సాక్షి,ముంబై: హోండా 2వీలర్స్ తన కస్టమర్లకు మరో చక్కటి స్కూటర్‌ను అందించనుందా. కంపెనీ విడుదల చేసిన తాజా టీజర్ ఈ అంచనాలనే బలపరుస్తోంది. “కమింగ్ సూన్” అంటూ రానున్న హోండా యాక్టివా స్కూటర్‌పై వినియోగదారులను ఆకట్టుకుంటోంది.
రానున్న కొత్త స్కూటర్ ఫీచర్లు లాంటి విషయాలపై హోండా ఎలాంటి ధృవీకరణ చేయనప్పటికీ టీజర్‌లోని సిల్హౌటీని చూసి హోండా యాక్టివా 7జీ కావచ్చని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. బీఎస్-6 నిబంధనలకు అనుగుణంగా యాక్టివా 6జీని తీసుకొచ్చింది. ఫ్రంట్ టర్న్ ఇండికేటర్లు, హెడ్‌ల్యాంప్, రియర్ వ్యూ మిర్రర్స్, హ్యాండిల్ బార్స్‌తోపాటు, కొత్త డిజైన్, ఫీచర్ అప్‌గ్రేడ్‌లతో హోండా యాక్టివా 7జీ రానుంది. అయితే యాక్టివా 6 జీ మోడ్‌తో పోలిస్తే ఫీచర్లను మరింత అప్‌గ్రేడ్ చేసే అవకాశం ఉందనే ఊహాగానాలున్నాయి. (జియో మెగా ఫ్రీడం ఆఫర్, ఏడాది ఉచిత సబ్‌స్క్రిప్షన్)
BS6-కంప్లైంట్ 109.51cc, ఫ్యూయల్ ఇంజెక్షన్ టెక్నాలజీ సింగిల్-సిలిండర్ ఇంజన్‌ని ఉపయోగిస్తుంది. ఈ మోటార్ 8,000rpm వద్ద 7.79bhpను, 5,250rpm వద్ద 8.79Nm శక్తిని అందిస్తుంది. 'సైలెంట్ స్టార్ట్' సిస్టమ్, పాస్ లైట్ స్విచ్, 12 అంగుళాల ఫ్రంట్ వీల్, ఎక్స్‌టర్నల్ ఫ్యూయల్ ఫిల్లర్ క్యాప్, సాంప్రదాయ టెలిస్కోపిక్ ఫోర్క్ సస్పెన్షన్ యూనిట్‌తో సహా చాలా ఫీచర్లు యథావిధిగా ఉంటాయని అంచనా. అలాగే టీవీఎస్ జూపిటర్ వంటి ప్రత్యర్థులు కూడా అందిస్తున్న బ్లూటూత్ కనెక్టివిటీ వంటి కొత్త ఫీచర్లను వచ్చే దీపావళి నాటికి లాంచ్ అవుతుందని సమాచారం.
చదవండి : Revised ITR: రివైజ్డ్ ఐటీఆర్ దాఖలు చేయాలా? చివరి తేదీ ఎపుడు?
రాబోయే హోండా హోండా యాక్టివా 7జీ ఖరీదైనదిగా ఉండనుందట. ప్రస్తుత స్టాండర్డ్ మోడల్ ధర రూ. 72,400, డీలక్స్ వేరియంట్‌కు రూ. 74,400 వద్ద విక్రయిస్తున్న సంగతి తెలిసిందే. ఇది హీరో ప్లెజర్ ప్లస్, టీవీఎస్ జూపిటర్‌ప్లస్, హీరో Maestro Edge 110, యమహా ఫాసినోలాంటి మోడల్స్‌కు గట్టి పోటీ ఇవ్వనుంది.
Raise the bar with style that is unlike any other. Stay tuned! pic.twitter.com/u9RwNWe48F
— Honda 2 Wheelers (@honda2wheelerin) August 9, 2022
Comments
Please login to add a commentAdd a comment