ఫుల్ ఛార్జ్ బ్యాటరీ: నిమిషంలో.. | Honda Activa E Battery Swappable One Minute | Sakshi
Sakshi News home page

ఫుల్ ఛార్జ్ బ్యాటరీ: నిమిషంలో..

Nov 29 2024 5:56 PM | Updated on Nov 29 2024 6:35 PM

Honda Activa E Battery Swappable One Minute

హోండా టూ వీలర్స్ ఇండియా ఇటీవలే.. యాక్టివా ఈ, క్యూసీ1 అనే రెండు ఎలక్ట్రిక్ స్కూటర్లను ఆవిష్కరించింది. క్యూసీ1 స్కూటర్ ఫిక్స్డ్ బ్యాటరీ పొందుతుంది. యాక్టివా ఈ.. రిమూవబుల్ (స్వాపబుల్) బ్యాటరీ పొందుతుంది. అంటే బ్యాటరీ ఛార్జ్ అయిపోయిన తరువాత.. ఫుల్ ఛార్జ్ వున్న బ్యాటరీలను స్వాపింగ్ స్టేషన్‌లో తీసుకుని రీప్లేస్ చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన వీడియో కూడా నెట్టింట్లో వైరల్ అవుతోంది.

హోండా యాక్టివా ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ రెండు స్వాపబుల్ బ్యాటరీలతో వస్తుంది. వీటిని కేవలం నిమిషం వ్యవధిలోనే మార్చుకోవచ్చని కంపెనీ కూడా చెబుతోంది. స్వాపింగ్ స్టేషన్ సందర్శించిన తరువాత.. స్మార్ట్ కీ ఉపయోగించి అక్కడ నుంచి బ్యాటరీలను తీసుకోవచ్చు. అదే సమయంలో స్కూటర్‌లోని బ్యాటరీలను రిమూవ్ చేయడానికి కూడా ఎక్కువ సమయం కేటాయించాల్సిన అవసరం లేదు. కాబట్టి సంస్థ చెప్పినట్లుగానే బ్యాటరీని నిమిషం వ్యవధిలోనే మార్చుకోవచ్చు.

ఇదీ చదవండి: వాట్సాప్‌ గ్రూప్‌లో చేరాడు.. రూ.11 కోట్లు పోయాయి

ఒక్కో బ్యాటరీ బరువు 10.2 కేజీలు ఉంటుంది. స్కూటర్ రెండు బ్యాటరీలతో 102 కిమీ రేంజ్ అందిస్తుంది. దీని టాప్ స్పీడ్ 80 కిమీ/గం కాగా.. ఇది 7.3 సెకన్లలో 0 నుంచి 40 కిమీ వరకు వేగవంతం (యాక్సలరేషన్) అవుతుంది. డిజైన్, ఫీచర్స్ పరంగా ఉత్తమగానే ఉంటుంది. ఈ స్కూటర్ కోసం బుకింగ్స్ జనవరి 1 నుంచి ప్రారంభమవుతాయి. డెలివరీలు ఫిబ్రవరిలో మొదలవుతాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement