వాహన తయారీ సంస్థ టీవీఎస్ మోటార్ కంపెనీ 2025 ఎడిషన్ రోనిన్ మోటార్‌సైకిల్ ఆవిష్కరించింది. గోవాలో జరుగుతున్న టీవీఎస్ మోటోసోల్ 4.0 కార్యక్రమంలో ఈ సరికొత్త మోడల్ తళుక్కుమంది. 225 సీసీ ఇంజన్‌తో ఇది తయారైంది. 20 బీహెచ్‌పీ, 19 ఎన్‌ఎం టార్క్ అందిస్తుంది.
5 స్పీడ్ గేర్‌బాక్స్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, బ్లూటూత్ కనెక్టివిటీ, ఎల్‌ఈడీ లైటింగ్, సైడ్ స్టాండ్ కట్–ఆఫ్ సెన్సార్, సైలెంట్ స్టార్టర్ వంటి హంగులు ఉన్నాయి. టీవీఎస్ రోనిన్ మిడ్–వేరియంట్ రైడర్‌ల భద్రత, స్థిరత్వాన్ని పెంపొందించడానికి డ్యూయల్–ఛానల్ యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్‌తో రూపొందింది. బేస్ వేరియంట్‌కు సింగిల్ చానెల్ ఏబీఎస్ ఏర్పాటు చేశారు.
‘ఈ అప్‌గ్రేడ్ టీవీఎస్ రోనిన్ యొక్క మూడు వేరియంట్‌లలో మరింత స్థిరమైన భేదాన్ని సృష్టిస్తుంది. ఇది రంగు, గ్రాఫిక్స్‌లో మాత్రమే కాకుండా కార్యాచరణలో కూడా స్పష్టమైన వ్యత్యాసాలను అందిస్తుంది’ అని కంపెనీ తెలిపింది. గ్లేసియర్ సిల్వర్, చార్‌కోల్ ఎంబర్ అనే రెండు కొత్త రంగులను కంపెనీ పరిచయం చేసింది. ఈ కొత్త రంగులు రోనిన్ మోడల్‌లలో ఇప్పటికే ఉన్న డెల్టా బ్లూ, స్టార్‌గేజ్ బ్లాక్‌లను భర్తీ చేస్తాయి.
గివీతో టీవీఎస్ జోడీ..
ఈ సందర్భంగా మోటార్‌సైకిల్ లగేజ్ సిస్టమ్‌లో ప్రపంచ అగ్రగామిగా ఉన్న గివీతో టీవీఎస్ మోటార్ కంపెనీ భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఈ భాగస్వామ్యం వివిధ రైడింగ్ స్టైల్స్, స్టోరేజ్ అవసరాలకు అనుగుణంగా సమగ్రమైన ప్రీమియం లగేజ్ సొల్యూషన్‌లను అందజేస్తుందని టీవీఎస్ వివరించింది.
ప్రత్యేకంగా టీవీఎస్ ద్విచక్ర వాహనాల కోసం కస్టమ్–డిజైన్ చేయబడిన ఫ్రేమ్‌లు, మౌంట్‌లను గివీ అభివృద్ధి చేస్తుంది. ఈ భాగస్వామ్యం ద్విచక్ర వాహనాల యాక్సెసరీల విభాగంలో ఒక ముఖ్యమైన మైలురాయిని సూచిస్తుందని, ఆధునిక మోటార్‌సైక్లిస్ట్‌లకు అత్యాధునిక డిజైన్, సౌకర్యాన్ని అందిస్తుందని టీవీఎస్ వివరించింది.
Comments
Please login to add a commentAdd a comment