Activa scooter
-
స్మార్ట్ కీతో యాక్టివా 125
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ద్విచక్ర వాహన తయారీ దిగ్గజం హోండా మోటార్‌సైకిల్, స్కూటర్ ఇండియా తాజాగా ఆధునీకరించిన ఇంజన్‌తో యాక్టివా 125 స్కూటర్‌ను నాలుగు వర్షన్స్‌లో విడుదల చేసింది. డ్రమ్, డ్రమ్ అలాయ్, డిస్క్, హెచ్–స్మార్ట్ వీటిలో ఉన్నాయి. హైదరాబాద్ ఎక్స్‌షోరూంలో ధర రూ.81,342 నుంచి రూ.90,515 వరకు ఉంది. అయిదు రంగుల్లో లభిస్తుంది. (ఇదీ చదవండి: స్వర్గంలో ఉన్న నానాజీ, నానీ.. నాన్న జాగ్రత్త: అష్నీర్ గ్రోవర్ భావోద్వేగం) స్టార్ట్/స్టాప్ ఫీచర్, సైడ్ స్టాండ్ కట్ ఆఫ్ స్విచ్, ఎక్స్టర్నల్ ఫ్యూయల్ ఫిల్లర్ క్యాప్, ఓపెన్ గ్లోవ్ బాక్స్, ఎల్ఈడీ పొజిషన్ ల్యాంప్‌తో ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్ ఉంది. రియల్ టైమ్ మైలేజ్, ట్యాంకులో ఉన్న ఇంధనంతో ప్రయాణించే దూరం, ఇంధనం ఎంత ఉంది, సగటు మైలేజ్, సమయం వంటి వివరాలను చూపే చిన్న డిజిటల్ స్క్రీన్ పొందుపరిచారు. ఇంధన సమర్థవంతమైన టైర్లను జోడించారు. స్మార్ట్ ఫైండ్, సేఫ్, అన్‌లాక్, స్టార్ట్ ఫీచర్లు గల స్మార్ట్ కీతో టాప్ ఎండ్ వేరియంట్ లభిస్తుంది. వాహనాల మధ్య ఈ స్కూటర్ ఎక్కడ ఉందో ఇట్టే తెలుసుకోవచ్చు. (ఇండియన్ టెకీలకు గిట్‌హబ్...: టీం మొత్తానికి ఉద్వాసన) -
మార్కెట్లోకి ‘హోండా యాక్టివా 6జీ’
ముంబై: ద్విచక్ర వాహన తయారీ సంస్థ హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా లిమిటెడ్ (హెచ్ఎంఎస్ఐ).. భారత్ స్టేజ్ (బీఎస్)–6 ఉద్గార నిబంధనలకు అనుగుణంగా ఉన్న మరో స్కూటర్‌ను గురువారం మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. ‘యాక్టివా 6జీ’ పేరిట విడుదలైన ఈ అధునాతన స్కూటర్ స్టాండర్డ్, డీలక్స్ వేరియంట్లలో లభిస్తుండగా.. వీటి ధరల శ్రేణి రూ. 63,912– 65,412 (ఎక్స్–షోరూం, ఢిల్లీ) వద్ద నిర్ణయించింది. మును పటి మోడలైన స్టాండర్డ్ 5జీతో పోల్చితే నూతన స్కూటర్ ధర రూ.7,978 అధికం కాగా, డీలక్స్ ధర రూ. 7,613 ఎక్కువగా ఉంది. ‘బీఎస్–6 నూతన ఉద్గార ప్రమాణాలతో కూడిన మూడవ యాక్టివా ఇది. ఈ నెలాఖరుకు లేదా ఫిబ్రవరి మొదటివారంలో ఇది అందుబాటులోకి వస్తుంది’ అని కంపెనీ సేల్స్ అండ్ మార్కెటింగ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ వై.ఎస్ గులేరియా తెలిపారు. -
తొలి బీఎస్-6 యాక్టివా125 లాంచ్
సాక్షి, న్యూఢిల్లీ: భారతదేశపు రెండవ అతిపెద్ద ద్విచక్ర వాహన తయారీ సంస్థ హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా తన మొట్ట మొదటి బీఎస్ 6 ఉద్గార నిబంధనలకు అనుగుణంగా తొలి వాహనాన్ని విడుదల చేసింది. బీఎస్ 6 నిబంధనలకు అనుగుణంగా యాక్టివా వెర్షన్‌ను బుధవారం తీసుకొచ్చింది. మూడు వేరియంట్లలో తీసుకొచ్చిన ఈ స్కూటర్ ప్రారంభ ధరను రూ .67,490 గా నిర్ణయించింది. ఈ నెల చివరి నాటికి కొత్త స్కూటర్లు రోడ్లపైకి రావడం ప్రారంభిస్తాయని, దశలవారీగా దేశవ్యాప్తంగా ప్రారంభించనున్నట్లు హోండా తెలిపింది. తమ కొత్త యాక్టివా 125 బిఎస్-6 తో, పరిశ్రమలో అత్యుత్తమ సాంకేతిక పరిజ్ఞానంతో, తదుపరి విప్లవానికి లీడర్‌గా నిలుస్తుందని హోండీ సీఎండీ మినోరు కటో చెప్పారు. -
హోండా యాక్టివా @ కోటి అమ్మకాలు
న్యూఢిల్లీ: హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా(హెచ్ఎంఎస్ఐ) కంపెనీ యాక్టివా స్కూటర్ మోడల్ కోటి అమ్మకాల మైలురాయిని సాధించింది. 2001లో ఈ మోడల్‌ను మార్కెట్లోకి తెచ్చామని హెచ్ఎంఎస్ఐ ప్రెసిడెంట్, సీఈఓ కీత మురమత్సు చెప్పారు. భారత్‌లో స్కూటర్ సెగ్మెంట్‌కు పునరుత్తేజం ఇచ్చిన ఈ మోడల్ ప్రస్తుతం అగ్రస్థానంలో ఉందని వివరించారు. పదేళ్ల క్రితం భారత్‌లో అత్యధికంగా అమ్ముడయ్యే టూవీలర్గా స్కూటర్ మోడల్ నిలుస్తుందని ఎవరూ ఊహించలేదని కంపెనీ సీనియర్ వైస్-ప్రెసిడెంట్ (సేల్స్ అండ్ మార్కెటింగ్) యధ్‌విందర్ సింగ్ గులేరియా చెప్పారు. మార్కెట్లోకి తెచ్చిన తొలి ఏడాదిలోనే 55 వేల యాక్టివా స్కూటర్లు అమ్ముడయ్యాయని, దేశీయ మార్కెట్లో గతేడాది 21 లక్షలు అమ్ముడయ్యాయని వివరించారు.