honda shine
-
తక్కువ ధరలో ఎక్కువ మైలేజ్ ఇచ్చే బైకులు
భారతదేశంలో లెక్కకు మించిన బైకులు అమ్మకానికి ఉన్నాయి. అయితే చాలామంది సరసమైన, ఎక్కువ మైలేజ్ ఇచ్చే బైకులను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతారు. ఈ కథనంలో ఇండియన్ మార్కెట్లోని టాప్ 5 చీప్ అండ్ బెస్ట్ బైకులు గురించి తెలుసుకుందాం.హీరో హెచ్ఎఫ్ 100 (Hero HF 100)ఇండియన్ మార్కెట్లో అత్యంత సరసమైన బైకుల జాబితాలో చెప్పుకోదగ్గ మోడల్ 'హీరో హెచ్ఎఫ్ 100'. దీని ధర రూ. 59,018 (ఎక్స్ షోరూమ్). సింపుల్ డిజైన్, లేటెస్ట్ ఫీచర్స్ కలిగిన ఈ బైక్ 65 కిమీ / లీ మైలేజ్ అందిస్తుంది. మల్టిపుల్ వేరియంట్లలో లభించే ఈ బైక్.. 97.2 సీసీ ఇంజిన్ ద్వారా.. అత్యుత్తమ పనితీరును అందిస్తుంది.టీవీఎస్ స్పోర్ట్ (TVS Sport)తక్కువ ధరలో లభించే బైకుల జాబితాలో మరో మోడల్.. టీవీఎస్ స్పోర్ట్. దీని ధర రూ. 59,881 (ఎక్స్ షోరూమ్). 109.7 సీసీ ఇంజిన్ కలిగిన ఈ బైక్ 80 కిమీ / లీ మైలేజ్ అందిస్తుంది. ఈ బైక్ ఫ్యూయెల్ ట్యాంక్ కెపాసిటీ 10 లీటర్లు కాగా.. దీని బరువు 112 కేజీలు మాత్రమే.హీరో హెచ్ఎఫ్ డీలక్స్ (Hero HF Deluxe)రూ. 59,998 (ఎక్స్ షోరూమ్) వద్ద లభించే హీరో హెచ్ఎఫ్ డీలక్స్ కూడా సరసమైన బైకుల జాబితాలో ఒకటి. ఇది 65 కిమీ మైలేజ్ అందిస్తుంది. 4 స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ కలిగిన ఈ బైక్ 97.2 సీసీ ఇంజిన్ పొందుతుంది. కాబట్టి మంచి పనితీరును అందిస్తుంది.హోండా షైన్ (Honda Shine)ఇండియన్ మార్కెట్లో ఎక్కువమంది కొనుగోలు చేసిన బైక్ ఈ హోండా షైన్. దీని ప్రారంభ ధర రూ. 66,900 మాత్రమే. ఇందులో 123.94 సీసీ ఇంజిన్ 55 కిమీ / లీ మైలేజ్ అందిస్తుంది. దీని ఫ్యూయెక్ ట్యాంక్ కెపాసిటీ 10.5 లీటర్లు. ఇంజిన్ 5 స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ ఆప్షన్ పొందుతుంది.ఇదీ చదవండి: పెట్రోల్, డీజిల్ కార్ల కథ ముగిసినట్టే?.. ఈవీ పాలసీ 2.0 గురించి తెలుసాటీవీఎస్ రేడియన్ (TVS Radeon)మన జాబితాలో చివరి బైక్.. ఎక్కువ మైలేజ్ ఇచ్చే.. సరసమైన బైక్ టీవీఎస్ రేడియన్. దీని ప్రారంభ ధర రూ. 70720 (ఎక్స్ షోరూమ్). ఇది 62 కిమీ / లీ మైలేజ్ అందిస్తుంది. ఈ బైక్ ఫ్యూయెల్ ట్యాంక్ కెపాసిటీ 10 లీటర్లు మాత్రమే. ఇంజిన్ 4 స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ ఆప్షన్ పొందుతుంది. -
ఎక్కువ మైలేజ్ ఇచ్చే బైక్: బజాజ్ ప్లాటినా 100 vs హోండా షైన్
రోజువారీ వినియోగానికి లేదా ఎక్కువ మైలేజ్ కావాలని కోరుకునేవారు బజాజ్ ప్లాటినా 100, హోండా షైన్ వంటి బైకులను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతారు. ఇవి రెండూ.. సింపుల్ డిజైన్, ఫీచర్స్ కలిగి ఉండటం మాత్రమే కాకుండా మంచి రైడింగ్ అనుభూతిని కూడా అందిస్తాయి. ఈ కథనంలో ఈ రెండు బైకుల గురించి వివరంగా తెలుసుకుందాం.బజాజ్ ఆటో లాంచ్ చేసే బైకులకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. ఇందులో ప్లాటినా 100 కూడా ఉంది. ఇందులో 102 సీసీ ఫోర్ స్ట్రోక్ డీటీఎస్-ఐ సింగిల్ సిలిండర్ ఇంజిన్ ఉంటుంది. ఇది 7.9 పీఎస్ పవర్, 8.3 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది 90 కిమీ/లీ మైలేజ్ ఇస్తుందని సమాచారం.హోండా షైన్ విషయానికి వస్తే.. ఇది 123.94 సీసీ ఇంజిన్ పొందుతుంది. ఇది 10.74 పీఎస్ పవర్, 11 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. 75 కిమీ/లీ మైలేజ్ అందించే ఈ బైక్.. సైడ్-స్టాండ్ ఇంజిన్ కట్ ఆఫ్ వంటి ఫీచర్స్ కూడా పొందుతుంది.ఇదీ చదవండి: హోండా యాక్టివా ఈ vs సుజుకి ఈ యాక్సెస్: ఏది బెస్ట్?డిజైన్, ఫీచర్స్ పరంగా బజాజ్ ప్లాటినా 100, హోండా షైన్.. రెండూ చాలా అనుకూలంగా ఉంటాయి. ఇతర బైకులతో పోలిస్తే.. ఈ రెండు బైకులు మంచి మైలేజ్ అందించడం వల్ల, గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలు కూడా వీటిని ఎక్కువగా కొనుగోలు చేయడానికి ఇష్టపడతారు. బజాజ్ ప్లాటినా 100 ప్రారంభ ధరలు రూ. 68,685 కాగా.. హోండా షైన్ ధర రూ. 84151 (అన్ని ధరలు ఎక్స్ షోరూమ్, ఇండియా). -
హోండా 100 సీసీ షైన్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ద్విచక్ర వాహన తయారీ దిగ్గజం హోండా మోటార్‌సైకిల్, స్కూటర్ ఇండియా (హెచ్ఎంఎస్ఐ) తాజాగా 100 సీసీ షైన్ 100 బైక్‌ను ఆవిష్కరించింది. మహారాష్ట్ర ఎక్స్‌షోరూంలో పరిచయ ఆఫర్ ధర రూ.64,900 ఉంది. డెలివరీలు మే నుంచి మొదలు కానున్నాయి. ఏడాదిలో 3 లక్షల యూనిట్ల విక్రయం లక్ష్యంగా చేసుకున్నట్టు కంపెనీ తెలిపింది. వచ్చే మూడు ఏళ్లలో దీనిని 6 లక్షల యూనిట్లకు తీసుకువెళతామని వివరించింది. దేశంలో టూవీలర్ల మార్కెట్లో 100 సీసీ విభాగం మూడింట ఒక వంతు కైవసం చేసుకుంది. ద్విచక్ర వాహనాలకు డిమాండ్ తిరిగి పుంజుకోవడంతో గుజరాత్ ప్లాంటులో కొత్త తయారీ లైన్ ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్టు హోండా మోటార్‌సైకిల్, స్కూటర్ ఇండియా ఎండీ, ప్రెసిడెంట్, సీఈవో అట్సుషి ఒగటా తెలిపారు. షైన్ 100 రాకతో కంపెనీ చరిత్రలో తొలిసారిగా వచ్చే ఏడాది పూర్తి తయారీ సామర్థ్యంతో ప్లాంట్లు నడిచే అవకాశం ఉందన్నారు. దేశంలో గ్రామీణ ప్రాంతాల్లో హెచ్ఎంఎస్ఐకి 35 శాతం వాటా ఉంది. 2024 మార్చినాటికి భారత్‌లో హోండా ఎలక్ట్రిక్ స్కూటర్ రంగ ప్రవేశం చేయనుంది. -
100 సీసీ హోండా షైన్ వచ్చేసింది! ధర దాని కంటే తక్కువే..
భారత బైక్ మార్కెట్లో హీరో తర్వాత హోండా కంపెనీ మోటార్‌సైకిళ్లు, స్కూటర్లకు అంతే స్థాయిలో పాపులారిటీ ఉంది. హోండా ఇండియా దేశంలో సరికొత్త షైన్ 100 సీసీ బైక్‌ను విడుదల చేసింది. ఇంతకు ముందు హోండా షైన్ 125 సీసీ బైక్‌లకు మంచి ఆదరణ వచ్చింది. ఈ నేపథ్యంలో అదే మోడల్ పేరుతో 100 సీసీ ఇంజన్‌తో హోండా కంపెనీ కొత్త బైక్‌ను విడుదల చేసింది. ఇదీ చదవండి: Realme C33 2023: తక్కువ ధరలో రియల్మీ ఫోన్లు... కిర్రాక్ ఫీచర్లు! హోండాకు సంబంధించి దేశంలో 125సీసీ ఆపైన మోడళ్లు అంటే.. యూనికాన్, హోండా షైన్ బైక్స్ హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్నాయి. అయితే 100సీసీ బైక్‌ల విషయంలో మాత్రం హోండా వెనుకబడి ఉంది. 100 సీసీ రేంజ్ బైక్‌ల అమ్మకాల్లో హీరో కంపెనీకి తిరుగులేదు. దానికి కారణం హీరో స్ల్పెండర్ బైక్‌లు. ఈ నేపథ్యంలో వాటికి గట్టి పోటీ ఇచ్చేందుకు హోండా బాగా పాపులరైన షైన్ పేరుతో 100 సీసీ మోటర్ సైకిల్ తీసుకొచ్చింది. దీని ప్రారంభ ధర రూ.64,900 (ఎక్స్‌షోరూం). అంటే హీరో స్ల్పెండర్ ప్లస్ కంటే తక్కువే.. హోండా షైన్ 100 సీసీ ప్రత్యేకతలు హోండా షైన్ 100 సీసీ బైక్ 6 సంవత్సరాల వారంటీ ప్యాకేజీతో వస్తుందని, ఇందులో 3 సంవత్సరాలు సాధారణ వారంటీ కాగా సంవత్సరాల ఎక్స్టెండెట్ వారంటీ అని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. పొడవాటి సీటు (677 మి.మీ), చిన్న లెగ్ ఓపెనింగ్ యాంగిల్‌తో కూడిన ట్యాంక్ ఉన్నాయి. ఇంజిన్ ఇన్హిబిటర్‌తో కూడిన సైడ్ స్టాండ్ ఉంటుంది. దీని వల్ల సైడ్ స్టాండ్ వేసి ఉన్నప్పుడు ఇంజిన్ స్టార్ట్ చేయడానికి వీలుండదు. హోండా పేటెంట్ అయిన ఈక్వలైజర్‌తో కూడిన కాంబి బ్రేక్ సిస్టమ్ (సీబీస్)ను ఈ 100సీసీ బైక్‌లోనూ చేర్చారు. ఇక డిజైన్ విషయానికొస్తే హోండా షైన్ 125 ఉన్నట్టుగానే ఉంటుంది. అయితే అలాయ్ వీల్స్ తదితర చిన్న చిన్న మార్పులు ఉన్నాయి. హోండా షైన్ 100 సీసీ బైక్ ఐదు రంగుల్లో లభిస్తాయి. అవి బ్లాక్ విత్ రెడ్ స్ట్రిప్స్, బ్లాక్ విత్ గ్రే స్ట్రైప్స్, బ్లాక్ విత్ గోల్డ్ స్ట్రైప్స్, బ్లాక్ విత్ బ్లూ స్ట్రైప్స్, బ్లాక్ విత్ గ్రీన్ స్ట్రైప్స్. ఇదీ చదవండి: మూత పడనున్న మరో బ్యాంక్? భారీగా పతనమైన షేర్లు.. -
అమ్మకాల్లో దుమ్మురేపిన హోండా షైన్ !
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ద్విచక్ర వాహ న సంస్థ హోండా మోటార్‌సైకిల్, స్కూటర్ ఇండియా కొత్త రికార్డు సృష్టించింది. కంపెనీ తయారీ 125 సీసీ బైక్ షైన్ ఇప్పటివరకు ఒక కోటి యూనిట్లు అమ్ముడయ్యాయి. 2006లో భారత్‌లో ఈ బైక్ రంగ ప్రవేశం చేసింది. తొలి 10 లక్షల మార్కును 2010లో, 50 లక్షల స్థాయిని 2017లో చేరుకుంది. 2018లో కొత్తగా 20 లక్షల షైన్ బైక్స్ అమ్ముడయ్యాయి. దేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన మోడల్స్‌లో ఇది ఒకటిగా నిలిచిందని కంపెనీ తెలిపింది. హీరోతో కలిసి తొలుత ఇండియా మార్కెట్లో అడుగు పెట్టిన హోండా.. ఆ తర్వాత స్వంత బ్రాండ్‌తో మార్కెట్లో పలు మోడళ్లు విడుదల చేసింది. వీటిలో హోండా షైన్, యాక్టివా, యూనికార్న్ మోడళ్లు బాగా క్లిక్ అయ్యాయి. ఓ దశలో షైన్ హీరో కంపెనీ ప్రముఖ మోడళ్లైన గ్లామర్, స్ల్పెండర్, ప్యాషన్ మోడళ్లకు గట్టి పోటీ ఇవ్వగలిగింది. -
హోండా కస్టమర్లకు అలర్ట్.. వెంటనే బైక్స్ షో రూమ్ కి తీసుకెళ్లండి
మీ దగ్గర కొత్త హోండా మోటార్ సైకిల్ వాహనం ఉందా? అయితే, వెంటనే షో రూమ్ తీసుకెళ్లండి. ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ దిగ్గజం హోండా మోటార్ సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా(హెచ్ఎంఎస్ఐ) రిఫ్లెక్స్ రిఫ్లెక్టర్లలలో సమస్య కారణంగా మన దేశంలోని కొన్ని మోడళ్లను రీకాల్ చేస్తుంది. వెనక్కి పిలిపించిన వాటిలో హోండా యాక్టివా 5జీ, హోండా యాక్టివా 6జీ, హోండా యాక్టివా 125, సిబి షైన్, హార్నెట్ 2.0, ఎక్స్-బ్లేడ్, హెచ్ నెస్ సీబి 350, సీబి 300ఆర్ ఉన్నాయి. రీకాల్ చేయబడ్డ మొత్తం యూనిట్ సంఖ్య ఇంకా తెలియదు. రిఫ్లెక్స్ రిఫ్లెక్టర్ల సమస్య వల్ల రాత్రి సమయంలో వెనుక నుంచి వచ్చే వాహనాలకు ముందు వెళ్తున్న వాహనం సరిగా కనిపించక ప్రమాదం జరిగే అవకాశం ఎక్కువ. అందుకే ముందు జాగ్రత్త చర్యలలో భాగంగా నవంబర్ 2019 నుంచి జనవరి 2021 మధ్య తయారు చేయబడ్డ మోడల్స్ కు వారెంటీ స్టేటస్ తో సంబంధం లేకుండా కొత్త రిఫ్లెక్స్ రిఫ్లెక్టర్ ని ఉచితంగా అధీకృత హెచ్ఎంఎస్ఐ డీలర్ లు మార్చానున్నట్లు తెలిపింది. ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలకు లోబడి కంపెనీ జూన్ 1, 2021న రీకాల్ ప్రక్రియను ప్రారంభించింది. వాహనాన్ని తనిఖీ చేయడానికి అవసరమైతే రీప్లేస్ మెంట్ కోసం కాల్, ఈమెయిల్స్, ఎస్ఎంఎస్ ద్వారా వినియోగదారులను చేరుకొనున్నట్లు హెచ్ఎంఎస్ఐ తెలిపింది. అదేవిధంగా, కస్టమర్ లు కంపెనీ వెబ్ సైట్ లో విఐఎన్ ని కూడా నమోదు చేయవచ్చు. హెచ్ ఎమ్ ఎస్ఐ డీలర్ షిప్ లు/విడిభాగాల డిస్ట్రిబ్యూటర్ ల వద్ద అనుమానిత స్పేర్ పార్టుల స్టాక్ కూడా రీకాల్ చేయనున్నారు. అమెరికాలోలో కూడా ఇలాంటి సమస్య కారణంగా హోండా మోటార్ కంపెనీ రీకాల్ చేసింది. యుఎస్ఎలో 28,528 మోటార్ సైకిళ్లలో లోపభూయిష్టమైన రియర్ రిఫ్లెక్టర్ ఫిట్ మెంట్ లను మార్చేసింది. చదవండి: BMW : మూడు సెకన్లలోనే అంత వేగమా -
మార్కెట్లోకి హోండా షైన్ వాహనాలు
అనంతపురం సెంట్రల్ : హోండా షైన్, షైన్ ఎస్పీ బీఎస్ 4 ద్విచక్రవాహనాలను మార్కెట్లోకి విడుదల చేశారు. మంగళవారం రైల్వేఫీడర్ రోడ్డులోని శివసాయి హోండా షోరూంలో హోండా ఏరియా సేల్స్ మేనేజర్ రాజేశ్వర్ చేతులమీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా హోండా అధికృత డీలర్ మల్లికార్జున మాట్లాడుతూ షైన్ ద్విచక్ర వాహనం 50 లక్షల అమ్మకాల మైలురాయిని అధిగమించిందని, 125 సీసీ సెగ్మెంట్లో షైన్ అత్యధికంగా అమ్ముడుపోతోందని వివరించారు. ప్రస్తుతం హెచ్ఈటీ టెక్నాలజీతో సరికొత్త వాహనాలను రూపొందించిందని తెలిపారు. కార్యక్రమంలో శివసాయి హోండా సిబ్బంది, టూ వీలర్స్ ఫైనాన్షియర్స్ పాల్గొన్నారు.