ఫెస్టివ్‌ సీజన్‌: మారుతి కార్లపై భారీ తగ్గింపు | Maruti Suzuki Discount Offers On Maruti Suzuki Swift, Dzire And Wagon R In September 2023 - Sakshi
Sakshi News home page

Maruti Suzuki September 2023 Discounts: ఫెస్టివ్‌ సీజన్‌: మారుతి కార్లపై భారీ తగ్గింపు

Published Sat, Sep 9 2023 5:13 PM | Last Updated on Sat, Sep 9 2023 6:33 PM

Maruti Suzuki Discount Offers in September 2023 - Sakshi

ఫెస్టివ్‌ సీజన్‌ సందర్బంగా దేశీయ కార్ల దిగ్గజం మారుతి సుజుకి తన కార్లపై భారీ తగ్గింపును ప్రకటించింది. సెప్టెంబర్ 2023లో మారుతీ సుజుకి  కార్‌ లవర్స్‌  కోసం భారీ డిస్కౌంట్లు  ప్రకటించింది.మారుతి పాపులర్‌ మోడల్స్‌​ ఆల్టో కే10, S-ప్రెస్సో, వ్యాగన్‌ఆర్‌, ఈకో, సెలెరియో, స్విఫ్ట్, డిజైర్‌, బ్రెజ్జా, ఎర్టిగా వంటి పాపులర్‌ మోడల్స్‌  దాదాపు 60వేల దాకా  తగ్గింపుతో అందుబాటులో ఉన్నాయి.   

ఈ ఏడాది ఆగస్టులో మంత్లీ సేల్స్‌ పరంగా టాప్‌ పొజిషన్‌లో నిలిచిన మారుతి, పండుగ సీజన్‌లో సేల్స్‌ మరింత పెంచుకోవడంపై ఫోకస్‌ చేసింది. ఈ నెలలో మారుతి సుజుకి మోడల్స్‌పై అందుబాటులో ఉన్న ఆఫర్‌లు ఇప్పుడు చూద్దాం. (జీ20 సమ్మిట్‌: మెగా రైల్వే అండ్‌ షిప్పింగ్‌ ప్రాజెక్ట్‌పై ఉత్కంఠ)

మారుతి సుజుకి స్విఫ్ట్
ఐకానిక్‌  కారు కొనుగోలుపై రూ.60,000 వరకు ప్రయోజనాలు లభ్యం. ఇందులో రూ.35,000 క్యాష్‌ డిస్కౌంట్‌, రూ.20,000 ఎక్స్ఛేంజ్ బోనస్ ఉన్నాయి. అదనంగా సెలక్టెడ్‌ ట్రిమ్‌లపై రూ.5,000 కార్పొరేట్ డిస్కౌంట్‌ లభిస్తుంది. (బంగారం ధర దిగింది: కిలో వెండి ధర ఎలా ఉందంటే?)

మారుతి సుజుకి డిజైర్: రూ.10,000 ఎక్స్ఛేంజ్ బోనస్‌తో అందుబాటులో ఉంది. కానీ  ఎలాంటి నగదు ప్రయోజనాన్ని అందించలేదు. అలాగే ఎక్స్ఛేంజ్ బోనస్ పెట్రోల్ ట్రిమ్‌లకు  మాత్రమే అనేది  గమనించాలి. (

సెలెరియో: కారుపై రూ.20,000 ఎక్స్ఛేంజ్ బోనస్‌తో పాటు రూ.40,000 క్యాష్ డిస్కౌంట్‌, రూ.4,000 కార్పొరేట్ బెనిఫిట్‌ను అందిస్తోంది.అలాగే మారుతి సుజుకి  ఆల్టో K10పై రూ.54,000 వరకు డిస్కౌంట్‌. ఇందులో  బ్రాండ్ రూ.15,000 ఎక్స్చేంజ్ బోనస్‌తో కలిపి రూ.35,000 వరకు క్యాష్‌ బెనిఫిట్‌  లభ్యం.

వ్యాగన్ఆర్:  మారుతికి చెందిన మరో పాపులర్‌కారుపై   రూ.20,000 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్, రూ.35,000 వరకు క్యాష్‌ డిస్కౌంట్‌ అందిస్తుంది. అదనంగా రూ.4,000 కార్పొరేట్ బోనస్ డీల్‌  కూడా   పొందవచ్చు. (ఉత్తరాఖండ్‌ వరదలు:పెద్ద మనసు చాటుకున్న అనంత్‌ అంబానీ)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement