Brezza
-
ఈ కారుని 10 లక్షల మంది కొనేశారు
భారతీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన 'మారుతి సుజుకి' (Maruti Suzuki) యొక్క 'బ్రెజ్జా' (Brezza) విక్రయాల పరంగా ఓ సరికొత్త రికార్డుని కైవసం చేసుకుంది. దేశీయ విఫణిలో అడుగుపెట్టినప్పటిన ఏడు సంవత్సరాల ఎనిమిది నెలలు కాలంలో ఈ రికార్డుని సొంతం చేసుకుంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. నివేదికల ప్రకారం 2016 మార్చి నుంచి ఇప్పటికి 10 లక్షలు లేదా 1 మిలియన్ కార్లను విక్రయించినట్లు మారుతి సుజుకి వెల్లడించింది. కంపెనీ 9 లక్షల యూనిట్లను విక్రయించిన తరువాత కేవలం ఎనిమిది నెలల్లో మరో లక్ష యూనిట్లను విక్రయించినట్లు సమాచారం. దేశీయ మార్కెట్లో విడుదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు సగటు నెలవారీ అమ్మకాలు 13,921 యూనిట్లు లేదా వారానికి 3480 లేదా ప్రతిరోజూ 497 యూనిట్లు అని తెలుస్తోంది. ఇదీ చదవండి: ఆర్బీఐ గవర్నర్‌గా 'రఘురామ్ రాజన్' జీతం ఎంతంటే? ఈ ఏడాది మార్చిలో CNG వేరియంట్‌ని ప్రవేశపెట్టిన తరువాత అమ్మకాలు మరింత వేగవంతమయ్యాయి. అంతకు ముందు బ్రెజ్జా ప్రత్యర్థి నెక్సాన్ వల్ల అమ్మకాలు కొంత మందగించాయి. కానీ 2022 - 23 ఆర్ధిక అసంవత్సరంలో బ్రెజ్జా అత్యధికంగా అమ్ముడైన కారుగా రికార్డ్ క్రియేట్ చేసింది. -
భారత్‌లో మారుతి బ్రెజ్జా సిఎన్జి లాంచ్.. పూర్తి వివరాలు
సిఎన్జి విభాగంలో జోరుగా ముందుకు సాగుతున్న మారుతి సుజుకి ఎట్టకేలకు భారతీయ మార్కెట్లో తన 'బ్రెజ్జా సిఎన్జి' విడుదల చేసింది. కంపెనీ ఇప్పటికే దీని కోసం బుకింగ్స్ స్వీకరించడం కూడా ప్రారంభించింది. బుకింగ్స్ & ధరలు: మారుతి సుజుకి బ్రెజ్జా సిఎన్జి కోసం రూ. 25,000తో బుకింగ్స్ స్వీకరించడం ప్రారంభించింది. కాగా ఈ కొత్త మోడల్ ప్రారంభ ధర రూ. 9.14 లక్షలు, కాగా టాప్ వేరియంట్ ధర రూ. 11.90 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఈ ధరలు ఇప్పటికే అమ్మకానికి ఉన్న పెట్రోల్ వేరియంట్స్ కంటే రూ. 95,000 ఎక్కువ. వేరియంట్స్: మారుతి బ్రెజ్జా సిఎన్జి మూడు వేరియంట్స్‌లో లభిస్తుంది. అవి LXi, VXi, ZXi. వీటి ధరలు వరుసగా రూ. 9.14 లక్షలు, రూ. 10.50 లక్షలు, రూ. 11.90 లక్షలు (అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఇండియా). టాప్ వేరియంట్ అయిన జెడ్ఎక్స్ఐ డ్యూయల్-టోన్ కలర్ ఆప్షన్లో కూడా లభిస్తుంది. దీని కోసం రూ. 16,000 అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. డిజైన్ & ఫీచర్స్: బ్రెజ్జా సిఎన్జి డిజైన్ పరంగా దాదాపు దాని మునుపటి మోడల్ మాదిరిగానే ఉంటుంది. అయితే ఇందులో బూట్ స్పేస్ చాలా తక్కువగా ఉంటుంది. దీనికి కారణం బూట్ స్పేస్‌లో సిఎన్జి ట్యాంక్ అమర్చబడి ఉండటమే. ఇంటీరియర్ చాలా వరకు బ్లాక్ కలర్లో ఉంటుంది. ఇందులో 7.0 ఇంచెస్ టచ్‌స్క్రీన్, వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో/యాపిల్ కార్ప్లే, స్టార్ట్/స్టాప్ బటన్, సన్‌రూఫ్, క్రూయిజ్ కంట్రోల్ వంటి ఫీచర్స్ లభిస్తాయి. (ఇదీ చదవండి: 2023 కియా కారెన్స్ విడుదల చేసిన కియా మోటార్స్ - పూర్తి వివరాలు) పవర్‌ట్రెయిన్: కొత్త మారుతి బ్రెజ్జా సిఎన్జి అదే 1.5-లీటర్ K15C డ్యూయల్‌జెట్ ఇంజన్‌తో పనిచేస్తుంది. ఇది పెట్రోల్ మోడ్‌లో 101 హెచ్‌పి పవర్, 136 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. సిఎన్జి మోడ్‌లో 88 హెచ్‌పి పవర్, 121.5 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఇంజిన్ 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో జత చేయబడుతుంది. ఇది 25.51 కిమీ/కేజీ మైలేజ్ అందిస్తుందని కంపెనీ తెలిపింది. (ఇదీ చదవండి: ఒకటి తగ్గింది.. మరొకటి పెరిగింది: ఇదీ టయోటా హైలెక్స్ ధరల వరుస!) ప్రత్యర్థులు: మారుతి సిఎన్జి దేశీయ విఫణిలో హ్యుందాయ్ వెన్యూ, టాటా నెక్సాన్, రెనాల్ట్ కిగర్, కియా సోనెట్, నిస్సాన్ మాగ్నైట్, రాబోయే మారుతి ఫ్రాంక్స్ వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది. ఇక్కడ తెలుసుకోవాల్సిన మరో విషయం ఏమిటంటే కాంపాక్ట్ SUV విభాగంలో సిఎన్జి పవర్‌ట్రెయిన్ పొందిన మొదటి కారు మారుతి బ్రెజ్జా. -
Maruti Suzuki Brezza CNG.. ఇప్పుడే బుక్ చేసుకోండి!
భారతదేశంలో ఎక్కువమంది ఇష్టపడే కార్ బ్రాండ్లలో ఒకటైన 'మారుతి సుజుకి' దేశీయ విఫణిలో ఎప్పటికప్పుడు కొత్త ఉత్పత్తులను, అప్డేటెడ్ ఉత్పత్తులను విడుదల చేస్తూనే ఉంది. CNG విభాగంలో దూసుకెళ్తున్న కంపెనీ త్వరలో తన బ్రెజ్జా కాంపాక్ట్ ఎస్‌యువిని ఈ విభాగంలో విడుదల చేయడానికి సన్నద్ధమవుతోంది. బుకింగ్ ప్రైస్ & డెలివరీలు: మారుతి సుజుకి విడుదల చేయనున్న కొత్త బ్రెజ్జా సిఎన్జి కోసం కంపెనీ రూ. 25,000తో బుకింగ్స్ స్వీకరించడం ప్రారంభించింది. దీన్నిబట్టి చూస్తే ఇది మార్కెట్లో త్వరలోనే విడుదలయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. కాగా డెలివరీలు ప్రారంభం కావడానికి మూడు నుంచి నాలుగు నెలల సమయం పట్టే అవకాశం ఉందనిపిస్తుంది. (ఇదీ చదవండి: 2023 Royal Enfield 650: రాయల్ ఎన్ఫీల్డ్ 650 బైక్స్ ఇప్పుడు మరింత కొత్తగా) వేరియంట్స్: మొదటి సారి 2023 ఆటో ఎక్స్‌పోలో కనిపించిన ఈ సిఎన్జి వెర్షన్ మొత్తం నాలుగు ట్రిమ్‌లలో విడుదల కానుంది అవి LXI, VXI, ZXI, ZXI+. ఈ మోడల్ ఇతర మారుతి సిఎన్జి కార్ల మాదిరిగా కాకుండా.. ICE బేస్డ్ వెర్షన్ మాదిరిగా అన్ని ట్రిమ్‌లలో అందుబటులో ఉంటుంది. కాగా ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో విడుదలయ్యే మొదటి సిఎన్జి బ్రెజ్జా కావడం విశేషం. డిజైన్ & ఫీచర్స్: మారుతి బ్రెజ్జా సిఎన్జి చూడటానికి దాని మునుపటి మోడల్ మాదిరిగానే ఉంటుంది. అయితే ఇది సిఎన్జి అని గుర్తించడానికి ఇందులో S-CNG బ్యాడ్జ్ చూడవచ్చు. బూట్లో సిఎన్జి ట్యాంక్ అమర్చబడి ఉండటం వల్ల స్పేస్ తక్కువగా ఉంటుంది. ఇక ఫీచర్స్ విషయానికీ వస్తే, ఇందులో స్మార్ట్‌ప్లే ప్రో+తో కూడిన 7.0 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్, వాయిస్ అసిస్టెంట్, OTA అప్డేట్లతో కనెక్టెడ్ కార్ టెక్నాలజీ, స్టార్ట్/స్టాప్ బటన్, ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, రియర్ వ్యూ కెమెరా వంటివి ఉన్నాయి. పవర్‌ట్రెయిన్: కంపెనీ బ్రెజ్జా సిఎన్జి గురించి ఎటువంటి అధికారిక సమాచారం వెల్లడించలేదు, కానీ ఇది ఇప్పటికే విక్రయించబడుతున్న ఎర్టిగా, ఎక్స్ఎల్6 మాదిరిగా 1.5 లీటర్ K15C పెట్రోల్ ఇంజిన్ పొందనుంది. ఇది పెట్రోల్ మోడ్‌లో 100 హెచ్‌పి పవర్, 136 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. సిఎన్జి మోడ్‌లో 88 హెచ్‌పి పవర్, 121.5 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఇంజిన్ 5-స్పీడ్ మాన్యువల్ లేదా 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో జత చేయబడుతుంది. (ఇదీ చదవండి: NRI PAN Card: ఎన్ఆర్ఐ పాన్ కార్డు కోసం సింపుల్ టిప్స్!) ధర & ప్రత్యర్థులు: మారుతి సుజుకి కొత్త బ్రెజ్జా సిఎన్జి ధరలను అధికారికంగా ప్రకటించలేదు, కానీ ఇది దాని పెట్రోల్ మోడల్ కంటే కొంత ఎక్కువ ధర వద్ద విడుదలయ్యే అవకాశం ఉందని భావిస్తున్నాము. కావున దీని ధర రూ. 8.19 లక్షల నుంచి రూ. 13.88 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉండే అవకాశం ఉంది. భారతీయ మార్కెట్లో విడుదలకానున్న కొత్త మారుతి సుజుకి బ్రెజ్జా సిఎన్‌జికి ప్రత్యక్ష ప్రత్యర్థులు లేదు, కానీ ఇప్పటికే మార్కెట్లో అమ్ముడవుతున్న టాటా నెక్సాన్, కియా సోనెట్, హ్యుందాయ్ వెన్యూ వంటి వాటితో విక్రయాల పరంగా కొంత పోటీని ఎదుర్కోవలసి ఉంటుంది. -
ఆల్ న్యూ మారుతి బ్రెజా వచ్చేసింది, ధర ఎంతంటే?
సాక్షి,ముంబై: మారుతి సుజుకి కొత్త వెర్షన్ ఎస్యూవీ బ్రెజాను గురువారం లాంచ్ చేసింది. కంపెనీ చరిత్రలో తొలిసారిగా బ్రెజా 2022 మోడల్లో 6 ఎయిర్‌బ్యాగ్‌లను అందిస్తోంది. అలాగే మొదటిసారిగా ప్యాడిల్ షిఫ్టర్లను కూడా జోడించింది. మొత్తం 10 వేరియంట్లు, ఇందులో 7 మాన్యువల్ ట్రిమ్లుగా, 3 ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ వేరియంట్లు అందుబాటులో ఉంటాయి.మూడు డ్యూయల్-టోన్ షేడ్స్‌తో సహా బ్రెజా తొమ్మిది రంగుల్లో తీసుకొచ్చింది. కొత్త మారుతి సుజుకి బ్రెజా కొత్త గ్రిల్, హెడ్లైట్లు, టెయిల్ లైట్లతో సహా ఎక్ట్సీరియర్‌లో డిజైన్‌లో అనేక మార్పులను పొందింది. 1.5 లీటర్ పెట్రోల్ ఇంజన్, వైర్లెస్ ఛార్జింగ్ డాక్, ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, పరిసర లైటింగ్, హెడ్ అప్ డిస్ప్లేస్, 360 డిగ్రీ కెమెరా ఇతర ఫీచర్లుగా ఉన్నాయి. ప్రీ-బుకింగ్‌లను ప్రారంభించిన 8 రోజుల్లోనే 45 వేలకుపైగా ఆర్డర్లను సాధించినట్టు కంపెనీ వెల్లడించింది. భారతదేశంలో సరికొత్త మారుతి సుజుకి బ్రెజా రూ. 7.99 లక్షల ప్రారంభ ధర (ఎక్స్-షోరూమ్)గా, హై ఎండ్ మోడల్ ధర రూ. 13.96 లక్షలుగా కంపెనీ నిర్ణయించింది. -
ఆల్-న్యూ హాట్ & టెక్కీ బ్రెజ్జా, ఒక సూపర్ సర్ప్రైజ్ కూడా
సాక్షి, ముంబై: మారుతి సుజుకి కొత్త వెర్షన్ బ్రెజ్జాను తీసుకురానుంది. 2022 మారుతి సుజుకి బ్రెజ్జా సబ్‌కాంపాక్ట్ ఎస్‌యూవీని లాంచ్ చేయనుంది. అలాగే మారుతి సుజుకి పేరు నుండి 'వితారా' అనే పదాన్ని తొలగిస్తోంది. కేవలం బ్రెజ్జా అని పిలుస్తోంది.ఈ మేరకు మొదటి టీజర్‌ను కంపెనీ విడుదల చేసింది కొత్త 2022 బ్రెజ్జా జూన్ 30నుంచి కస్టమర్లు అరేనా షోరూమ్‌లో లేదా ఆన్లైన్లో 11 వేలకు ప్రీ-ఆర్డర్ చేయవచ్చు. సబ్‌కాంపాక్ట్ ఎస్‌యూవీకి స్టైలింగ్, ఫీచర్లు టెక్ పరంగా బారీ మేక్ఓవర్‌ను అందిస్తోంది. ముఖ్యంగా కొత్త బ్రెజ్జా తొలి సన్‌రూఫ్ కారుగా రావడం స్పెషల్ ఎట్రాక్షన్ కానుంది.ఇంకా కార్ టెక్ కనెక్ట్ , ప్యాడిల్ షిఫ్టర్, 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్, 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ లేదా ESPతో అప్డేట్ చేయబడిన ఇంజీన్‌ను జోడించింది. 5 లీటర్ పెట్రోల్ ఇంజన్ 102బీహెచ్పీ వద్ద 35 ఎన్ఎం గరిష్ట టార్క్‌ను అందిస్తుంది. సీఎస్జీ వెర్షన్ కూడా ఉంటుందని భావిస్తున్నారు. కేవలం 6 సంవత్సరాలలో 7.5 లక్షల యూనిట్ల అమ్మకాలతో, దేశంలోని కాంపాక్ట్ ఎస్యూవీ సెగ్మెంట్లో బ్రెజ్జా బలమైన మార్కెట్ మారుతీ సీనియర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (మార్కెటింగ్ & సేల్స్) శశాంక్ శ్రీవాస్తవ తెలిపారు సరికొత్త టెక్ ఫీచర్లు, కమాండింగ్ డ్రైవింగ్ ఫీచర్స్‌తో మారుతి కొత్త బ్రెజ్జా నెక్స్ట్-జెన్ స్మార్ట్ హైబ్రిడ్ కె-సిరీస్ ఇంజన్‌తో వస్తుందని, న్యూహాట్, టెక్కీ బ్రెజ్జాను పరిచయం చేస్తున్నామన్నారు. Feel the breeze while cruising through the city! Introducing Electric Sunroof in the All New #HotAndTechyBrezza.#BookingsOpen #AllNewBrezza #MarutiSuzukiArena #MSArena #MarutiSuzuki pic.twitter.com/ipJI67BbCA — Maruti Suzuki Arena (@MSArenaOfficial) June 20, 2022 -
కొత్త కారు కొనేవారికి మారుతి సుజుకి బంపర్ ఆఫర్..!
కొత్తగా కారు కొనుగోలు చేయాలనుకునే వారికి ఇది మంచి అవకాశం. ప్రముఖ కార్ల తయారీ కంపెనీ మారుతి సుజుకీ ఇండియా తాజాగా తన కార్లపై అదిరిపోయే ఆఫర్ ప్రకటించింది. కారు కొనుగోలుపై భారీగా తగ్గింపు అందిస్తోంది. హోలీ పండగ సందర్భంగా భారీగా ఆఫర్ ఇస్తున్నట్లు ప్రకటించింది. దేశంలో అతిపెద్ద వాహన తయారీ సంస్థ అయిన మారుతీ పాపులర్ మోడల్స్ అన్నింటిపై భారీ డిస్కౌంట్లు, పండుగ ఆఫర్లు ప్రకటించింది. ఆల్టో, ఎస్-ప్రెసో, సెలెరియో, వేగన్ఆర్, స్విఫ్ట్, డిజైర్, బ్రెజా మోడల్స్‌పై ఈ డిస్కౌంట్లు లభించనున్నాయి. మహీంద్రా, టాటా వంటి ఇతర తయారీ కంపెనీలు కూడా తమ కార్లపై డిస్కౌంట్ అందిస్తున్నాయి. మారుతి సుజుకి ఆల్టో మారుతి ఆల్టో(ఎస్టిడి)పై రూ.5,000 నగదు డిస్కౌంట్, రూ.3,000 కార్పొరేట్ డిస్కౌంట్ అందుబాటులో ఉన్నాయి. మారుతి ఆల్టో అత్యంత పాకెట్ ఫ్రెండ్లీ కార్లలో ఒకటి. ధీని ధర రూ.3.25 లక్షలతో ప్రారంభమవుతుంది. మారుతి సుజుకి సెలెరియో మారుతి సుజుకి సెలెరియో మాన్యువల్ వేరియెంట్లపై రూ.10,000 నగదు డిస్కౌంట్, కార్పొరేట్ డిస్కౌంట్ రూ.3,000, ఎక్స్ఛేంజ్ బోనస్ రూ.10,000 లభిస్తుంది. ఇంకా హ్యాచ్ బ్యాక్ గురించి మాట్లాడీతే.. మారుతి సుజుకి ఎస్-ప్రెస్సోపై రూ.15,000 భారీ నగదు డిస్కౌంట్, రూ.10,000 ఎక్స్ఛేంజ్ బోనస్, రూ.3,000 కార్పొరేట్ డిస్కౌంట్ పొందవచ్చు. మారుతి సుజుకి వ్యాగన్ ఆర్ మారుతి సుజుకి వ్యాగన్ఆర్ పై అతిపెద్ద డిస్కౌంట్ ఆఫర్ అందిస్తుంది. దీని మాన్యువల్ వేరియెంట్లు మార్చి 2022 వరకు 1.0-లీటర్ పెట్రోల్ వేరియెంట్లపై రూ.25,000, 1.2-లీటర్ పెట్రోల్ వేరియెంట్లపై రూ.20,000 నగదు డిస్కౌంట్ 'తో లభ్యం అవుతాయి. రూ.10,000 ఎక్స్ఛేంజ్ ఆఫర్, రూ.4,000 కార్పొరేట్ డిస్కౌంట్ అదనం. మారుతి సుజుకి స్విఫ్ట్ మారుతి సుజుకి స్విఫ్ట్ పై డిస్కౌంట్ల విషయానికి వస్తే, ఇది ఎల్ఎక్స్ ఐ వేరియెంట్లపై రూ.10,000, విఎక్స్ఐ & జెడ్ఎక్స్ఐ వేరియెంట్లపై రూ.20,000 నగదు డిస్కౌంట్, 10,000 ఎక్స్ఛేంజ్ బెనిఫిట్, రూ.3,000 కార్పొరేట్ డిస్కౌంట్ లభిస్తుంది. మారుతి సుజుకి డిజియర్ మారుతి సుజుకి డిజిర్ రూ.3,000 కార్పొరేట్ డిస్కౌంట్'తో పాటు క్యాష్ డిస్కౌంట్, ఎక్స్ఛేంజ్ బోనస్ కలిపి రూ.10,000 డిస్కౌంట్ అందిస్తుంది. ఈ డిస్కౌంట్ మాన్యువల్ వేరియెంట్ కార్ల కొరకు మాత్రమే అని గుర్తుంచుకోవాలి. మారుతి సుజుకి వితారా బ్రెజ్జా మారుతి సుజుకి వితారా బ్రెజ్జా కారుపై రూ.5,000 నగదు డిస్కౌంట్, రూ.10,000 ఎక్స్ఛేంజ్ ఆఫర్, రూ.3,000 కార్పొరేట్ డిస్కౌంట్ లభిస్తుంది. (చదవండి: మదుపరులకు శుభవార్త.. ఎల్ఐసీ ఐపీఓకు సెబీ ఆమోదం..!) -
మారుతీ రికార్డుల మోత
న్యూఢిల్లీ : దేశీయ అతిపెద్ద ఆటో దిగ్గజం మారుతీ సుజుకీ సరికొత్త రికార్డు మోత మోగించింది. జూలై నెలలో కార్ల అమ్మకాల్లో 20.6 శాతం జంప్ చేయడంతో మారుతీ సుజుకీ షేర్లు నేటి ట్రేడింగ్ సరికొత్త గరిష్టంలో 3 శాతం జంప్ చేశాయి. జూలై నెలలో మారుతీ సుజుకీ 1,65,346 యూనిట్ల విక్రయాలను నమోదుచేసింది. మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో గత నెలలో 1,54,001 వాహనాలను దేశీయంగా విక్రయిస్తే, 11,345 యూనిట్లను ఎగుమతి చేసినట్టు తెలిపింది. మారుతీ సుజుకీ ఈ ప్రకటన వెలువరించిన వెంటనే స్టాక్ ధర 2.75 శాతం పైకి ఎగిసి, రికార్డు గరిష్టంలో రూ.7920 గా నమోదైంది. దీంతో మార్కెట్ విలువ కూడా రూ.2.4 లక్షల కోట్లకు పెరిగింది. యుటిలిటీ వెహికిల్ సెగ్మెంట్లో ఎర్టిగా, ఎస్-క్రాస్, విటారా బ్రీజా అమ్మకాలు ఏడాది ఏడాదికి 46.1 శాతం వృద్ధిని నమోదుచేసినట్టు ఈ కార్ల కంపెనీ పేర్కొంది. వీటి తర్వాత కాంపాక్ట్ సెగ్మెంట్ 19.6 శాతం, మిడ్ సైజ్ సెగ్మెంట్ 17.1 శాతం, మినీ సెగ్మెంట్ 14.1 శాతం పైకి ఎగిసినట్టు మారుతీ సుజుకీ తెలిపింది. -
విక్రయాల్లో పడిపోయిన మారుతి
పండుగ సీజన్లో కార్ల విక్రయాలు జోరు కొనసాగుతుండగా.. దేశీయ అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకీ మాత్రం ఈ అక్టోబర్ నెల విక్రయాల్లో స్వల్పంగా పడిపోయింది. గతేడాది 1,34,209 యూనిట్లగా ఉన్న కంపెనీ విక్రయాలు ఈ ఏడాది 1,33,793 యూనిట్లుగా నమోదయ్యాయి. మొత్తంగా విక్రయాలు మందగించినప్పటికీ, దేశీయ అమ్మకాల్లో మారుతి మెరుగైన పెరుగుదలనే నమోదుచేసింది. దేశీయంగా 2.2 శాతం అమ్మకాలు పెంచుకుని 1,23,764 యూనిట్లగా నమోదుచేసినట్టు ఎంఎస్ఐ ఓ ప్రకటనలో తెలిపింది. 2015 అక్టోబర్‌లో ఈ విక్రయాలు 1,21,063 యూనిట్లుగా ఉన్నాయి. మారుతి సుజుకీ ఉత్పత్తులకు డిమాండ్‌గా బలంగానే ఉందని కంపెనీ పేర్కొంది. సియాజ్, ఎస్ క్రాస్, ఎర్టిగా, బ్రిజా, బాలెనో రిటైల్ విక్రయాలు అత్యధికంగా నమోదైనట్టు ఎంఎస్ఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్(మార్కెటింగ్, సేల్స్) ఆర్ఎస్ కాల్సి తెలిపారు. నెలవారీ కంపెనీ విక్రయాలు, పనిదినాలు, స్టాక్ ప్లాన్ వంటి స్వల్పకాలిక కారకాలపై ఆధారపడి ఉంటాయని చెప్పారు. ఫెస్టివ్ సీజన్లో డిమాండ్‌పై ఇవి ప్రతిబింబిస్తాయని వివరించారు. ఆల్టో, వాగన్ఆర్ వంటి మినీ సెగ్మెంట్ కార్లు విక్రయాలు 9.8 శాతం క్షీణించి, 37,595యూనిట్లగా నమోదైనట్టు ఎంఎస్ఐ ప్రకటనలో తెలిపింది. కాంపాక్ట్ సెగ్మెంట్ వాహనాలు సిప్ట్, ఎస్టిలో, రిట్జ్, డిజైర్, బాలెనో విక్రయాలు 1.8 శాతం పడిపోయినట్టు మారుతి వెల్లడించింది. వీటిలో ఎక్కువగా కాంపాక్ట్ సెడాన్ డిజైర్ విక్రయాలు పడిపోయి, 27.4 శాతం కిందకి దిగజారాయి. అక్టోబర్ నెలలో ఈ విక్రయాలు 2,481 యూనిట్లగా నమోదయ్యాయి. కాగ, మిడ్ సైజ్ సెడాన్ సియాజ్ 8 శాతం ఎగిసి, 6,360 యూనిట్లగా రికార్డయ్యాయి.