హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ద్విచక్ర వాహ న సంస్థ హోండా మోటార్‌సైకిల్, స్కూటర్ ఇండియా కొత్త రికార్డు సృష్టించింది. కంపెనీ తయారీ 125 సీసీ బైక్ షైన్ ఇప్పటివరకు ఒక కోటి యూనిట్లు అమ్ముడయ్యాయి. 2006లో భారత్‌లో ఈ బైక్ రంగ ప్రవేశం చేసింది. తొలి 10 లక్షల మార్కును 2010లో, 50 లక్షల స్థాయిని 2017లో చేరుకుంది. 2018లో కొత్తగా 20 లక్షల షైన్ బైక్స్ అమ్ముడయ్యాయి. దేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన మోడల్స్‌లో ఇది ఒకటిగా నిలిచిందని కంపెనీ తెలిపింది.
హీరోతో కలిసి తొలుత ఇండియా మార్కెట్‌లో అడుగు పెట్టిన హోండా.. ఆ తర్వాత స్వంత బ్రాండ్‌తో మార్కెట్‌లో పలు మోడళ్లు విడుదల చేసింది. వీటిలో హోండా షైన్, యాక్టివా, యూనికార్న్ మోడళ్లు బాగా క్లిక్ అయ్యాయి. ఓ దశలో షైన్ హీరో కంపెనీ ప్రముఖ మోడళ్లైన గ్లామర్, స్ల్పెండర్, ప్యాషన్ మోడళ్లకు గట్టి పోటీ ఇవ్వగలిగింది.
Comments
Please login to add a commentAdd a comment