maruti alto
-
ఫెస్టివ్ సీజన్: మారుతి కార్లపై భారీ తగ్గింపు
ఫెస్టివ్ సీజన్ సందర్బంగా దేశీయ కార్ల దిగ్గజం మారుతి సుజుకి తన కార్లపై భారీ తగ్గింపును ప్రకటించింది. సెప్టెంబర్ 2023లో మారుతీ సుజుకి కార్ లవర్స్ కోసం భారీ డిస్కౌంట్లు ప్రకటించింది.మారుతి పాపులర్ మోడల్స్ ఆల్టో కే10, S-ప్రెస్సో, వ్యాగన్ఆర్, ఈకో, సెలెరియో, స్విఫ్ట్, డిజైర్, బ్రెజ్జా, ఎర్టిగా వంటి పాపులర్ మోడల్స్ దాదాపు 60వేల దాకా తగ్గింపుతో అందుబాటులో ఉన్నాయి. ఈ ఏడాది ఆగస్టులో మంత్లీ సేల్స్ పరంగా టాప్ పొజిషన్లో నిలిచిన మారుతి, పండుగ సీజన్లో సేల్స్ మరింత పెంచుకోవడంపై ఫోకస్ చేసింది. ఈ నెలలో మారుతి సుజుకి మోడల్స్‌పై అందుబాటులో ఉన్న ఆఫర్లు ఇప్పుడు చూద్దాం. (జీ20 సమ్మిట్: మెగా రైల్వే అండ్ షిప్పింగ్ ప్రాజెక్ట్‌పై ఉత్కంఠ) మారుతి సుజుకి స్విఫ్ట్ ఐకానిక్ కారు కొనుగోలుపై రూ.60,000 వరకు ప్రయోజనాలు లభ్యం. ఇందులో రూ.35,000 క్యాష్ డిస్కౌంట్, రూ.20,000 ఎక్స్ఛేంజ్ బోనస్ ఉన్నాయి. అదనంగా సెలక్టెడ్ ట్రిమ్‌లపై రూ.5,000 కార్పొరేట్ డిస్కౌంట్ లభిస్తుంది. (బంగారం ధర దిగింది: కిలో వెండి ధర ఎలా ఉందంటే?) మారుతి సుజుకి డిజైర్: రూ.10,000 ఎక్స్ఛేంజ్ బోనస్‌తో అందుబాటులో ఉంది. కానీ ఎలాంటి నగదు ప్రయోజనాన్ని అందించలేదు. అలాగే ఎక్స్ఛేంజ్ బోనస్ పెట్రోల్ ట్రిమ్‌లకు మాత్రమే అనేది గమనించాలి. ( సెలెరియో: కారుపై రూ.20,000 ఎక్స్ఛేంజ్ బోనస్‌తో పాటు రూ.40,000 క్యాష్ డిస్కౌంట్, రూ.4,000 కార్పొరేట్ బెనిఫిట్‌ను అందిస్తోంది.అలాగే మారుతి సుజుకి ఆల్టో K10పై రూ.54,000 వరకు డిస్కౌంట్. ఇందులో బ్రాండ్ రూ.15,000 ఎక్స్చేంజ్ బోనస్‌తో కలిపి రూ.35,000 వరకు క్యాష్ బెనిఫిట్ లభ్యం. వ్యాగన్ఆర్: మారుతికి చెందిన మరో పాపులర్కారుపై రూ.20,000 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్, రూ.35,000 వరకు క్యాష్ డిస్కౌంట్ అందిస్తుంది. అదనంగా రూ.4,000 కార్పొరేట్ బోనస్ డీల్ కూడా పొందవచ్చు. (ఉత్తరాఖండ్ వరదలు:పెద్ద మనసు చాటుకున్న అనంత్ అంబానీ) -
‘మారుతీ ఆల్టో 800’ను ఇక కొనలేరు! ఎందుకంటే...
కార్ల తయారీ దిగ్గజం మారుతీ సుజుకీ కంపెనీకి చెందిన ఆల్టో 800 కారును ఇకపై కొనలేరు. ఎందుకంటే తన ఎంట్రీ లెవల్ మోడల్ కారు ఆల్టో 800 ఉత్పత్తిని మారుతీ సుజుకీ నిలిపివేసింది. దీంతో మధ్యతరగతివారికి సైతం అందుబాటు ధరలో ఉంటూ అత్యధికంగా అమ్ముడవుతున్న మారుతీ ఆల్టో 800 కారు కస్టమర్లకు దూరం కానుంది. (వంట గ్యాస్ వినియోగదారులకు ఊరట.. తగ్గిన గ్యాస్ సిలిండర్ ధర!) బీఎస్6 (BS6) ఫేజ్ 2 నిబంధనలకు అనుగుణంగా ఆల్టో 800ని అప్‌గ్రేడ్ చేయడం ఆర్థికంగా లాభదాయకం కాదని కంపెనీ భావిస్తోంది. దీంతో ఆ కార్ల ఉత్పత్తిని ఆపేసినట్లు తెలుస్తోంది. దీంతోపాటు రోడ్డు ట్యాక్స్ పెరగడం, మెటీరియల్ ధర, ఇతర రకాల పన్నులు కూడా వాహనాల కొనుగోలు ఖర్చు పెరగడానికి కారణాలు. ఆల్టో 800 ఉత్పత్తిని నిలిపివేయడం వెనుక మరో కీలక అంశం ఆల్టో కె10కి డిమాండ్ పెరగడం. ఆల్టో 800 ఎంట్రీ-లెవల్ హ్యాచ్‌బ్యాక్ సెగ్మెంట్ తగ్గుముఖం పడుతోందని, ఈ విభాగంలో వాహనాల కొనుగోలు వ్యయం గణనీయంగా పెరిగిందని మారుతి సుజుకీ ఇండియా మార్కెటింగ్, సేల్స్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శశాంక్ శ్రీవాస్తవ పేర్కొన్నారు. (Jio offer: జియో అన్లిమిటెడ్ డేటా ఆఫర్.. కొత్త కస్టమర్లకు ఉచిత ట్రయల్!) ఆల్టో 800 నిలిపివేత తర్వాత ఆల్టో K10 మారుతీ సుజుకీ ఎంట్రీ-లెవల్ మోడల్ కానుంది. దీని ఢిల్లీ ఎక్స్ షోరూమ్ ధర రూ. 3.99 లక్షల నుంచి రూ 5.94 లక్షల మధ్య ఉంది. మారుతి సుజుకీ వెబ్సైట్ ఆల్టో 800 ధర రూ. 3.54 లక్షల నుంచి రూ 5.13 లక్షల మధ్య ఉంది. 2000 సంవత్సరంలో లాంచ్ అయిన ఆల్టో 800 కారులో 796 సీసీ పెట్రోల్ ఇంజన్ ఉంటుంది. 2010 వరకు దాదాపు 18 లక్షల కార్లు అమ్ముడుపోయాయి. ఆ తర్వాత ఆల్టో K10 భారత మార్కెట్లో విడుదలైంది . 2010 నుంచి ఇప్పటి వరకు 17 లక్షల ఆల్టో 800 కార్లను, 9.5 లక్షల ఆల్టో K10 కార్లను కంపెనీ విక్రయించింది. (విద్యార్థులకు ప్రత్యేక ఆఫర్! గతి స్టూడెంట్ ఎక్స్‌ప్రెస్ సర్వీసెస్) -
బెస్ట్ సెల్లింగ్ కారు ఇదే..
సాక్షి, ముంబై: దేశీయ ప్రముఖ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి కాంపాక్ట్ సెడాన్ న్యూ డిజైర్ బెస్ట్ సెల్లర్ కారు రికార్డును కొట్టేసింది. తద్వారా ఇప్పటిదాకా ఇండియలో అత్యధికంగా అమ్ముడయ్యే కారుగా నిలిచిన మారుతి ఆల్టోను వెనక్కి నెట్టేసింది. గడచిన ఆగస్టు నెలలో ఆల్టో రికార్డును డిజైర్ బీట్ చేసింది. ఈ ఏడాది దేశంలో ప్రారంభమైన మారుతి సుజుకి డిజైర్‌కు భారీ డిమాండ్ ఏర్పడింది. దీంతో ఆల్టో రెండవ స్థానంతో సరిపెట్టుకుంది. ఈ నెలలో 21,521 ఆల్టో యూనిట్లు అమ్ముడు కాగా, కొత్త డిజైర్ 30,934 విక్రయాలు నమోదయ్యాయని సియామ్(సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫాక్చరర్స్ అసోసియేషన్) తాజా గణాంకాలు వెల్లడించాయి. జూలై 2017 లో 110శాతం వృద్ధిని నమోదు చేసి 46శాతంతో మార్కెట్ వాటాతో కొనసాగుతోంది. మరోవైపు ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్‌లో మారుతి కార్ల విక్రయాలు 24శాతం వృద్ధితో 1,19,931 యూనిట్ల నుంచి 1,52,000 యూనిట్లకు పెరిగిందని సియామ్ పేర్కొంది. స్విఫ్ట్ తో పాటు ఎస్టిలో, డిజైర్, బాలెనో మోడల్స్ విక్రయాలు సగటున 62 శాతం వరకూ పెరిగాయని తెలిపింది. 17190 బాలెనో కార్లు, విటారా బ్రెజ్జా 14,396 యూనిట్ల విక్రయాలతో మూడు , నాలుగు స్థానాల్లో విటారా బ్రెజ్జా నిలిచాయి. మారుతి విటార బ్రెజ్జా, బాలెనో అమ్మకాల వృద్ధిరేటు ఆగస్టు 2017 నాటికి 23.8 శాతం పెరిగింది. అలాగే 3,907 యూనిట్లు, 12,631 యూనిట్ల విక్రయాలతో వరుసగా వాగన్ఆర్ , స్విఫ్ట్ ఐదవ, ఆరవ స్థానాల్లో నిలిచాయి. -
25 లక్షల మైలురాయికి మారుతీ ఆల్టో
న్యూఢిల్లీ: మారుతీ సుజుకి ఆల్టో కారు దేశీయ అమ్మకాలు 25 లక్షల మైలురాయిని దాటాయి. 25 లక్షలకు పైగా అమ్ముడైన తమ రెండో మోడల్ మారుతీ ఆల్టో అని మారుతీ సుజుకి కంపెనీ మంగళవారం తెలిపింది. (మొదటి మోడల్ మారుతీ 800) 2000 సంవత్సరంలో ఆల్టోని మార్కెట్లోకి తెచ్చామని, 14 ఏళ్లలోనే ఈ ఘనత సాధించామని కంపెనీ వైస్ ప్రెసిడెంట్(మార్కెటింగ్) మనోహర్ భట్ పేర్కొన్నారు. అంతేకాకుండా 2.85 లక్షల ఆల్టోలను ఎగుమతి చేశామని తెలిపారు. చిన్న కార్ల సెగ్మెంట్లో పోటీ తీవ్రంగా ఉన్నప్పటికీ, ఏళ్ల తరబడి అగ్రస్థానంలో కొనసాగుతున్నామని వివరించారు. ప్రస్తుతం ఆల్టో మెడల్లో ఎనిమిది వేరియంట్లను అందిస్తున్నామని, ధరలు రూ.2.41 లక్షల నుంచి మొదలవుతాయని పేర్కొన్నారు. ఆల్టో మోడల్లో 1,000 సీసీ వేరియంట్, ఆల్టో కే10ను 2010, ఆగస్టులో కంపెనీ మార్కెట్లోకి తెచ్చామని, ఇప్పటిదాకా ఈ మోడల్ కార్లను నాలుగు లక్షలను విక్రయించామని వివరించారు. ఇక అంతా కొత్తదైన ఆల్టో 800ను 2012, అక్టోబర్‌లో మార్కెట్లోకి విడుదల చేశామని, 124 రోజుల్లోనే లక్ష కార్లు అమ్ముడయ్యాయని భట్ పేర్కొన్నారు.