Dzire
-
వచ్చేసింది కొత్త మారుతి డిజైర్: ధర రూ.6.79 లక్షలు మాత్రమే..
మారుతి సుజుకి ఎట్టకేలకు తన నాల్గవ తరం 'డిజైర్' కారును భారతీయ మార్కెట్లో అధికారికంగా లాంచ్ చేసింది. కంపెనీ ఈ కారును నాలుగు ట్రిమ్‌లలో రూ.6.79 లక్షల (ఎక్స్ షోరూమ్, ఢిల్లీ) ప్రారంభ ధర వద్ద లాంచ్ చేసింది. ఇప్పటికే సంస్థ ఈ సెడాన్ కోసం రూ.11,000 టోకెన్ మొత్తంతో బుకింగ్స్ స్వీకరించడం కూడా స్టార్ట్ చేసింది.2024 డిజైర్.. ఇప్పటికే మార్కెట్లో అమ్మకానికి ఉన్న ఇతర మారుతి కార్ల కంటే కూడా భిన్నంగా ఉంటుంది. ఇది హ్యుందాయ్ ఆరా, టాటా టిగోర్, హోండా అమేజ్ వంటి వాటికి ప్రధాన ప్రత్యర్థిగా ఉంటుంది. కాగా ఇప్పటికే మారుతి డిజైర్ గ్లోబల్ ఎన్సీఏపీ క్రాష్ టెస్టులో 5 స్టార్ రేటింగ్ సాధించి అత్యంత సురక్షితమైన కారుగా రికార్డ్ సృష్టించింది.ఇదీ చదవండి: లాంచ్‌కు ముందే డిజైర్ ఘనత: సేఫ్టీలో సరికొత్త రికార్డ్కొత్త డిజైన్ కలిగి, అప్డేటెడ్ ఫీచర్స్ పొందిన ఈ మారుతి డిజైర్ కారు సింగిల్ పేన్ సన్‌రూఫ్ వంటి వాటిని కూడా పొందుతుంది. ఇది 1.2 లీటర్ 3 సిలిండర్ పెట్రోల్ ఇంజిన్ ద్వారా ఇది 82 హార్స్ పవర్, 112 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ 5 స్పీడ్ మాన్యువల్ లేదా ఆటోమాటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్స్ పొందుతుంది. -
2024 మారుతి డిజైర్: స్ట్రాంగ్ హైబ్రిడ్ ఇంజన్‌తో, అతి తక్కువ ధరలో!
సాక్షి, ముంబై: మారుతి సుజుకి తన పాపులర్మోడల్ కారు నెక్ట్స్ జెనరేషన్ మారుతి డిజైర్ సరికొత్త హైబ్రిడ్ ఇంజీన్‌తో లాంచ్ చేయనుంది. తాజాగా నివేదికల ప్రకారం కొత్త డిజైన్, కొత్త అప్డేట్స్తో 2024 మారుతి సుజుకి డిజైర్‌ను లాంచ్ చేయనుంది. హైబ్రిడ్ పెట్రోల్ ఇంజన్‌తో లాంచ్ చేయనున్న బ్రాండ్ లైనప్‌లో డిజైర్ మొదటి కాంపాక్ట్ సెడాన్ కానుంది. 2024 ప్రథమార్థంలో భారత మార్కెట్లో కొత్త డిజైర్‌ను విడుదల చేయాలని భావిస్తోంది కంపెనీ. రానున్న న్యూజెన్ డిజైర్ కాంపాక్ట్ సెడాన్ భారతీయ మార్కెట్లో అత్యంత ఇంధన-సమర్థవంతమైన కార్లలో ఒకటిగా ఉంటుందని ఆటో వర్గాలు భావిస్తున్నాయి. ఇది హోండా అమేజ్, హ్యుందాయ్ ఆరా వంటి కార్లకు గట్టిపోటీగా మార్కట్లోకి ప్రవేశించనుంది. ఈ హైబ్రిడ్ పవర్‌ట్రెయిన్ లీటరుకు 35కి.మీకంటే ఎక్కువ ఇంధన సామర్థ్యంతో దేశంలో అతి తక్కువ ఖరీదుతో బలమైన-హైబ్రిడ్ వాహనం డిజైర్ కానుందని అంచనా. మూడు ఇంజీన్ వేరియంట్లు 2024 డిజైర్ మూడు ఇంజన్ ఎంపికలతో లాంచ్ కానుంది. 1.2L NA పెట్రోల్ ఇంజీన్, 1.2L స్ట్రాంగ్ హైబ్రిడ్ పెట్రోల్ ఇంజీన్ , 1.2 లీటర్ల సీఎన్జీ (Z12E)ఇంజీన్ ఉన్నాయి. ఫీచర్లు ఎక్స్టీరియర్గా పునర్నిర్మించిన ఫ్రంట్ ఫాసియాతో పాటు, రీడిజైన్ చేయబడిన ఫ్రంట్ బంపర్, భారీ ఫ్రంట్ గ్రిల్, ప్రొజెక్టర్ LED హెడ్లైట్లు, LED టెయిల్ లైట్లు, మెషిన్-కట్ అల్లాయ్ వీల్స్ ఇతర ఫీచర్లు ప్రధానంగా ఉండనున్నాయి. అలాగే సౌకర్యవంతమైన క్యాబిన్, బిగ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, సెమీ-డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ కన్సోల్, హెడ్స్-అప్ డిస్ప్లే, స్టీరింగ్-మౌంటెడ్ కంట్రోల్స్, పుష్-బటన్ స్టార్ట్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ అండ్ కూల్డ్ స్టోరేజ్ కన్సోల్ ప్రధానంగా ఉండనున్నాయి.మొబైల్ కనెక్టివిటీ ఫీచర్లతో పాటు సరికొత్త సుజుకి కనెక్ట్ టెక్నాలజీని కూడా ఇందులో పొందుపర్చనుంది. మారుతి అరేనా డీలర్‌షిప్‌ల ద్వారా అందుబాటులోకి రానున్న ఈ కారు ప్రస్తుత మోడల్ పోలిస్తే రూ. 80వేలు లేదా రూ. 1 లక్ష ఎఎక్కువ ధరనిర్ణయించవచ్చని భావిస్తున్నారు. మారుతి డిజైర్ బేస్ మోడల్ ధర రూ. 6.44 లక్షలు -
మారుతి బంపర్ ఆఫర్స్: అన్ని మోడల్స్‌పై ఫెస్టివ్ డిస్కౌంట్స్
సాక్షి, ముంబై: దేశీయ టాప్ వాహన తయారీ సంస్థ మారుతి సుజుకి తన కస్టమర్ల కోసం భారీ ఫెస్టివ్ ఆఫర్లను అందిస్తోంది. సీఎన్జీ మోడల్ సహా, పలు కార్ల మోడళ్లపై సుమారు రూ. 56,000 వరకు తగ్గింపును అందిస్తోంది. అరేనా షోరూమ్‌లు ఈ (అక్టోబర్) నెలలో తగ్గింపు ధరలకు అందుబాటులో ఉంటాయి. ఇందులో కార్పొరేట్, క్యాస్, ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా ఉన్నాయి. ముఖ్యంగా మారుతీ సుజుకి ఆల్టో 800, స్విఫ్ట్ ,వ్యాగన్-ఆర్, సెలెరియో, డిజైర్ సహా పలు కార్లు ఇపుడు తగ్గింపు ధరల్లో లభ్యం. మారుతి సుజుకి డిజైర్ మారుతి సుజుకి ఏఎంటీ వెర్షన్లపై రూ. 52,000 దాకా తగ్గింపు అందిస్తోంది. ఇందులో రూ. 35,000 నగదు తగ్గింపు, రూ. 7,000 కార్పొరేట్ డిస్కౌంట్లు రూ. 10,000 ఎక్స్చేంజ్ బోనస్‌లు ఉన్నాయి. అలాగే మాన్యువల్ ట్రాన్స్మిషన్ మోడల్ కార్లపై రూ. 17,000 తగ్గింపు లభ్యం. మారుతీ సుజుకి S-ప్రెస్సో రూ. 35,000 నగదు తగ్గింపు. రూ. 6,000 కార్పొరేట్, రూ. 15,000 ఎక్స్చేంజ్ ప్రోత్సాహకాలున్నాయి. మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో S Presso హై-రైడింగ్ హ్యాచ్‌బ్యాక్‌కు మొత్తం తగ్గింపును రూ. 56,000కి తగ్గింపు లభిస్తుంది. అలాగే S ప్రెస్సో AMT మోడల్లకు మొత్తం రూ. 46వేలు డిస్కౌంట్ లభ్యం. మారుతీ సుజుకి స్విఫ్ట్ అక్టోబర్ నెలలో, మారుతి సుజుకి స్విఫ్ట్ యొక్క ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ (AMT) వెర్షన్లు రూ. 47,000 మొత్తం ప్రయోజనాలకు అర్హమైనవి, స్విఫ్ట్ యొక్క మాన్యువల్ ట్రాన్స్మిషన్ వేరియంట్లు రూ. 30,000 విలువైన మొత్తం ప్రయోజనాలకు అర్హులు. ఆల్టో 800కి మొత్తం రూ. 36,000 తగ్గింపు ఉంటుంది. మారుతి సుజుకి వ్యాగన్-ఆర్ మారుతి సుజుకి డ్యూయల్‌జెట్ టెక్నాలజీతో వచ్చిన రెండు ఎకనామిక్ పెట్రోల్ కార్ల (1.0 ,1.2 లీటర్లు) వ్యాగన్ ఆర్ కొనుగోలుదారులు మాన్యువల్ లేదా ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ మోడల్‌లలో రూ. 31,000 ఆదా చేయవచ్చు. అదనంగా, మారుతీ రూ. 15,000 ధర తగ్గింపును కూడా అందిస్తోంది. సీఎన్జీ బేస్ మోడల్, టాప్-టైర్ వేరియంట్‌పై రూ. 5000 తగ్గింపు. మారుతి సుజుకి ఆల్టో K10 కొత్తగా విడుదల చేసిన ఆల్టో కె10 బడ్జెట్ హ్యాచ్‌బ్యాక్ ఆటోమేటిక్ మరియు మాన్యువల్ వెర్షన్లపై రూ.39,500 తగ్గింపును అందిస్తోంది. ఇందులో రూ. 17,500 విలువైన రూ. 7,000 నగదు తగ్గింపు , రూ. 15,000 విలువైన ఎక్స్ఛేంజ్ బోనస్, కార్పొరేట్ రివార్డు ఉన్నాయి. -
కొత్త కారు కొనేవారికి మారుతి సుజుకి బంపర్ ఆఫర్..!
కొత్తగా కారు కొనుగోలు చేయాలనుకునే వారికి ఇది మంచి అవకాశం. ప్రముఖ కార్ల తయారీ కంపెనీ మారుతి సుజుకీ ఇండియా తాజాగా తన కార్లపై అదిరిపోయే ఆఫర్ ప్రకటించింది. కారు కొనుగోలుపై భారీగా తగ్గింపు అందిస్తోంది. హోలీ పండగ సందర్భంగా భారీగా ఆఫర్ ఇస్తున్నట్లు ప్రకటించింది. దేశంలో అతిపెద్ద వాహన తయారీ సంస్థ అయిన మారుతీ పాపులర్ మోడల్స్ అన్నింటిపై భారీ డిస్కౌంట్లు, పండుగ ఆఫర్లు ప్రకటించింది. ఆల్టో, ఎస్-ప్రెసో, సెలెరియో, వేగన్ఆర్, స్విఫ్ట్, డిజైర్, బ్రెజా మోడల్స్‌పై ఈ డిస్కౌంట్లు లభించనున్నాయి. మహీంద్రా, టాటా వంటి ఇతర తయారీ కంపెనీలు కూడా తమ కార్లపై డిస్కౌంట్ అందిస్తున్నాయి. మారుతి సుజుకి ఆల్టో మారుతి ఆల్టో(ఎస్టిడి)పై రూ.5,000 నగదు డిస్కౌంట్, రూ.3,000 కార్పొరేట్ డిస్కౌంట్ అందుబాటులో ఉన్నాయి. మారుతి ఆల్టో అత్యంత పాకెట్ ఫ్రెండ్లీ కార్లలో ఒకటి. ధీని ధర రూ.3.25 లక్షలతో ప్రారంభమవుతుంది. మారుతి సుజుకి సెలెరియో మారుతి సుజుకి సెలెరియో మాన్యువల్ వేరియెంట్లపై రూ.10,000 నగదు డిస్కౌంట్, కార్పొరేట్ డిస్కౌంట్ రూ.3,000, ఎక్స్ఛేంజ్ బోనస్ రూ.10,000 లభిస్తుంది. ఇంకా హ్యాచ్ బ్యాక్ గురించి మాట్లాడీతే.. మారుతి సుజుకి ఎస్-ప్రెస్సోపై రూ.15,000 భారీ నగదు డిస్కౌంట్, రూ.10,000 ఎక్స్ఛేంజ్ బోనస్, రూ.3,000 కార్పొరేట్ డిస్కౌంట్ పొందవచ్చు. మారుతి సుజుకి వ్యాగన్ ఆర్ మారుతి సుజుకి వ్యాగన్ఆర్ పై అతిపెద్ద డిస్కౌంట్ ఆఫర్ అందిస్తుంది. దీని మాన్యువల్ వేరియెంట్లు మార్చి 2022 వరకు 1.0-లీటర్ పెట్రోల్ వేరియెంట్లపై రూ.25,000, 1.2-లీటర్ పెట్రోల్ వేరియెంట్లపై రూ.20,000 నగదు డిస్కౌంట్ 'తో లభ్యం అవుతాయి. రూ.10,000 ఎక్స్ఛేంజ్ ఆఫర్, రూ.4,000 కార్పొరేట్ డిస్కౌంట్ అదనం. మారుతి సుజుకి స్విఫ్ట్ మారుతి సుజుకి స్విఫ్ట్ పై డిస్కౌంట్ల విషయానికి వస్తే, ఇది ఎల్ఎక్స్ ఐ వేరియెంట్లపై రూ.10,000, విఎక్స్ఐ & జెడ్ఎక్స్ఐ వేరియెంట్లపై రూ.20,000 నగదు డిస్కౌంట్, 10,000 ఎక్స్ఛేంజ్ బెనిఫిట్, రూ.3,000 కార్పొరేట్ డిస్కౌంట్ లభిస్తుంది. మారుతి సుజుకి డిజియర్ మారుతి సుజుకి డిజిర్ రూ.3,000 కార్పొరేట్ డిస్కౌంట్'తో పాటు క్యాష్ డిస్కౌంట్, ఎక్స్ఛేంజ్ బోనస్ కలిపి రూ.10,000 డిస్కౌంట్ అందిస్తుంది. ఈ డిస్కౌంట్ మాన్యువల్ వేరియెంట్ కార్ల కొరకు మాత్రమే అని గుర్తుంచుకోవాలి. మారుతి సుజుకి వితారా బ్రెజ్జా మారుతి సుజుకి వితారా బ్రెజ్జా కారుపై రూ.5,000 నగదు డిస్కౌంట్, రూ.10,000 ఎక్స్ఛేంజ్ ఆఫర్, రూ.3,000 కార్పొరేట్ డిస్కౌంట్ లభిస్తుంది. (చదవండి: మదుపరులకు శుభవార్త.. ఎల్ఐసీ ఐపీఓకు సెబీ ఆమోదం..!) -
పండుగ సెంటిమెంట్, కార్లను తెగకొనేస్తున్నారు
ముంబై: పండుగ సీజన్ సెంటిమెంట్ కలిసిరావడంతో ఆగస్టులో వాహన విక్రయాలు పెరిగాయి. మారుతీ సుజుకీ, హ్యుందాయ్, టాటా మోటార్స్, ఎంఅండ్ఎం,హోండా కంపెనీలు అమ్మకాల్లో స్థిరమైన వృద్ధిని కనబరిచాయి. చదవండి : ఫెస్టివల్ బొనాంజా ఆఫర్..సర్వీస్, ప్రాసెసింగ్ చార్జీల ఎత్తివేత మారుతీ సుజుకీ మొత్తం అమ్మకాలు ఐదు శాతం పెరిగి 1,30,699 యూనిట్లుగా నమోదయ్యాయి. గతేడాది ఇదే ఆగస్ట్‌లో 1,24,624 వాహనాలను విక్రయించింది. అయితే దేశీయ విక్రయాలు 6% తగ్గి 1,10,080 యూనిట్లకు పరిమితమైంది. అంతర్జాతీయంగా సెమికండెక్టర్ల కొరత ఉత్పత్తిపై ప్రతికూల ప్రభావాన్ని చూపిందని కంపెనీ తెలిపింది. ఇదే నెలలో హ్యుందాయ్ మోటార్ 12 శాతం వృద్ధిని సాధించి మొత్తం 59,068 వాహనాలను విక్రయించింది. గతేడాది ఆగస్టులో 35,420 యూనిట్లు అమ్మిన టాటా మోటార్స్.., ఈ ఆగస్టులో 53 శాతం వృద్ధిని సాధించి 54,190 వాహనాలను విక్రయించింది. మహీంద్రా అండ్ మహీంద్రా అమ్మకాలు 17 శాతం పెరిగి 15,973 యూనిట్లు అమ్ముడైనట్లు కంపెనీ ప్రకటించింది. థార్, ఎక్స్‌యూవీ 300, బోలెరో నియో, బొలెరో పిక్–అప్ కార్ల బుకింగ్స్ కలిసొచ్చాయని ఎంఅండ్ఎం కంపెనీ సీఈఓ విజయ్ నాక్రా తెలిపారు. కియా మోటార్స్ ఇండియా వాహన విక్రయాలు 55 శాతం వృద్ధిని సాధించి మొత్తం 16,750 యూనిట్ల అమ్మింది. గతేడాదిలో ఇదే నెలలో విక్రయాలు 10,845 యూనిట్లు. ‘‘ఆటో కంపెనీలు పండుగ సీజన్‌ను స్థిరమైన విక్రయాలతో ప్రారంభించాయి. రానున్న రోజుల్లో కస్టమర్ల నుంచి బుక్సింగ్ మరింత పెరగవచ్చు. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న సెమికండక్టర్ల కొరత ఉత్పత్తిపై ప్రభావాన్ని చూపుతున్న వేళ డిమాండ్‌కు తగ్గట్లు వాహనాలను అందుబాటులో ఉంచడం ఆటో పరిశ్రమకు సవాలుగా మారవచ్చు’’ అని నిస్సాన్ మోటార్ ఎండీ రాకేష్ శ్రీవాస్తవ తెలిపారు. -
పెరిగిన మారుతీ ‘డిజైర్’ ధర
న్యూఢిల్లీ: మారుతీ సుజుకి ఇండియా తన పాపులర్ కాంపాక్ట్ సెడాన్ డిజైర్ కారు ధరను రూ.12,690 మేర పెంచినట్లు ప్రకటించింది. ఈ పెంపు గురువారం నుంచే అమల్లోకి వచ్చింది. నూతన భద్రతా ప్రమాణాలు, ఉద్గార నిబంధనలకు అనుగుణంగా ఈ కారును రూపొందించాల్సి రావడం వల్ల పెంపు నిర్ణయం తీసుకున్నట్లు వివరించింది. పెట్రోల్, డీజిల్ వెర్షన్లలో ఏఐఎస్–145 భద్రతా ప్రమాణాలను పాటిస్తున్నట్లు నియంత్రణ సంస్థలకు ఇచ్చిన సమాచారంలో తెలిపింది. నూతన ధరల అమలు తరువాత ఢిల్లీ–ఎన్సీఆర్లో ఈ కారు ధరల శ్రేణి రూ.5,82,613–రూ.9,57,622 కాగా, అంతక్రితం రూ.5,69,923 నుంచి రూ.9,54,522 శ్రేణిలో ఉంది. -
కొత్త డిజైర్, స్విప్ట్ కార్ల రీకాల్
సాక్షి, న్యూఢిల్లీ: ఆటోదిగ్గజం మారుతి సుజుకి దేశంలో భారీ ఎత్తున కార్లను రీకాల్ చేస్తోంది. ఎయిర్ బాగ్స్‌లో లోపాల కారణంగా కొత్త జనరేషన్ స్విఫ్ట్, డిజైర్ కార్లను వెనక్కి తీసుకుంటోంది. ఈ మేరకు మారుతి ఒక ప్రకటన విడుదల చేసింది. మే 7నుంచి జులై 5, 2018 మధ్య ఉత్పత్తి అయిన మొత్తం 1279 కార్లను పరీక్షిస్తున్నట్టు తెలిపింది. 2018, జులై 25నుంచి ఈ రీకాల్ ప్రారంభమవుతుందని ప్రకటించాంది. మారుతి సుజుకి దేశంలో కొత్త తరం స్విఫ్ట్ , డిజైర్ మోడళ్ల కార్లలో లోపాలను తనిఖీ చేయడానికి ఈ రీకాల్ చేపట్టినట్టు కంపెనీ తెలిపింది. 566 స్విఫ్ట్ , 713 డిజైర్ కార్లను వెనక్కి తీసుకుంటోంది. సంబంధిత వాహన యజమానులను మారుతి సుజుకి డీలర్లు సంప్రదించనున్నారని తెలిపింది. వారికి ఉచితంగా ఆయా భాగాలను ఉచితంగా అందిస్తామని వెల్లడించింది. అలాగే అధికారిక మారుతి సుజుకి వెబ్సైట్లో చెక్ చేసుకోవాలని కార్ల యజమానులను కంపెనీ కోరింది. -
ఆ కార్ల కోసం లక్షకుపైగా వెయిటింగ్
మార్కెట్లో దేశీయ అతిపెద్ద కార్ల దిగ్గజం మారుతీ సుజుకీ కార్లకు ఉన్న పాపులారిటీ తెలిసిందే. రోడ్లపై చక్కర్లు కొట్టే వాహనాల్లో సగానికి పైగా ఈ కంపెనీవే. రోజురోజుకి ఈ సంస్థ కార్లకు డిమాండ్ పెరగడమే కానీ, తగ్గడం మాత్రం ఉండదు. తాజాగా స్విఫ్ట్, బాలెనో, డిజైర్, విటారా బ్రిజా కార్ల కోసం లక్షకు పైగా కస్టమర్లు వేచిచూస్తున్నట్టు తెలిసింది. ఈ నాలుగు కార్లు కలిపి 1,10,00 యూనిట్ల పెండింగ్ ఆర్డర్లను కలిగి ఉన్నాయని రిపోర్టులు పేర్కొన్నాయి. మనీకంట్రోల్ రిపోర్టు ప్రకారం కంపెనీకి చెందిన గుజరాత్ ప్లాంట్‌లో ఉత్పత్తిని పెంచి, ఈ ప్రొడక్ట్‌ల వెయిటింగ్ కాలాన్ని తగ్గించాలని మారుతీ సుజుకీ ప్లాన్ చేస్తోందని తెలిసింది. కొత్త మారుతీ స్విఫ్ట్‌ను కంపెనీ ఈ ఏడాది ఫిబ్రవరిలో లాంచ్ చేసింది. లాంచ్ అయిన వెంటనే ఈ కారు టాప్-సెల్లింగ్ కార్ల జాబితాలో చోటు దక్కించుకుంది. లాంచ్ అయిన రెండు నెలల్లోనే స్విఫ్ట్‌కు దాదాపు లక్ష బుకింగ్స్ నమోదైనట్టు తెలిసింది. మరోవైపు ఏడాది క్రితం లాంచ్ అయిన మారుతీ డిజైర్‌కు కూడా అంతే డిమాండ్ వస్తోంది. లాంచ్ అయిన ఐదు నెలల లోపే ఈ కారు కూడా లక్ష యూనిట్ల విక్రయాలను నమోదు చేసింది. ఈ సెడాన్ గతేడాది టాప్ సెల్లింగ్ కార్ల జాబితాలో రెండో స్థానాన్ని దక్కించుకుంది. 2018 ఏప్రిల్ చివరి నాటికి మారుతీకి 1.72 లక్షల యూనిట్ల విక్రయాలు నమోదు కాగ, హ్యుందాయ్ ఇండియాకు 59,744 యూనిట్ల విక్రయాలు నమోదయ్యాయని తెలిసింది. ఈ గణాంకాలు బట్టి మారుతీ సుజుకీ ఉత్పత్తులకు భారత్‌లో ఎంత క్రేజ్ ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం గుజరాత్ ప్లాంట్‌లో ఉత్పత్తి సామర్థ్యాన్ని 2.5 లక్షల యూనిట్లకు పెంచాలని మారుతీ చూస్తోంది. ఈ ప్లాంట్‌కు మరో రెండు లైన్లను కూడా జత చేయాలనుకుంటోంది. మొత్తంగా 2020 నాటికి 7.5 లక్షల యూనిట్ల కెపాసిటీని మారుతీ పెంచబోతోంది. -
1492 యూనిట్లకు మారుతి రీకాల్
దేశంలోనే అతిపెద్ద కార్ల ఉత్పత్తి సంస్థ మారుతి సుజుకి 1492 యూనిట్ల మారుతి ఎర్టిగా, స్విఫ్ట్, డిజైర్, ఏ స్టార్ మోడల్స్ ను రీకాల్ చేయనున్నట్టు ఓ ప్రకటనలో తెలిపింది. స్టీరింగ్ కాలమ్ లో ఉన్న సమస్యలను పరిష్కరించుకున్న మారుతి ఎర్టిగా, స్విఫ్ట్, డిజైర్, ఏ స్టార్ మోడల్స్ యూనిట్లలో మళ్లీ ఉత్పత్తి చేపట్టేందుకు సిద్ధమవుతోంది. 1492 వాహనాల్లో తలెత్తిన సమస్యను క్షుణ్టంగా కంపెనీ పరిశీలిస్తోందన్నారు. ఎర్టిగా 306 యూనిట్లు, స్విఫ్ట్ 592, డిజైర్ 581, ఏ స్టార్ 13 యూనిట్లను 2013 అక్టోబర్ 19 నుంచి 26 అక్టోబర్ వరకు ఉత్పత్తి చేసింది. 1492 వాహనాల్లో స్టీరింగ్ కాలమ్స్ లో తలెత్తిన సమస్యలకు కంపెనీ ఉచితంగా సేవలందింస్తుందని సంస్థ కు చెందిన నిర్వాహకులు తెలిపారు. కొత్త గా తయారు చేసిన స్టీరింగ్ కాలమ్స్ ను డీలర్ వర్క్ షాప్ లకు పంపామని మారుతి సంస్థ తెలిపింది. 2010 ఫిబ్రవరిలో కూడా 'ఏ స్టార్' కారులో ఫ్యూయల్ పంప్ పార్ట్ లో సమస్యలు తలెత్తడంతో పెద్ద ఎత్తున రీకాల్ చేసింది. కార్ల ఉత్పత్తిలో వినియోగదారుల ప్రయోజనాలకు ఇబ్బంది ఉంటే వాలంటరీ రీకాల్ చేయాలని గత జూలైలో ఆటో మోబైల్ కంపెనీల చెందిన సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మానుఫ్యాక్చర్స్ సూచించించి. దాంతో మూడు లక్షలకు పైగా కార్లను కంపెనీలు రీకాల్ చేశాయి. ఇంజన్ లో సమస్యలు తలెత్తడంతో సెయిల్ మోడల్ కు చెందిన నాలుగు వేల డీజీల్ వేరియెంట్ కార్లను గతంలో మారుతి రీకాల్ చేసింది.