Celerio
-
కొత్త కారు కొనేవారికి మారుతి సుజుకి బంపర్ ఆఫర్..!
కొత్తగా కారు కొనుగోలు చేయాలనుకునే వారికి ఇది మంచి అవకాశం. ప్రముఖ కార్ల తయారీ కంపెనీ మారుతి సుజుకీ ఇండియా తాజాగా తన కార్లపై అదిరిపోయే ఆఫర్ ప్రకటించింది. కారు కొనుగోలుపై భారీగా తగ్గింపు అందిస్తోంది. హోలీ పండగ సందర్భంగా భారీగా ఆఫర్ ఇస్తున్నట్లు ప్రకటించింది. దేశంలో అతిపెద్ద వాహన తయారీ సంస్థ అయిన మారుతీ పాపులర్ మోడల్స్ అన్నింటిపై భారీ డిస్కౌంట్లు, పండుగ ఆఫర్లు ప్రకటించింది. ఆల్టో, ఎస్-ప్రెసో, సెలెరియో, వేగన్ఆర్, స్విఫ్ట్, డిజైర్, బ్రెజా మోడల్స్‌పై ఈ డిస్కౌంట్లు లభించనున్నాయి. మహీంద్రా, టాటా వంటి ఇతర తయారీ కంపెనీలు కూడా తమ కార్లపై డిస్కౌంట్ అందిస్తున్నాయి. మారుతి సుజుకి ఆల్టో మారుతి ఆల్టో(ఎస్టిడి)పై రూ.5,000 నగదు డిస్కౌంట్, రూ.3,000 కార్పొరేట్ డిస్కౌంట్ అందుబాటులో ఉన్నాయి. మారుతి ఆల్టో అత్యంత పాకెట్ ఫ్రెండ్లీ కార్లలో ఒకటి. ధీని ధర రూ.3.25 లక్షలతో ప్రారంభమవుతుంది. మారుతి సుజుకి సెలెరియో మారుతి సుజుకి సెలెరియో మాన్యువల్ వేరియెంట్లపై రూ.10,000 నగదు డిస్కౌంట్, కార్పొరేట్ డిస్కౌంట్ రూ.3,000, ఎక్స్ఛేంజ్ బోనస్ రూ.10,000 లభిస్తుంది. ఇంకా హ్యాచ్ బ్యాక్ గురించి మాట్లాడీతే.. మారుతి సుజుకి ఎస్-ప్రెస్సోపై రూ.15,000 భారీ నగదు డిస్కౌంట్, రూ.10,000 ఎక్స్ఛేంజ్ బోనస్, రూ.3,000 కార్పొరేట్ డిస్కౌంట్ పొందవచ్చు. మారుతి సుజుకి వ్యాగన్ ఆర్ మారుతి సుజుకి వ్యాగన్ఆర్ పై అతిపెద్ద డిస్కౌంట్ ఆఫర్ అందిస్తుంది. దీని మాన్యువల్ వేరియెంట్లు మార్చి 2022 వరకు 1.0-లీటర్ పెట్రోల్ వేరియెంట్లపై రూ.25,000, 1.2-లీటర్ పెట్రోల్ వేరియెంట్లపై రూ.20,000 నగదు డిస్కౌంట్ 'తో లభ్యం అవుతాయి. రూ.10,000 ఎక్స్ఛేంజ్ ఆఫర్, రూ.4,000 కార్పొరేట్ డిస్కౌంట్ అదనం. మారుతి సుజుకి స్విఫ్ట్ మారుతి సుజుకి స్విఫ్ట్ పై డిస్కౌంట్ల విషయానికి వస్తే, ఇది ఎల్ఎక్స్ ఐ వేరియెంట్లపై రూ.10,000, విఎక్స్ఐ & జెడ్ఎక్స్ఐ వేరియెంట్లపై రూ.20,000 నగదు డిస్కౌంట్, 10,000 ఎక్స్ఛేంజ్ బెనిఫిట్, రూ.3,000 కార్పొరేట్ డిస్కౌంట్ లభిస్తుంది. మారుతి సుజుకి డిజియర్ మారుతి సుజుకి డిజిర్ రూ.3,000 కార్పొరేట్ డిస్కౌంట్'తో పాటు క్యాష్ డిస్కౌంట్, ఎక్స్ఛేంజ్ బోనస్ కలిపి రూ.10,000 డిస్కౌంట్ అందిస్తుంది. ఈ డిస్కౌంట్ మాన్యువల్ వేరియెంట్ కార్ల కొరకు మాత్రమే అని గుర్తుంచుకోవాలి. మారుతి సుజుకి వితారా బ్రెజ్జా మారుతి సుజుకి వితారా బ్రెజ్జా కారుపై రూ.5,000 నగదు డిస్కౌంట్, రూ.10,000 ఎక్స్ఛేంజ్ ఆఫర్, రూ.3,000 కార్పొరేట్ డిస్కౌంట్ లభిస్తుంది. (చదవండి: మదుపరులకు శుభవార్త.. ఎల్ఐసీ ఐపీఓకు సెబీ ఆమోదం..!) -
పెట్రోలు బాధల నుంచి ఉపశమనం.. మారుతి నుంచి సీఎన్జీ వేరియంట్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీ సంస్థ మారుతీ సుజుకీ సెలెరియో సీఎన్జీ వేరియంట్‌ను పరిచయం చేసింది. ధర ఢిల్లీ ఎక్స్‌షోరూంలో రూ.6.58 లక్షలు. ఎస్–సీఎన్జీ టెక్నాలజీతో కె–సిరీస్ 1.0 లీటర్ ఇంజన్ పొందుపరిచారు. మైలేజీ కేజీకి 35.6 కిలోమీటర్లు. ట్యాంక్ సామర్థ్యం 60 లీటర్లు. అంత క్రితం విడుదలైన సెలెరియో కార్లలో ఎస్–సీఎన్జీ వేరియంట్ యూనిట్ల వాటా 30 శాతముంది. మారుతి సుజుకీ ఖాతాలో 8 మోడళ్లకుగాను 9,50,000 యూనిట్ల ఎస్–సీఎన్జీ వాహనాలు ఇప్పటి వరకు అమ్ముడయ్యాయి. అయిదేళ్లలో సీఎన్జీ విక్రయాల్లో ఏటా 22 శాతం వృద్ధి సాధిస్తున్నట్టు మారుతి సుజుకీ సోమవారం తెలిపింది. -
ఎక్కువ మైలేజ్ ఇచ్చే మారుతి కారు.. ధర ఎంతో తెలుసా?
మారుతి సుజుకి ఇండియా ఎట్టకేలకు కొత్త తరం సెలెరియోను నేడు (నవంబర్ 10, 2021న) భారతదేశంలో విడుదల చేసింది. మారుతి సుజుకి కార్లలో ఎక్కువ మంది ఇష్టపడే బడ్జెట్ కార్లలో సెలెరియో ఒకటి. దీని కోసం వినియోగదారులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దీని ఎక్స్-షోరూమ్ ధర ₹4.99 లక్షల నుంచి ₹6.94 లక్షల మధ్య ఉంది. ఇది భారతదేశంలో ప్రారంభించిన రెండవ తరం సెలెరియో. దీని కోసం బుకింగ్ ఇప్పటికే ప్రారంభించింది, ఎవరైనా కంపెనీ అధికారిక వెబ్సైట్లో ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు. ఇది కాకుండా, మీ సమీప డీలర్‌షిప్‌లో రూ.11,000 టోకెన్ మొత్తాన్ని చెల్లించి కూడా బుక్ చేసుకోవచ్చు. ఈ కారు నాలుగు వేరియంట్లలో లభిస్తుంది. పవర్ ఫుల్ ఇంజన్ పెరుగుతున్న పెట్రోలు ధరలతో ప్రజలు అల్లాడిపోతున్న వేళ ఎక్కువ మైలేజ్ ఇచ్చే కారును మారుతి సుజుకి ఇండియా తీసుకొని వచ్చింది. కొత్త సెలెరియో కారు రికార్ఢు స్థాయిలో లీటరు పెట్రోలుకు 26 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుందంటూ సంచలన ప్రకటన చేసింది. ఇండియాలోనే అత్యధిక మైలేజీ ఇచ్చే పెట్రోలు కారు తమదేనంటూ ప్రకటించింది. ఈ కొత్త కారులో 1.0-లీటర్ డ్యూయల్ జెట్, డ్యూయల్ వీవీటీ కే10సీ పెట్రోలు ఇంజన్‌ను అమర్చారు. కొత్త-తరం మారుతి సుజుకి సెలెరియో సరికొత్త డిజైన్‌తో వస్తుంది. ఈ కారు కొత్త స్వెప్ట్-బ్యాక్ హెడ్‌ల్యాంప్‌లు, బ్లాక్ క్లాడింగ్, కొత్త ఫాగ్‌ల్యాంప్‌లతో కూడిన అగ్రెసివ్ ఫ్రంట్ బంపర్‌తో వస్తుంది. సెలెరియో రెండు కొత్త షేడ్స్‌తో సహా 6 రంగులలో లభిస్తుంది. క్యాబిన్ విషయానికొస్తే.. కొత్త-జెన్ సెలెరియోలో కొత్త ఆల్-బ్లాక్ ఇంటీరియర్, రీడిజైన్ చేసిన డ్యాష్‌బోర్డ్ ఉంది. ఈ కారులో ఆడియో, టెలిఫోనీ కోసం మౌంటెడ్ కంట్రోల్‌లతో కూడిన కొత్త త్రీ-స్పోక్ టిల్ట్-అడ్జస్టబుల్ స్టీరింగ్ వీల్, పెద్ద ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ అనలాగ్ స్పీడోమీటర్, డిజిటల్ రెవ్ కౌంటర్ ఉన్నాయి. ఈ కారు సిల్వర్ యాక్సెంట్లతో కూడిన కొత్త ఎయిర్ కాన్ వెంట్లు, మాన్యువల్ ఎయిర్ కాన్ సిస్టమ్, 12వీ ఛార్జర్ కోసం రెండు పోర్ట్‌లు ఉన్నాయి. మధ్యలో స్మార్ట్‌ఫోన్ నావిగేషన్‌తో కూడిన 7-అంగుళాల స్మార్ట్ ప్లే స్టూడియో ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్‌ని కలిగి ఉంది. City life, now more stylish than ever! Introducing the #AllNewCelerio#DriveYourStyle #MarutiSuzuki #MarutiSuzukiArena pic.twitter.com/J12gq9kg32 — Maruti Suzuki Arena (@MSArenaOfficial) November 10, 2021 ఆటో గేర్ షిఫ్ట్ ఫీచర్ భద్రత పరంగా, AGS/AMT వేరియంట్లతో కూడిన ఫస్ట్-ఇన్-సెగ్మెంట్ హిల్ హోల్డ్ అసిస్ట్ ఫంక్షన్‌తో సహా 12కి పైగా సేఫ్టీ ఫీచర్లతో ఈ కారు వస్తుందని మారుతి తెలిపింది. ఇతర ఫీచర్లు డ్యూయల్ ఎయిర్‌బ్యాగ్‌లు, EBDతో కూడిన ABS, ఫ్రంట్ సీట్-బెల్ట్ రిమైండర్, హై-స్పీడ్ అలర్ట్ వంటివి ఇందులో ఉన్నాయి. ఈ కారులో 66 బిహెచ్పీ పవర్, 89 ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేయగల ఇంజన్ ఉంది. ఇందులో 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో పాటు ఆటో గేర్ షిఫ్ట్ ఫీచర్ కూడా ఉంది. ఇది VXI AGS వేరియంట్ అత్యధికంగా 26.68 kmpl మైలేజ్ అందిస్తుంది. Zxi+MT వేరియంట్ 24.97 kmpl మైలేజ్ ఇస్తుందని కంపెనీ తెలిపింది. (చదవండి: రక్షణలో రారాజు మహీంద్రా ఎక్స్యూవి700) -
మారుతి మరో సంచలనం.. మార్కెట్లోకి అధిక మైలేజీ ఇచ్చే పెట్రోలు కారు
పెరుగుతున్న పెట్రోలు ధరలతో ప్రజలు అల్లాడిపోతున్న వేళ చల్లని కబురు చెప్పింది మారుతి సూజుకి ఇండియా. డీజిల్ కారుని మించి మైలేజీ అందించే కొత్త కారుని మార్కెట్లోకి తేబోతున్నట్టు ప్రకటించింది. ఎంట్రీ లెవల్ హచ్‌బ్యాక్ మోడల్‌గా ఉన్న సెలెరియో ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ని మార్కెట్లోకి తెచ్చేందుకు మారుతి రెడీ అయ్యింది. నవంబరు 10 నుంచి ఈ కొత్త సెలెరియో మోడల్ అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభం అవుతున్నాయి. రూ.11,000 చెల్లించి ఈ కారుని బుక్ చేసుకోవచ్చు. అయితే బుకింగ్స్‌కి ముందు అదిరిపోయే న్యూస్ చెప్పింది మారుతి. కొత్త సెలెరియో కారు రికార్ఢు స్థాయిలో లీటరు పెట్రోలుకు 26 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుందంటూ సంచలన ప్రకటన చేసింది. ఇండియాలోనే అత్యధిక మైలేజీ ఇచ్చే పెట్రోలు కారు తమదేనంటూ తేల్చి చెప్పింది. ఇప్పటి వరకు మారుతి స్విఫ్ట్, బాలెనో కార్లు 24 కి.మీల మైలేజీ ఇస్తున్నాయి. ప్రస్తుతం వీటినే అత్యధిక మైలేజీ ఇచ్చేవిగా పరిగణిస్తున్నాను. సెలెరియో వాటిని బీట్ చేయబోతుంది. సెలెరియో కారులో 1 లీటరు కే 10సీ డ్యూయల్ జెట్ వీవీటీ పెట్రోలు ఇంజన్‌ను అమర్చారు. ఆటోమేటిక్, మాన్యువల్ గేర్లలో ఈ కారు లభించనుంది. ఈ ఫేస్ లిఫ్ట్ వెర్షన్లో ఏడు వేరియంట్లు మార్కెట్లోకి రాబోతున్నాయి. టచ్ స్క్రీన్ ఇన్ఫోంటైన్మెంట్, యాపిల్ కార్ప్లే వంటి లేటెస్ట్ ఫీచర్లు కూడా ఉన్నాయి. సెలెరియా పెట్రోలు కారు ఎక్స్‌షోరూం కనిష్ట ధర రూ.4.50 లక్షల దగ్గర ప్రారంభం అవుతుండగా హైఎండ్ వేరియంట్ ధర రూ.6.00 లక్షలుగా ఉంది. కీలక సమయంలో మైలేజీ కారును మార్కెట్లోకి తెస్తూ హ్యుందాయ్ సాంట్రో, టాటా టియాగోలకు గట్టి సవాల్ విసిరింది మారుతి. -
సెలెరియోలో సరికొత్త టెక్నాలజీ.. బుకింగ్స్ ప్రారంభం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీ దిగ్గజం మారుతి సుజుకి.. ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ సెలెరియో కొత్త వర్షన్ ముందస్తు బుకింగ్స్ ప్రారంభించింది. వినియోగదార్లు రూ.11,000 చెల్లించి ఈ వాహనాన్ని బుక్ చేయవచ్చు. స్టార్ట్–స్టాప్ టెక్నాలజీతో తదుపరి తరం కె–సిరీస్ ఇంజన్ పొందుపరిచారు. ఆటో గేర్ షిఫ్ట్ టెక్నాలజీతో ఇప్పటికే ఈ కారు ఆదరణ చూరగొందని కంపెనీ తెలిపింది. భారత్‌లో అత్యంత ఇంధన సామర్థ్యం గల పెట్రోల్ కారుగా సెలెరియో నిలవనుందని మారుతి సుజుకి చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ సి.వి.రమణ్ తెలిపారు. -
పండుగ సెంటిమెంట్, కార్లను తెగకొనేస్తున్నారు
ముంబై: పండుగ సీజన్ సెంటిమెంట్ కలిసిరావడంతో ఆగస్టులో వాహన విక్రయాలు పెరిగాయి. మారుతీ సుజుకీ, హ్యుందాయ్, టాటా మోటార్స్, ఎంఅండ్ఎం,హోండా కంపెనీలు అమ్మకాల్లో స్థిరమైన వృద్ధిని కనబరిచాయి. చదవండి : ఫెస్టివల్ బొనాంజా ఆఫర్..సర్వీస్, ప్రాసెసింగ్ చార్జీల ఎత్తివేత మారుతీ సుజుకీ మొత్తం అమ్మకాలు ఐదు శాతం పెరిగి 1,30,699 యూనిట్లుగా నమోదయ్యాయి. గతేడాది ఇదే ఆగస్ట్‌లో 1,24,624 వాహనాలను విక్రయించింది. అయితే దేశీయ విక్రయాలు 6% తగ్గి 1,10,080 యూనిట్లకు పరిమితమైంది. అంతర్జాతీయంగా సెమికండెక్టర్ల కొరత ఉత్పత్తిపై ప్రతికూల ప్రభావాన్ని చూపిందని కంపెనీ తెలిపింది. ఇదే నెలలో హ్యుందాయ్ మోటార్ 12 శాతం వృద్ధిని సాధించి మొత్తం 59,068 వాహనాలను విక్రయించింది. గతేడాది ఆగస్టులో 35,420 యూనిట్లు అమ్మిన టాటా మోటార్స్.., ఈ ఆగస్టులో 53 శాతం వృద్ధిని సాధించి 54,190 వాహనాలను విక్రయించింది. మహీంద్రా అండ్ మహీంద్రా అమ్మకాలు 17 శాతం పెరిగి 15,973 యూనిట్లు అమ్ముడైనట్లు కంపెనీ ప్రకటించింది. థార్, ఎక్స్‌యూవీ 300, బోలెరో నియో, బొలెరో పిక్–అప్ కార్ల బుకింగ్స్ కలిసొచ్చాయని ఎంఅండ్ఎం కంపెనీ సీఈఓ విజయ్ నాక్రా తెలిపారు. కియా మోటార్స్ ఇండియా వాహన విక్రయాలు 55 శాతం వృద్ధిని సాధించి మొత్తం 16,750 యూనిట్ల అమ్మింది. గతేడాదిలో ఇదే నెలలో విక్రయాలు 10,845 యూనిట్లు. ‘‘ఆటో కంపెనీలు పండుగ సీజన్‌ను స్థిరమైన విక్రయాలతో ప్రారంభించాయి. రానున్న రోజుల్లో కస్టమర్ల నుంచి బుక్సింగ్ మరింత పెరగవచ్చు. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న సెమికండక్టర్ల కొరత ఉత్పత్తిపై ప్రభావాన్ని చూపుతున్న వేళ డిమాండ్‌కు తగ్గట్లు వాహనాలను అందుబాటులో ఉంచడం ఆటో పరిశ్రమకు సవాలుగా మారవచ్చు’’ అని నిస్సాన్ మోటార్ ఎండీ రాకేష్ శ్రీవాస్తవ తెలిపారు. -
విక్రయాల్లో మారుతీ మెరుపులు
న్యూఢిల్లీ : దేశీయ ప్యాసెంజర్ వాహన తయారీ సంస్థ మారుతీ సుజుకీ ఇండియా లిమిటెడ్ జూలై నెల అమ్మకాల్లో ఓ వెలుగు వెలిగింది. అమ్మకాల్లో 13.9శాతం దూసుకెళ్లి 1,25,778 యూనిట్లను రికార్డుచేసినట్టు గణాంకాల్లో పేర్కొంది. సియాజ్, బాలెనో, ఈకో, విటారా బ్రీజా వాహనాలు ఈ అమ్మకాల వృద్ధికి ఎక్కువగా దోహదం చేశాయని కంపెనీ తెలిపింది. ఇప్పటివరకూ అత్యధిక అమ్మకాలు నమోదుచేసిన నెలగా జూలైనే నిలిచినట్టు మారుతీ వెల్లడించింది. ప్రతి రెండు కార్లలో ఒకటి కచ్చితంగా అమ్ముడుపోయినట్టు తెలిపింది. 151.3శాతం స్ట్రాంగ్ యుటిలిటీ వెహికిల్ విక్రయాల్లో కొత్తగా లాంచ్ అయిన మారుతీ విటారా దూసుకెళ్లింది. ఎగుమతుల పరంగా చూసినా కంపెనీకి పాజిటివ్ వృద్ధే నమోదుచేసినట్టు వెల్లడించింది. గత కొన్ని నెలలుగా పడిపోయిన ఎగుమతులు 0.3 శాతం పెరిగి 11,38 యూనిట్లుగా రికార్డు అయ్యాయి. అయితే జూన్‌లో సుబ్రోస్ ప్లాంటులో నెలకొన్న అగ్రిప్రమాదం కారణంగా ఆ ప్లాంట్ ను తాత్కాలికంగా మూసివేయడంతో కంపెనీ తన వాల్యుమ్ వృద్ధి శాతంలో కొంత పడిపోయింది. మారుతీ చిన్న కార్లు ఆల్టో, వాగన్-ఆర్ లు అమ్మకాల్లో కొంత నిరాశపర్చాయి. అవి 7.2 శాతం పడిపోయి 354,051 యూనిట్లు మాత్రమే అమ్ముడుపోయాయి. రిట్జ్, బెలానో, స్విప్ట్, సెలెరియో, డిజైర్లు 4.1శాతం పెరిగి 50,362గా రికార్డు అయ్యాయి. జూలై నెలలో నమోదైన మారుతీ అమ్మక గణాంకాలతో ఆ కంపెనీ షేర్లు మార్నింగ్ ట్రేడింగ్‌లో రయ్ మని దూసుకెళ్లాయి. 2.10 శాతం పెరిగి, రూ.4,871 రికార్డు ధరను తాకాయి. -
టాప్‌టెన్‌లో ఆరు మారుతీ కార్లే..
న్యూఢిల్లీ: కార్ల విక్రయాల్లో మారుతీ సుజుకీ హవా పెరుగుతోంది. గత నెలలో అమ్ముడైన టాప్ టెన్ కార్లలో మారుతీ కంపెనీకి చెందిన ఆరు కార్లు చోటు సాధించాయి. గత ఏడాది ఇదే నెలలో టాప్‌టెన్‌లో నాలుగు మారుతీ కార్లే స్థానం సంపాదించాయి. అక్టోబర్‌లో అధికంగా అమ్ముడైన కారుగా మారుతీ సుజుకీ ఆల్టో నిలిచిందని సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫాక్చరర్స్ అసోసియేషన్(సియామ్) వెల్లడించింది. టాప్‌టెన్‌లో మొదటి నాలుగు స్థానాలు మారుతీ కార్లే నిలవడం విశేషం. మారుతీ సుజుకీ కొత్తగా మార్కెట్లోకి తెచ్చిన సియాజ్, సెలెరియా కార్లు కూడా టాప్‌టెన్ జాబితాలో ఉన్నాయి.