మారుతి స్విఫ్ట్ 2017 ఇదే! | Maruti Suzuki Swift 2017 rendering provides strong insights | Sakshi
Sakshi News home page

మారుతి స్విఫ్ట్ 2017 ఇదే!

Published Tue, Jun 28 2016 10:24 AM | Last Updated on Mon, Sep 4 2017 3:38 AM

మారుతి స్విఫ్ట్ 2017 ఇదే!

మారుతి స్విఫ్ట్ 2017 ఇదే!

బాలెనో, బ్రెజా మోడళ్లు భారత్ లో సక్సెస్ కావడంతో కొత్త తరహా స్విఫ్ట్ మోడల్ ను ప్రవేశపెట్టేందుకు మారుతీ సుజుకీ సిద్ధమైనట్లు కనిపిస్తోంది. తాజాగా ఆన్ లైన్ లో మారుతీ సుజుకీ 2017 మోడల్ ఇదేనంటూ కొత్త డిజైన్, న్యూ లుక్ తో స్విఫ్ట్ దర్శనమిస్తోంది. కాగా, వచ్చే ఏడాది మారుతీ దీనిని విడుదల చేస్తుందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

బాలెనో లానే కొద్ది మార్పులతో స్విఫ్ట్ ను మార్కెట్ లో ప్రవేశపెట్టేందుకు కంపెనీ ప్లాన్ ను సిద్ధంచేసుకున్నట్లు సమాచారం. పాత మోడల్ లో కంటే కొత్త మోడల్ దాదాపు 100 కేజీల బరువు తగ్గనుంది. దీంతో మైలేజ్ కూడా గణనీయంగా పెరిగే అవకాశం కనిపిస్తోంది. చూద్దాం.. 2017లో స్విఫ్ట్ ఎలా ఉండబోతోందో.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement