బెస్ట్‌ సెల్లింగ్‌ కారు ఇదే.. | New Maruti Dzire Beats Maruti Alto to Become the Bestselling Car in August 2017 | Sakshi
Sakshi News home page

బెస్ట్‌ సెల్లింగ్‌ కారు ఇదే..

Published Fri, Sep 8 2017 1:18 PM | Last Updated on Sun, Sep 17 2017 6:36 PM

బెస్ట్‌ సెల్లింగ్‌ కారు ఇదే..

బెస్ట్‌ సెల్లింగ్‌ కారు ఇదే..

సాక్షి, ముంబై:  దేశీయ ప్రముఖ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి కాంపాక్ట్‌ సెడాన్‌ న్యూ డిజైర్‌  బెస్ట్‌ సెల్లర్‌ కారు రికార్డును  కొట్టేసింది.   తద్వారా ఇప్పటిదాకా ఇండియలో అత్యధికంగా అమ్ముడయ్యే కారుగా నిలిచిన  మారుతి ఆల్టోను వెనక్కి నెట్టేసింది.  గడచిన ఆగస్టు నెలలో ఆల్టో రికార్డును డిజైర్ బీట్ చేసింది.  ఈ ఏడాది  దేశంలో ప్రారంభమైన మారుతి సుజుకి  డిజైర్‌కు భారీ డిమాండ్‌  ఏర‍్పడింది.  దీంతో ఆల్టో  రెండవ స్థానంతో సరిపెట్టుకుంది.  ఈ నెలలో 21,521 ఆల్టో యూనిట్లు అమ్ముడు కాగా, కొత్త డిజైర్‌  30,934  విక్రయాలు నమోదయ్యాయని  సియామ్‌(సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫాక్చరర్స్ అసోసియేషన్) తాజా గణాంకాలు వెల్లడించాయి.  జూలై 2017 లో 110శాతం  వృద్ధిని నమోదు చేసి 46శాతంతో మార్కెట్ వాటాతో కొనసాగుతోంది.  


మరోవైపు ఇయర్‌ ఆన్‌ ఇయర్‌ బేసిస్‌లో మారుతి కార్ల విక్రయాలు 24శాతం వృద్ధితో 1,19,931 యూనిట్ల నుంచి 1,52,000 యూనిట్లకు పెరిగిందని సియామ్‌ పేర్కొంది.  స్విఫ్ట్ తో పాటు ఎస్టిలో, డిజైర్, బాలెనో మోడల్స్ విక్రయాలు సగటున 62 శాతం వరకూ పెరిగాయని తెలిపింది.  17190 బాలెనో కార్లు,  విటారా బ్రెజ్జా 14,396 యూనిట్ల విక్రయాలతో మూడు , నాలుగు స్థానాల్లో విటారా బ్రెజ్జా నిలిచాయి.    మారుతి విటార బ్రెజ్జా, బాలెనో అమ్మకాల వృద్ధిరేటు ఆగస్టు 2017 నాటికి 23.8 శాతం పెరిగింది.  అలాగే 3,907 యూనిట్లు, 12,631 యూనిట్ల విక్రయాలతో  వరుసగా వాగన్ఆర్ , స్విఫ్ట్ ఐదవ, ఆరవ స్థానాల్లో నిలిచాయి.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement