దేశంలోని అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి ఇండియా.. ఇటీవల మార్కెట్లో విడుదల చేసిన 4వ తరం డిజైర్ కోసం రోజుకు 1,000 బుకింగ్స్ పొందుతోంది. ఇందులో సగం కంటే ఎక్కువ మంది కస్టమర్లు మొదటి రెండు వేరియంట్లను ఎంచుకుంటున్నట్లు సమాచారం.
నవంబర్ 11న డిజైర్ బుకింగ్స్ ప్రారంభించిన మారుతి సుజుకి.. మొత్తం 30వేల కంటే ఎక్కువ బుకింగ్స్ పొందినట్లు సమాచారం. కాగా సంస్థ 5000 మందికి ఈ కొత్త కారును డెలివరీ చేసింది.
LXi, VXi, ZXi & ZXi+ అనే నాలుగు వేరియంట్లలో లభించే మారుతి సుజుకి డిజైర్ ధరలు రూ. 6.79 లక్షల నుంచి రూ. 10.14 లక్షల మధ్య ఉన్నాయి. ఎక్కువమంది జెడ్ఎక్స్ఐ, జెడ్ఎక్స్ఐ ప్లస్ కార్లను బుక్ చేసుకుంటున్నట్లు సమాచారం. డిజైర్ కాంపాక్ట్ సెడాన్ సెగ్మెంట్‌లో 61% వాటాను కలిగి ఉంది.
అమ్మకాల్లో హోండా అమేజ్, హ్యుందాయ్ ఆరా, టాటా టిగోర్ వంటి వాటికి ప్రత్యర్థిగా ఉన్న మారుతి డిజైర్ 1.2 లీటర్ 3 సిలిండర్ పెట్రోల్ ఇంజిన్ పొందుతుంది. పనితీరు పరంగా కూడా ఇది ఉత్తమంగా ఉంటుంది.
2024 డిజైర్ ఎల్ఈడీ డీఆర్ఎల్, ఎల్ఈడీ క్రిస్టల్ విజన్ హెడ్‌ల్యాంప్, ఎల్ఈడీ రియర్ కాంబినేషన్ ల్యాంప్స్, 15 ఇంచెస్ అల్లాయ్ వీల్స్, షార్క్ ఫిన్ యాంటెన్నా, 9 ఇంచెస్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 360 డిగ్రీ కెమెరా, ఆటోమేటిక్ ఏసీ, క్రూయిజ్ కంట్రోల్స్, ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, రియర్ ఏసీ వెంట్స్, రియర్ ఆర్మ్‌రెస్ట్, సుజుకి కనెక్ట్ వంటి అనేక ఫీచర్స్ పొందుతుంది.
Comments
Please login to add a commentAdd a comment