సాక్షి, ముంబై: మారుతి సుజుకి కొత్త వెర్షన్ బ్రెజ్జాను తీసుకురానుంది. 2022 మారుతి సుజుకి బ్రెజ్జా సబ్‌కాంపాక్ట్ ఎస్‌యూవీని లాంచ్ చేయనుంది. అలాగే మారుతి సుజుకి పేరు నుండి 'వితారా' అనే పదాన్ని తొలగిస్తోంది. కేవలం బ్రెజ్జా అని పిలుస్తోంది.ఈ మేరకు మొదటి టీజర్‌ను కంపెనీ విడుదల చేసింది
కొత్త 2022 బ్రెజ్జా జూన్ 30నుంచి కస్టమర్‌లు అరేనా షోరూమ్‌లో లేదా ఆన్‌లైన్‌లో 11 వేలకు ప్రీ-ఆర్డర్ చేయవచ్చు. సబ్‌కాంపాక్ట్ ఎస్‌యూవీకి స్టైలింగ్, ఫీచర్లు టెక్ పరంగా బారీ మేక్ఓవర్‌ను అందిస్తోంది. ముఖ్యంగా కొత్త బ్రెజ్జా తొలి సన్‌రూఫ్ కారుగా రావడం స్పెషల్ ఎట్రాక్షన్ కానుంది.ఇంకా కార్ టెక్ కనెక్ట్ , ప్యాడిల్ షిఫ్టర్, 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్, 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ లేదా ESPతో అప్‌డేట్ చేయబడిన ఇంజీన్‌ను జోడించింది. 5 లీటర్ పెట్రోల్ ఇంజన్ 102బీహెచ్‌పీ వద్ద 35 ఎన్‌ఎం గరిష్ట టార్క్‌ను అందిస్తుంది. సీఎస్‌జీ వెర్షన్ కూడా ఉంటుందని భావిస్తున్నారు.
కేవలం 6 సంవత్సరాలలో 7.5 లక్షల యూనిట్ల అమ్మకాలతో, దేశంలోని కాంపాక్ట్ ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో బ్రెజ్జా బలమైన మార్కెట్ మారుతీ సీనియర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (మార్కెటింగ్ & సేల్స్) శశాంక్ శ్రీవాస్తవ తెలిపారు సరికొత్త టెక్ ఫీచర్‌లు, కమాండింగ్ డ్రైవింగ్ ఫీచర్స్‌తో మారుతి కొత్త బ్రెజ్జా నెక్స్ట్-జెన్ స్మార్ట్ హైబ్రిడ్ కె-సిరీస్ ఇంజన్‌తో వస్తుందని, న్యూహాట్, టెక్కీ బ్రెజ్జాను పరిచయం చేస్తున్నామన్నారు.
Feel the breeze while cruising through the city! Introducing Electric Sunroof in the All New #HotAndTechyBrezza.#BookingsOpen #AllNewBrezza #MarutiSuzukiArena #MSArena #MarutiSuzuki pic.twitter.com/ipJI67BbCA
— Maruti Suzuki Arena (@MSArenaOfficial) June 20, 2022
Comments
Please login to add a commentAdd a comment