Honda two-wheelers
-
ఫుల్ ఛార్జ్ బ్యాటరీ: నిమిషంలో..
హోండా టూ వీలర్స్ ఇండియా ఇటీవలే.. యాక్టివా ఈ, క్యూసీ1 అనే రెండు ఎలక్ట్రిక్ స్కూటర్లను ఆవిష్కరించింది. క్యూసీ1 స్కూటర్ ఫిక్స్డ్ బ్యాటరీ పొందుతుంది. యాక్టివా ఈ.. రిమూవబుల్ (స్వాపబుల్) బ్యాటరీ పొందుతుంది. అంటే బ్యాటరీ ఛార్జ్ అయిపోయిన తరువాత.. ఫుల్ ఛార్జ్ వున్న బ్యాటరీలను స్వాపింగ్ స్టేషన్లో తీసుకుని రీప్లేస్ చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన వీడియో కూడా నెట్టింట్లో వైరల్ అవుతోంది.హోండా యాక్టివా ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ రెండు స్వాపబుల్ బ్యాటరీలతో వస్తుంది. వీటిని కేవలం నిమిషం వ్యవధిలోనే మార్చుకోవచ్చని కంపెనీ కూడా చెబుతోంది. స్వాపింగ్ స్టేషన్ సందర్శించిన తరువాత.. స్మార్ట్ కీ ఉపయోగించి అక్కడ నుంచి బ్యాటరీలను తీసుకోవచ్చు. అదే సమయంలో స్కూటర్లోని బ్యాటరీలను రిమూవ్ చేయడానికి కూడా ఎక్కువ సమయం కేటాయించాల్సిన అవసరం లేదు. కాబట్టి సంస్థ చెప్పినట్లుగానే బ్యాటరీని నిమిషం వ్యవధిలోనే మార్చుకోవచ్చు.ఇదీ చదవండి: వాట్సాప్ గ్రూప్‌లో చేరాడు.. రూ.11 కోట్లు పోయాయిఒక్కో బ్యాటరీ బరువు 10.2 కేజీలు ఉంటుంది. స్కూటర్ రెండు బ్యాటరీలతో 102 కిమీ రేంజ్ అందిస్తుంది. దీని టాప్ స్పీడ్ 80 కిమీ/గం కాగా.. ఇది 7.3 సెకన్లలో 0 నుంచి 40 కిమీ వరకు వేగవంతం (యాక్సలరేషన్) అవుతుంది. డిజైన్, ఫీచర్స్ పరంగా ఉత్తమగానే ఉంటుంది. ఈ స్కూటర్ కోసం బుకింగ్స్ జనవరి 1 నుంచి ప్రారంభమవుతాయి. డెలివరీలు ఫిబ్రవరిలో మొదలవుతాయి. -
హోండా ఎలక్ట్రిక్ స్కూటర్లు వచ్చేశాయ్: బుకింగ్స్ ఎప్పుడంటే..
చాలా సంవత్సరాల నిరీక్షణకు తెరపడింది. హోండా టూ వీలర్స్ ఇండియా ఎలక్ట్రిక్ వాహన విభాగంలో అడుగుపెడుతూ.. రెండు ఎలక్ట్రిక్ స్కూటర్లను ఆవిష్కరించింది. ఒకటి యాక్టివా ఈ, మరొకటి క్యూసీ1. కంపెనీ ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ల కోసం 2025 జనవరి 1 నుంచే బుకింగ్స్ స్వీకరించడం ప్రారంభించనుంది. డెలివరీలు ఫిబ్రవరి నుంచి మొదలవుతాయి.హోండా యాక్టివా ఈ స్కూటర్ రిమూవబుల్ బ్యాటరీ, క్యూసీ1 స్కూటర్ ఫిక్స్డ్ బ్యాటరీని పొందుతుంది. కేవలం ఐదు రంగులలో మాత్రమే ఈ స్కూటర్లు లభిస్తాయి. క్యూసీ1 భారతదేశం అంతటా దాదాపు అన్ని డీలర్‌షిప్‌లలో లభిస్తుంది. యాక్టివా ఈ మాత్రం ప్రారంభంలో బెంగళూరు, ముంబై, ఢిల్లీలలో మాత్రమే లభించనున్నట్లు సమాచారం.లేటెస్ట్ డిజైన్ కలిగిన ఈ రెండు స్కూటర్లు చూడటానికి ఒకే మాదిరిగా ఉంటాయి. ఇందులో ఎల్ఈడీ లైటింగ్, బాడీ-కలర్ రియర్ వ్యూ మిర్రర్స్, ఫ్లాట్ ఫ్లోర్‌బోర్డ్, ఆల్ డిజిటల్ డిస్ప్లే, కాంటౌర్డ్ లాంగ్ అండ్ వెడల్ సీట్, సీ టైప్ ఛార్జింగ్ పోర్ట్‌తో కూడిన ఫ్రంట్ స్టోరేజ్ కంపార్ట్మెంట్, స్మార్ట్ కీ వంటివి ఉంటాయి.యాక్టివా ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ రిమూవబుల్.. కాబట్టి దీనిని స్వాపబుల్ బ్యాటరీ స్టేషన్ల మార్చుకోవచ్చు. ఇది సమయాన్ని వృధా కాకుండా చేస్తుంది. అయితే క్యూసీ1 ఫిక్స్డ్ బ్యాటరీ కలిగి ఉంటుంది. దీనిని హోమ్ ఛార్జర్ లేదా ఫాస్ట్ ఛార్జర్ ద్వారా ఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది 26 లీటర్ల అండర్ సీట్ స్టోరేజ్ పొందుతుంది.యాక్టివా ఈలోని 7-అంగుళాల TFT ఇన్స్ట్రుమెంటేషన్ యూనిట్.. రైడర్లకు న్యావిగేషన్, కాల్ అలర్ట్స్, బ్యాటరీ స్వాప్ లొకేషన్లు, మ్యూజిక్ కంట్రోల్ వంటి వాటిని చూపిస్తుంది. క్యూసీ1 స్కూటర్ 5 ఇంచెస్ ఎల్సీడీ స్క్రీన్ పొందుతుంది. ఇది కూడా వెహికల్ గురించి చాలా విషయాలను వెల్లడిస్తుంది.పవర్‌ట్రెయిన్ విషయానికి వస్తే.. 'యాక్టివా ఈ' స్కూటర్ రెండు 1.5 కిలోవాట్ బ్యాటరీలను పొందుతుంది. వీటి ద్వారా 102 కిమీ ప్రయాణించవచ్చు. టాప్ స్పీడ్ 80 కిమీ/గం కాగా.. ఇది 7.3 సెకన్లలో 0 నుంచి 40 కిమీ వరకు వేగవంతం (యాక్సలరేషన్) అవుతుంది. ఈ స్కూటర్ బరువు 119 కేజీలు. క్యూసీ1 ఎలక్ట్రిక్ స్కూటర్ ఒక 1.5 కిలోవాట్ ఫిక్స్డ్ బ్యాటరీ పొందుతుంది. ఇది ఒక ఫుల్ ఛార్జీతో 80 కిమీ రేంజ్ అందిస్తుంది. మొత్తం మీద ఈ రెండు స్కూటర్లు ఉత్తమ పనితీరును అందిస్తాయని భావిస్తున్నాము.Activa e: Swap easy. Ride easy.#Honda #ThePowerOfDreams #ElefrifyYourDreams pic.twitter.com/7gVBXVhdTi— Honda 2 Wheelers India (@honda2wheelerin) November 27, 2024 -
వావ్...హోండా యాక్టివా 7జీ కమింగ్ సూన్..!
సాక్షి,ముంబై: హోండా 2వీలర్స్ తన కస్టమర్లకు మరో చక్కటి స్కూటర్‌ను అందించనుందా. కంపెనీ విడుదల చేసిన తాజా టీజర్ ఈ అంచనాలనే బలపరుస్తోంది. “కమింగ్ సూన్” అంటూ రానున్న హోండా యాక్టివా స్కూటర్‌పై వినియోగదారులను ఆకట్టుకుంటోంది. రానున్న కొత్త స్కూటర్ ఫీచర్లు లాంటి విషయాలపై హోండా ఎలాంటి ధృవీకరణ చేయనప్పటికీ టీజర్‌లోని సిల్హౌటీని చూసి హోండా యాక్టివా 7జీ కావచ్చని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. బీఎస్-6 నిబంధనలకు అనుగుణంగా యాక్టివా 6జీని తీసుకొచ్చింది. ఫ్రంట్ టర్న్ ఇండికేటర్లు, హెడ్‌ల్యాంప్, రియర్ వ్యూ మిర్రర్స్, హ్యాండిల్ బార్స్తోపాటు, కొత్త డిజైన్, ఫీచర్ అప్గ్రేడ్లతో హోండా యాక్టివా 7జీ రానుంది. అయితే యాక్టివా 6 జీ మోడ్‌తో పోలిస్తే ఫీచర్లను మరింత అప్‌గ్రేడ్ చేసే అవకాశం ఉందనే ఊహాగానాలున్నాయి. (జియో మెగా ఫ్రీడం ఆఫర్, ఏడాది ఉచిత సబ్స్క్రిప్షన్) BS6-కంప్లైంట్ 109.51cc, ఫ్యూయల్ ఇంజెక్షన్ టెక్నాలజీ సింగిల్-సిలిండర్ ఇంజన్ని ఉపయోగిస్తుంది. ఈ మోటార్ 8,000rpm వద్ద 7.79bhpను, 5,250rpm వద్ద 8.79Nm శక్తిని అందిస్తుంది. 'సైలెంట్ స్టార్ట్' సిస్టమ్, పాస్ లైట్ స్విచ్, 12 అంగుళాల ఫ్రంట్ వీల్, ఎక్స్టర్నల్ ఫ్యూయల్ ఫిల్లర్ క్యాప్, సాంప్రదాయ టెలిస్కోపిక్ ఫోర్క్ సస్పెన్షన్ యూనిట్‌తో సహా చాలా ఫీచర్లు యథావిధిగా ఉంటాయని అంచనా. అలాగే టీవీఎస్ జూపిటర్ వంటి ప్రత్యర్థులు కూడా అందిస్తున్న బ్లూటూత్ కనెక్టివిటీ వంటి కొత్త ఫీచర్లను వచ్చే దీపావళి నాటికి లాంచ్ అవుతుందని సమాచారం. చదవండి : Revised ITR: రివైజ్డ్ ఐటీఆర్ దాఖలు చేయాలా? చివరి తేదీ ఎపుడు? రాబోయే హోండా హోండా యాక్టివా 7జీ ఖరీదైనదిగా ఉండనుందట. ప్రస్తుత స్టాండర్డ్ మోడల్ ధర రూ. 72,400, డీలక్స్ వేరియంట్‌కు రూ. 74,400 వద్ద విక్రయిస్తున్న సంగతి తెలిసిందే. ఇది హీరో ప్లెజర్ ప్లస్, టీవీఎస్ జూపిటర్ప్లస్, హీరో Maestro Edge 110, యమహా ఫాసినోలాంటి మోడల్స్‌కు గట్టి పోటీ ఇవ్వనుంది. Raise the bar with style that is unlike any other. Stay tuned! pic.twitter.com/u9RwNWe48F — Honda 2 Wheelers (@honda2wheelerin) August 9, 2022 -
హోండా వెహికిల్స్ రేట్లు దిగొస్తున్నాయ్!
ముంబై : దేశమంతటిన్నీ ఒకే పన్ను వ్యవస్థలోకి తీసుకొస్తూ జూలై 1 నుంచి జీఎస్టీ అమలు కాబోతున్న తరుణంలో ప్రముఖ వాహన దిగ్గజం తన టూ-వీలర్ రేట్లను తగ్గించబోతుంది. టూ-వీలర్ వాహనాల ధరలన్నింటిపై 3 శాతం నుంచి 5 శాతం ధరలు తగ్గించాలని హోండా మోటార్ సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా నిర్ణయించింది. కొత్త పన్నుల ప్రయోజనాలను వినియోగదారులకు బదిలీ చేయాలనే ఉద్దేశ్యంతో కంపెనీ ఈ ధరల తగ్గింపును తీసుకొస్తోంది. బజాజ్ ఆటో, రాయల్ ఎన్ ఫీల్డ్ వంటి టూ-వీలర్ దిగ్గజాలు ఇప్పటికే తగ్గింపు ధరలను ప్రకటించాయి. ఇదే ప్రక్రియను ఇతర వాహన సంస్థలు కూడా ఫాలో అవుతున్నట్టు తెలిసింది. ఈ మేరకు వీటి జాబితాలోకి హోండా వచ్చి చేరింది. ఇంకా చాలా కంపెనీలు కొత్త పన్ను విధానం ఎలా ఉంటుందనే దానిపై అధ్యయనం చేస్తూ ఉన్నాయి. ''హోండా టూ-వీలర్ రేట్ల తగ్గింపు రాష్ట్రం రాష్ట్రానికి, ప్రొడక్ట్, ప్రొడక్ట్ కి భిన్నంగా ఉంటుంది. 3 శాతం నుంచి 5 శాతం మధ్యలో రేట్లను తగ్గించాలని అనుకుంటున్నాం. జీఎస్టీ అమలుతో వచ్చే ప్రయోజనాలను వినియోగదారులకు బదిలీ చేస్తాం'' అని హోండా మోటార్ సైకిల్, స్కూటర్ ఇండియా సేల్స్, మార్కెటింగ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ వైఎస్ గులేరియా చెప్పారు. బజాజ్ ఆటో ఇప్పటికే వివిధ వాహనాలపై రూ.4500 వరకూ ధరలను తగ్గించింది. ఇక రాయల్‌ఎన్‌ఫీల్డ్ సైతం జూన్ 17, 2017 నుంచి జీఎస్టీకి అనుగుణంగా ధరలను తగ్గించినట్లు తెలిపింది. జీఎస్టీ నిబంధనల ప్రకారం 350సీసీ దాటిన వాహనాలపై అదనంగా 3శాతం సెస్ విధించే అవకాశం ఉంది. 28 శాతం పన్ను కిందకు వీటిని తీసుకురానున్నారు.. ముఖ్యంగా ప్రీమియం బైక్‌ల విషయంలోనే ధరల పెరుగుతుండగా, మిగిలిన వాహనాల ధరలు తగ్గనున్నాయి. -
ఐఫోన్ కంటే చీప్ గా దొరుకుతున్న బైకులివే!
బీఎస్-3 వాహనాలపై ఏప్రిల్ 1నుంచి నిషేధం విధిస్తున్నట్టు సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరిచడంతో బైక్ ధరలన్నీ ఒక్క ఉదుడున కిందకి దిగొచ్చాయి. డెడ్ లైన్ ఏప్రిల్ 1కి ఇంకా ఒక్కరోజే ఉండటంతో భారీ డిస్కౌంట్ ఆఫర్లతో స్టాక్ ను సేల్ చేసుకోవడానికి కంపెనీ తహతహలాడుతున్నాయి. ఇదే ఛాన్సుగా భావించిన కస్టమర్లు కొనుగోళ్లకు వెనుకాడటం లేదు. దీంతో మోటార్ షోరూంలన్నీ కొనుగోలదారులతో కళకళలాడుతున్నాయి. అయితే దిగొచ్చిన బైక్ ధరలు ఐఫోన్ కంటే చౌకగా లభ్యమవుతున్నట్టు తెలుస్తోంది. ఆ బైకులేమిటో ఓసారి చూద్దాం.... బీఎస్-3 వాహనాలపై టూ-వీలర్స్ దిగ్గజాలు రూ.22వేల వరకు డిస్కౌంట్ ప్రకటించాయి. దీంతో 150సీసీ బైక్ ఐఫోన్ కంటే తక్కువ ధరకే లభ్యమవుతుందట. నమ్మట్లేదా అయితే ధరలు మీరే ఓసారి చూడండి... ఆపిల్ గతేడాది లాంచ్ చేసిన ఐఫోన్ 7 ప్లస్(128జీబీ) ధర రూ.82వేలు. నేడు సుజుకీ జిక్సర్ ధర షోరూంలో రూ.77,452లకే దొరుకుతోంది. సుజుకీ జిక్సర్ మాత్రమే కాక, యాక్టివా 3జీ కూడా 50,290కు, డ్రీమ్ యుగ 51,741 రూపాయలకు, సీబీ షైన్ 55,799 రూపాయల నుంచి 61,283 రూపాయల వరకు, సీడీ 110డీఎక్స్ 47,202 రూపాయల నుంచి 47,494 రూపాయల ధరల్లో లభ్యమవుతున్నాయి. ఈ బైకులకు హోండా రూ.22వేల వరకు క్యాష్ బ్యాక్ ఆఫర్ ప్రకటించడంతో ధరలు కిందకి తగ్గాయి. హీరో బైకులపై ఉన్న ఆఫర్లు... హీరో మోటార్ కార్పొరేషన్ కూడా బీఎస్-3 టూ-వీలర్స్ పై రూ.12,500 వరకు డిస్కౌంట్ ప్రకటించింది. దీంతో స్కూటర్స్ డ్యూయెట్, ఐఫోన్ కంటే చీప్ గా రూ.49,480కు అందుబాటులోకి వచ్చింది. ఇక మాస్ట్రో ఎడ్జ్ నైతే రూ.51,030కే కొనుకోవచ్చు. ప్రీమియం బైకులపై రూ.7500, ఎంట్రీలెవల్ బైకులపై రూ.5000వేల వరకు హీరో ఆఫర్ ప్రకటించింది. దీంతో గ్లామర్ రూ.59,755కు, స్ప్లెండర్ 125 రూ.55,575కు కొనుకునేలా ఆఫర్ ఉంది. ఒక్క హీరో, హోండా కంపెనీలు మాత్రమే కాక, సుజుకీ బైకులు, బజాజ్ బైకులు కూడా ఐఫోన్ కంటే తక్కువ ధరకే మార్కెట్లోకి వచ్చాయి.