భారతదేశంలో అడుగుపెట్టిన కొత్త 'డిజైర్'.. గ్లోబల్ ఎన్‌సీఏపీ (GNCAP) క్రాష్ టెస్టులో 5 స్టార్ రేటింగ్ సాధించి మారుతి సుజుకి అత్యంత సురక్షితమైన కారుగా రికార్డ్ క్రియేట్ చేసింది.
అడల్ట్ ఆక్యుపెంట్ ప్రొటెక్షన్ టెస్టులో 34 పాయింట్లకు 31.24 పాయింట్లు సాధించి సేఫ్టీలో 5 స్టార్ రేటింగ్ సొంతం చేసుకుంది. చైల్డ్ ఆక్యుపెంట్ ప్రొటెక్షన్ టెస్టులో 42 పాయింట్లకుగా 39.20 పాయింట్లు స్కోర్ చేసి.. సేఫ్టీలో 4 స్టార్ రేటింగ్ పొందగలిగింది. అయితే మొత్తం మీద సేఫ్టీలో 5 స్టార్ట్ రేటింగ్ సాధించి బ్రాండ్‌కు సరికొత్త ఘనతను అందించింది.
సేఫ్టీ ఫీచర్స్
మారుతి డిజైర్ కారులో ఆరు ఎయిర్ బ్యాగులు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, అన్ని సీట్లకు రిమైండర్‌లతో కూడిన 3 పాయింట్ సీట్ బెల్ట్‌లు, రియర్ ఔట్‌బోర్డ్ సీట్లకు ఇసోఫిక్స్ మౌంట్స్, సీట్ బెల్ట్ ప్రిటెన్షనర్, ఏబీఎన్ విత్ ఈబీడీ వంటి సేఫ్టీ ఫీచర్స్ ఉన్నాయి. గ్లోబల్ ఎన్‌సీఏపీ క్రాష్ టెస్టులో.. టెస్టుకు గురిచేసిన కారు భారతదేశంలో తయారైన మోడల్. ఇది దాదాపు 45 శాతం టెన్సైల్ స్టీల్‌తో తయారైంది.
నవంబర్ 11న దేశీయ మార్కెట్లో లాంచ్ కానున్న మారుతి డిజైర్.. 1.2లీటర్ 3 సిలిండర్ పెట్రోల్ ఇంజిన్ పొందుతుంది. ఇది 81.58 పీఎస్ పవర్, 111.7 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఇంజిన్ 5 స్పీడ్ మాన్యువల్, 5 స్పీడ్ ఆటోమాటిక్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్స్ పొందుతుంది.
మారుతి కొత్త డిజైన్ ఎల్ఈడీ క్రిస్టల్ విజన్ హెడ్‌ల్యాంప్, ఎల్ఈడీ రియర్ కాంబినేషన్ ల్యాంప్స్, 15 ఇంచెస్ అల్లాయ్ వీల్స్, షార్క్ షార్క్ ఫిన్ యాంటెన్నా, బూట్ లిడ్ స్పాయిలర్, 9 ఇంచెస్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 360 డిగ్రీ కెమెరా, ఆటోమేటిక్ ఏసీ, క్రూయిజ్ నియంత్రణ, ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, రియర్ ఏసీ వెంట్స్, రియర్ ఆర్మ్‌రెస్ట్ వంటి మరెన్నో లేటెస్ట్ ఫీచర్స్ పొందుతుంది.
ఇదీ చదవండి: 38 ఏళ్ల వయసు.. 120 కోట్ల విరాళం: ఎవరో తెలుసా?
ఇండియన్ మార్కెట్లో లాంచ్ కానున్న కొత్త మారుతి డిజైర్.. హ్యుందాయ్ ఆరా, హోండా అమేజ్, టాటా టిగోర్ వంటి వాటికి ప్రధాన ప్రత్యర్థిగా ఉంటుంది. అయితే దీని ధర రూ. 6.99 లక్షల నుంచి రూ. 10 లక్షల (ఎక్స్ షోరూమ్) మధ్య ఉంటుందని అంచనా. ధరలు అధికారికంగా నవంబర్ 11న వెల్లడవుతాయి.
Comments
Please login to add a commentAdd a comment