సాక్షి,ముంబై: మారుతి సుజుకి కొత్త వెర్షన్ ఎస్‌యూవీ బ్రెజాను గురువారం లాంచ్ చేసింది. కంపెనీ చరిత్రలో తొలిసారిగా బ్రెజా 2022 మోడల్‌లో 6 ఎయిర్‌బ్యాగ్‌లను అందిస్తోంది. అలాగే మొదటిసారిగా ప్యాడిల్ షిఫ్టర్లను కూడా జోడించింది.
మొత్తం 10 వేరియంట్‌లు, ఇందులో 7 మాన్యువల్ ట్రిమ్‌లుగా, 3 ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ వేరియంట్లు అందుబాటులో ఉంటాయి.మూడు డ్యూయల్-టోన్ షేడ్స్‌తో సహా బ్రెజా తొమ్మిది రంగుల్లో తీసుకొచ్చింది. కొత్త మారుతి సుజుకి బ్రెజా కొత్త గ్రిల్, హెడ్‌లైట్‌లు, టెయిల్ లైట్‌లతో సహా ఎక్ట్సీరియర్‌లో డిజైన్‌లో అనేక మార్పులను పొందింది.
1.5 లీటర్ పెట్రోల్ ఇంజన్, వైర్‌లెస్ ఛార్జింగ్ డాక్, ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, పరిసర లైటింగ్, హెడ్ అప్ డిస్‌ప్లేస్, 360 డిగ్రీ కెమెరా ఇతర ఫీచర్లుగా ఉన్నాయి. ప్రీ-బుకింగ్‌లను ప్రారంభించిన 8 రోజుల్లోనే 45 వేలకుపైగా ఆర్డర్‌లను సాధించినట్టు కంపెనీ వెల్లడించింది. భారతదేశంలో సరికొత్త మారుతి సుజుకి బ్రెజా రూ. 7.99 లక్షల ప్రారంభ ధర (ఎక్స్-షోరూమ్)గా, హై ఎండ్ మోడల్ ధర రూ. 13.96 లక్షలుగా కంపెనీ నిర్ణయించింది.
Comments
Please login to add a commentAdd a comment