ఐఫోన్ కంటే చీప్ గా దొరుకుతున్న బైకులివే!
Published Fri, Mar 31 2017 6:42 PM | Last Updated on Tue, Sep 5 2017 7:35 AM
బీఎస్-3 వాహనాలపై ఏప్రిల్ 1నుంచి నిషేధం విధిస్తున్నట్టు సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరిచడంతో బైక్ ధరలన్నీ ఒక్క ఉదుడున కిందకి దిగొచ్చాయి. డెడ్ లైన్ ఏప్రిల్ 1కి ఇంకా ఒక్కరోజే ఉండటంతో భారీ డిస్కౌంట్ ఆఫర్లతో స్టాక్ ను సేల్ చేసుకోవడానికి కంపెనీ తహతహలాడుతున్నాయి. ఇదే ఛాన్సుగా భావించిన కస్టమర్లు కొనుగోళ్లకు వెనుకాడటం లేదు. దీంతో మోటార్ షోరూంలన్నీ కొనుగోలదారులతో కళకళలాడుతున్నాయి. అయితే దిగొచ్చిన బైక్ ధరలు ఐఫోన్ కంటే చౌకగా లభ్యమవుతున్నట్టు తెలుస్తోంది.
ఆ బైకులేమిటో ఓసారి చూద్దాం....
బీఎస్-3 వాహనాలపై టూ-వీలర్స్ దిగ్గజాలు రూ.22వేల వరకు డిస్కౌంట్ ప్రకటించాయి. దీంతో 150సీసీ బైక్ ఐఫోన్ కంటే తక్కువ ధరకే లభ్యమవుతుందట. నమ్మట్లేదా అయితే ధరలు మీరే ఓసారి చూడండి... ఆపిల్ గతేడాది లాంచ్ చేసిన ఐఫోన్ 7 ప్లస్(128జీబీ) ధర రూ.82వేలు. నేడు సుజుకీ జిక్సర్ ధర షోరూంలో రూ.77,452లకే దొరుకుతోంది. సుజుకీ జిక్సర్ మాత్రమే కాక, యాక్టివా 3జీ కూడా 50,290కు, డ్రీమ్ యుగ 51,741 రూపాయలకు, సీబీ షైన్ 55,799 రూపాయల నుంచి 61,283 రూపాయల వరకు, సీడీ 110డీఎక్స్ 47,202 రూపాయల నుంచి 47,494 రూపాయల ధరల్లో లభ్యమవుతున్నాయి. ఈ బైకులకు హోండా రూ.22వేల వరకు క్యాష్ బ్యాక్ ఆఫర్ ప్రకటించడంతో ధరలు కిందకి తగ్గాయి.
హీరో బైకులపై ఉన్న ఆఫర్లు...
హీరో మోటార్ కార్పొరేషన్ కూడా బీఎస్-3 టూ-వీలర్స్ పై రూ.12,500 వరకు డిస్కౌంట్ ప్రకటించింది. దీంతో స్కూటర్స్ డ్యూయెట్, ఐఫోన్ కంటే చీప్ గా రూ.49,480కు అందుబాటులోకి వచ్చింది. ఇక మాస్ట్రో ఎడ్జ్ నైతే రూ.51,030కే కొనుకోవచ్చు. ప్రీమియం బైకులపై రూ.7500, ఎంట్రీలెవల్ బైకులపై రూ.5000వేల వరకు హీరో ఆఫర్ ప్రకటించింది. దీంతో గ్లామర్ రూ.59,755కు, స్ప్లెండర్ 125 రూ.55,575కు కొనుకునేలా ఆఫర్ ఉంది.
ఒక్క హీరో, హోండా కంపెనీలు మాత్రమే కాక, సుజుకీ బైకులు, బజాజ్ బైకులు కూడా ఐఫోన్ కంటే తక్కువ ధరకే మార్కెట్లోకి వచ్చాయి.
Advertisement