చాలా సంవత్సరాల నిరీక్షణకు తెరపడింది. హోండా టూ వీలర్స్ ఇండియా ఎలక్ట్రిక్ వాహన విభాగంలో అడుగుపెడుతూ.. రెండు ఎలక్ట్రిక్ స్కూటర్లను ఆవిష్కరించింది. ఒకటి యాక్టివా ఈ, మరొకటి క్యూసీ1. కంపెనీ ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ల కోసం 2025 జనవరి 1 నుంచే బుకింగ్స్ స్వీకరించడం ప్రారంభించనుంది. డెలివరీలు ఫిబ్రవరి నుంచి మొదలవుతాయి.
హోండా యాక్టివా ఈ స్కూటర్ రిమూవబుల్ బ్యాటరీ, క్యూసీ1 స్కూటర్ ఫిక్స్డ్ బ్యాటరీని పొందుతుంది. కేవలం ఐదు రంగులలో మాత్రమే ఈ స్కూటర్లు లభిస్తాయి. క్యూసీ1 భారతదేశం అంతటా దాదాపు అన్ని డీలర్‌షిప్‌లలో లభిస్తుంది. యాక్టివా ఈ మాత్రం ప్రారంభంలో బెంగళూరు, ముంబై, ఢిల్లీలలో మాత్రమే లభించనున్నట్లు సమాచారం.
లేటెస్ట్ డిజైన్ కలిగిన ఈ రెండు స్కూటర్లు చూడటానికి ఒకే మాదిరిగా ఉంటాయి. ఇందులో ఎల్‌ఈడీ లైటింగ్, బాడీ-కలర్ రియర్ వ్యూ మిర్రర్స్, ఫ్లాట్ ఫ్లోర్‌బోర్డ్, ఆల్ డిజిటల్ డిస్‌ప్లే, కాంటౌర్డ్ లాంగ్ అండ్ వెడల్ సీట్, సీ టైప్ ఛార్జింగ్ పోర్ట్‌తో కూడిన ఫ్రంట్ స్టోరేజ్ కంపార్ట్‌మెంట్, స్మార్ట్ కీ వంటివి ఉంటాయి.
యాక్టివా ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ రిమూవబుల్.. కాబట్టి దీనిని స్వాపబుల్ బ్యాటరీ స్టేషన్‌ల మార్చుకోవచ్చు. ఇది సమయాన్ని వృధా కాకుండా చేస్తుంది. అయితే క్యూసీ1 ఫిక్స్డ్ బ్యాటరీ కలిగి ఉంటుంది. దీనిని హోమ్ ఛార్జర్ లేదా ఫాస్ట్ ఛార్జర్ ద్వారా ఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది 26 లీటర్ల అండర్ సీట్ స్టోరేజ్ పొందుతుంది.
యాక్టివా ఈలోని 7-అంగుళాల TFT ఇన్‌స్ట్రుమెంటేషన్ యూనిట్.. రైడర్లకు న్యావిగేషన్, కాల్ అలర్ట్స్, బ్యాటరీ స్వాప్ లొకేషన్‌లు, మ్యూజిక్ కంట్రోల్ వంటి వాటిని చూపిస్తుంది. క్యూసీ1 స్కూటర్ 5 ఇంచెస్ ఎల్‌సీడీ స్క్రీన్ పొందుతుంది. ఇది కూడా వెహికల్ గురించి చాలా విషయాలను వెల్లడిస్తుంది.
పవర్‌ట్రెయిన్ విషయానికి వస్తే.. 'యాక్టివా ఈ' స్కూటర్ రెండు 1.5 కిలోవాట్ బ్యాటరీలను పొందుతుంది. వీటి ద్వారా 102 కిమీ ప్రయాణించవచ్చు. టాప్ స్పీడ్ 80 కిమీ/గం కాగా.. ఇది 7.3 సెకన్లలో 0 నుంచి 40 కిమీ వరకు వేగవంతం (యాక్సలరేషన్) అవుతుంది. ఈ స్కూటర్ బరువు 119 కేజీలు. క్యూసీ1 ఎలక్ట్రిక్ స్కూటర్ ఒక 1.5 కిలోవాట్ ఫిక్స్డ్ బ్యాటరీ పొందుతుంది. ఇది ఒక ఫుల్ ఛార్జీతో 80 కిమీ రేంజ్ అందిస్తుంది. మొత్తం మీద ఈ రెండు స్కూటర్లు ఉత్తమ పనితీరును అందిస్తాయని భావిస్తున్నాము.
Activa e: Swap easy. Ride easy.#Honda #ThePowerOfDreams #ElefrifyYourDreams pic.twitter.com/7gVBXVhdTi
— Honda 2 Wheelers India (@honda2wheelerin) November 27, 2024
Comments
Please login to add a commentAdd a comment