తొలి బీఎస్‌-6 యాక్టివా125 లాంచ్‌ | Honda launches India first BS-VI compliant two-wheeler Activa 125  | Sakshi
Sakshi News home page

తొలి బీఎస్‌-6 యాక్టివా125 లాంచ్‌

Published Wed, Sep 11 2019 3:07 PM | Last Updated on Wed, Sep 11 2019 3:19 PM

Honda launches India first BS-VI compliant two-wheeler Activa 125  - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ:  భారతదేశపు రెండవ అతిపెద్ద ద్విచక్ర వాహన తయారీ సంస్థ హోండా మోటార్‌సైకిల్ అండ్‌ స్కూటర్ ఇండియా తన మొట్ట మొదటి బీఎస్‌ 6 ఉద్గార నిబంధనలకు అనుగుణంగా తొలి వాహనాన్ని విడుదల చేసింది.   బీఎస్‌  6 నిబంధనలకు అనుగుణంగా యాక్టివా వెర్షన్‌ను బుధవారం తీసుకొచ్చింది.  మూడు వేరియంట్లలో తీసుకొచ్చిన ఈ స్కూటర్‌  ప్రారంభ ధరను  రూ .67,490 గా నిర్ణయించింది. ఈ నెల చివరి నాటికి కొత్త స్కూటర్లు రోడ్లపైకి రావడం ప్రారంభిస్తాయని, దశలవారీగా దేశవ్యాప్తంగా ప్రారంభించనున్నట్లు హోండా తెలిపింది. తమ కొత్త యాక్టివా 125 బిఎస్-6 తో, పరిశ్రమలో అత్యుత్తమ సాంకేతిక పరిజ్ఞానంతో,  తదుపరి విప్లవానికి లీడర్‌గా నిలుస్తుందని   హోండీ సీఎండీ  మినోరు కటో చెప్పారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement