కొత్తగా కారు కొనుగోలు చేయాలనుకునే వారికి ఇది మంచి అవకాశం. ప్రముఖ కార్ల తయారీ కంపెనీ మారుతి సుజుకీ ఇండియా తాజాగా తన కార్లపై అదిరిపోయే ఆఫర్ ప్రకటించింది. కారు కొనుగోలుపై భారీగా తగ్గింపు అందిస్తోంది. హోలీ పండగ సందర్భంగా భారీగా ఆఫర్ ఇస్తున్నట్లు ప్రకటించింది. దేశంలో అతిపెద్ద వాహన తయారీ సంస్థ అయిన మారుతీ పాపులర్ మోడల్స్ అన్నింటిపై భారీ డిస్కౌంట్లు, పండుగ ఆఫర్లు ప్రకటించింది. ఆల్టో, ఎస్-ప్రెసో, సెలెరియో, వేగన్ఆర్, స్విఫ్ట్, డిజైర్, బ్రెజా మోడల్స్‌పై ఈ డిస్కౌంట్లు లభించనున్నాయి. మహీంద్రా, టాటా వంటి ఇతర తయారీ కంపెనీలు కూడా తమ కార్లపై డిస్కౌంట్ అందిస్తున్నాయి.
మారుతి సుజుకి ఆల్టో
మారుతి ఆల్టో(ఎస్టిడి)పై రూ.5,000 నగదు డిస్కౌంట్, రూ.3,000 కార్పొరేట్ డిస్కౌంట్ అందుబాటులో ఉన్నాయి. మారుతి ఆల్టో అత్యంత పాకెట్ ఫ్రెండ్లీ కార్లలో ఒకటి. ధీని ధర రూ.3.25 లక్షలతో ప్రారంభమవుతుంది.
మారుతి సుజుకి సెలెరియో
మారుతి సుజుకి సెలెరియో మాన్యువల్ వేరియెంట్లపై రూ.10,000 నగదు డిస్కౌంట్, కార్పొరేట్ డిస్కౌంట్ రూ.3,000, ఎక్స్ఛేంజ్ బోనస్ రూ.10,000 లభిస్తుంది. ఇంకా హ్యాచ్ బ్యాక్ గురించి మాట్లాడీతే.. మారుతి సుజుకి ఎస్-ప్రెస్సోపై రూ.15,000 భారీ నగదు డిస్కౌంట్, రూ.10,000 ఎక్స్ఛేంజ్ బోనస్, రూ.3,000 కార్పొరేట్ డిస్కౌంట్ పొందవచ్చు.
మారుతి సుజుకి వ్యాగన్ ఆర్
మారుతి సుజుకి వ్యాగన్ఆర్ పై అతిపెద్ద డిస్కౌంట్ ఆఫర్ అందిస్తుంది. దీని మాన్యువల్ వేరియెంట్లు మార్చి 2022 వరకు 1.0-లీటర్ పెట్రోల్ వేరియెంట్లపై రూ.25,000, 1.2-లీటర్ పెట్రోల్ వేరియెంట్లపై రూ.20,000 నగదు డిస్కౌంట్ 'తో లభ్యం అవుతాయి. రూ.10,000 ఎక్స్ఛేంజ్ ఆఫర్, రూ.4,000 కార్పొరేట్ డిస్కౌంట్ అదనం.
మారుతి సుజుకి స్విఫ్ట్
మారుతి సుజుకి స్విఫ్ట్ పై డిస్కౌంట్ల విషయానికి వస్తే, ఇది ఎల్ఎక్స్ ఐ వేరియెంట్లపై రూ.10,000, విఎక్స్ఐ & జెడ్ఎక్స్ఐ వేరియెంట్లపై రూ.20,000 నగదు డిస్కౌంట్, 10,000 ఎక్స్ఛేంజ్ బెనిఫిట్, రూ.3,000 కార్పొరేట్ డిస్కౌంట్ లభిస్తుంది.
మారుతి సుజుకి డిజియర్
మారుతి సుజుకి డిజిర్ రూ.3,000 కార్పొరేట్ డిస్కౌంట్'తో పాటు క్యాష్ డిస్కౌంట్, ఎక్స్ఛేంజ్ బోనస్ కలిపి రూ.10,000 డిస్కౌంట్ అందిస్తుంది. ఈ డిస్కౌంట్ మాన్యువల్ వేరియెంట్ కార్ల కొరకు మాత్రమే అని గుర్తుంచుకోవాలి.
మారుతి సుజుకి వితారా బ్రెజ్జా
మారుతి సుజుకి వితారా బ్రెజ్జా కారుపై రూ.5,000 నగదు డిస్కౌంట్, రూ.10,000 ఎక్స్ఛేంజ్ ఆఫర్, రూ.3,000 కార్పొరేట్ డిస్కౌంట్ లభిస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment