019 12:15 AM | Last Updated on Thu, Jul 11 2019 6:33 PM

Honda Motorcycle and Scooter India launches sports bike CBR650R priced at Rs 7.7 lakh - Sakshi

న్యూఢిల్లీ: ద్విచక్ర వాహన తయారీ కంపెనీ ‘హోండా మోటర్‌ సైకిల్‌ అండ్‌ స్కూటర్‌ ఇండియా’ (హెచ్‌ఎంఎస్‌ఐ)..  ‘సీబీఆర్‌650ఆర్‌’ పేరుతో కొత్త స్పోర్ట్స్‌ బైక్‌ను సోమవారం మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. సీబీఆర్‌650ఎఫ్‌ స్థానాన్ని భర్తీ చేస్తూ విడుదలైన ఈ బైక్‌.. 649–సీసీ లిక్విడ్‌ కూల్డ్‌ ఫోర్‌ సిలిండర్‌ ఇంజిన్‌తో అందుబాటులోకి వచ్చింది.

బైక్‌ ధర రూ.7.7 లక్షలుగా కంపెనీ ప్రకటించింది. ఈ సందర్భంగా హెచ్‌ఎంఎస్‌ఐ సేల్స్‌ అండ్‌ మార్కెటింగ్‌ విభాగం సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ యద్వీందర్‌ సింగ్‌ గులేరియా మాట్లాడుతూ.. ‘గతవారంలోనే  కొత్త ప్రీమియం బిగ్‌ బైక్‌ వర్టికల్‌పై ప్రకటన చేశాం. ఇందుకు అనుగుణంగా హోండా బిగ్‌వింగ్‌ క్యాటగిరిలో ఈ నూతన బైక్‌ విడుదలైంది’ అని అన్నారు.    

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement