
ముంబై: ద్విచక్ర వాహన తయారీ సంస్థ హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా లిమిటెడ్ (హెచ్‌ఎంఎస్‌ఐ).. భారత్ స్టేజ్ (బీఎస్)–6 ఉద్గార నిబంధనలకు అనుగుణంగా ఉన్న మరో స్కూటర్‌ను గురువారం మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. ‘యాక్టివా 6జీ’ పేరిట విడుదలైన ఈ అధునాతన స్కూటర్ స్టాండర్డ్, డీలక్స్ వేరియంట్లలో లభిస్తుండగా.. వీటి ధరల శ్రేణి రూ. 63,912– 65,412 (ఎక్స్–షోరూం, ఢిల్లీ) వద్ద నిర్ణయించింది. మును పటి మోడలైన స్టాండర్డ్ 5జీతో పోల్చితే నూతన స్కూటర్ ధర రూ.7,978 అధికం కాగా, డీలక్స్ ధర రూ. 7,613 ఎక్కువగా ఉంది. ‘బీఎస్–6 నూతన ఉద్గార ప్రమాణాలతో కూడిన మూడవ యాక్టివా ఇది. ఈ నెలాఖరుకు లేదా ఫిబ్రవరి మొదటివారంలో ఇది అందుబాటులోకి వస్తుంది’ అని కంపెనీ సేల్స్ అండ్ మార్కెటింగ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ వై.ఎస్ గులేరియా తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment