మారుతి సుజుకి ఎట్టకేలకు తన నాల్గవ తరం 'డిజైర్' కారును భారతీయ మార్కెట్లో అధికారికంగా లాంచ్ చేసింది. కంపెనీ ఈ కారును నాలుగు ట్రిమ్‌లలో రూ.6.79 లక్షల (ఎక్స్ షోరూమ్, ఢిల్లీ) ప్రారంభ ధర వద్ద లాంచ్ చేసింది. ఇప్పటికే సంస్థ ఈ సెడాన్ కోసం రూ.11,000 టోకెన్ మొత్తంతో బుకింగ్స్ స్వీకరించడం కూడా స్టార్ట్ చేసింది.
2024 డిజైర్.. ఇప్పటికే మార్కెట్లో అమ్మకానికి ఉన్న ఇతర మారుతి కార్ల కంటే కూడా భిన్నంగా ఉంటుంది. ఇది హ్యుందాయ్ ఆరా, టాటా టిగోర్, హోండా అమేజ్ వంటి వాటికి ప్రధాన ప్రత్యర్థిగా ఉంటుంది. కాగా ఇప్పటికే మారుతి డిజైర్ గ్లోబల్ ఎన్‌సీఏపీ క్రాష్ టెస్టులో 5 స్టార్ రేటింగ్ సాధించి అత్యంత సురక్షితమైన కారుగా రికార్డ్ సృష్టించింది.
ఇదీ చదవండి: లాంచ్‌కు ముందే డిజైర్ ఘనత: సేఫ్టీలో సరికొత్త రికార్డ్
కొత్త డిజైన్ కలిగి, అప్డేటెడ్ ఫీచర్స్ పొందిన ఈ మారుతి డిజైర్ కారు సింగిల్ పేన్ సన్‌రూఫ్ వంటి వాటిని కూడా పొందుతుంది. ఇది 1.2 లీటర్ 3 సిలిండర్ పెట్రోల్ ఇంజిన్ ద్వారా ఇది 82 హార్స్ పవర్, 112 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ 5 స్పీడ్ మాన్యువల్ లేదా ఆటోమాటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్స్ పొందుతుంది.
Comments
Please login to add a commentAdd a comment