Crash Test
-
లాంచ్‌కు ముందే డిజైర్ ఘనత: సేఫ్టీలో సరికొత్త రికార్డ్
భారతదేశంలో అడుగుపెట్టిన కొత్త 'డిజైర్'.. గ్లోబల్ ఎన్సీఏపీ (GNCAP) క్రాష్ టెస్టులో 5 స్టార్ రేటింగ్ సాధించి మారుతి సుజుకి అత్యంత సురక్షితమైన కారుగా రికార్డ్ క్రియేట్ చేసింది.అడల్ట్ ఆక్యుపెంట్ ప్రొటెక్షన్ టెస్టులో 34 పాయింట్లకు 31.24 పాయింట్లు సాధించి సేఫ్టీలో 5 స్టార్ రేటింగ్ సొంతం చేసుకుంది. చైల్డ్ ఆక్యుపెంట్ ప్రొటెక్షన్ టెస్టులో 42 పాయింట్లకుగా 39.20 పాయింట్లు స్కోర్ చేసి.. సేఫ్టీలో 4 స్టార్ రేటింగ్ పొందగలిగింది. అయితే మొత్తం మీద సేఫ్టీలో 5 స్టార్ట్ రేటింగ్ సాధించి బ్రాండ్‌కు సరికొత్త ఘనతను అందించింది.సేఫ్టీ ఫీచర్స్మారుతి డిజైర్ కారులో ఆరు ఎయిర్ బ్యాగులు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, అన్ని సీట్లకు రిమైండర్లతో కూడిన 3 పాయింట్ సీట్ బెల్ట్‌లు, రియర్ ఔట్‌బోర్డ్ సీట్లకు ఇసోఫిక్స్ మౌంట్స్, సీట్ బెల్ట్ ప్రిటెన్షనర్, ఏబీఎన్ విత్ ఈబీడీ వంటి సేఫ్టీ ఫీచర్స్ ఉన్నాయి. గ్లోబల్ ఎన్సీఏపీ క్రాష్ టెస్టులో.. టెస్టుకు గురిచేసిన కారు భారతదేశంలో తయారైన మోడల్. ఇది దాదాపు 45 శాతం టెన్సైల్ స్టీల్‌తో తయారైంది.నవంబర్ 11న దేశీయ మార్కెట్లో లాంచ్ కానున్న మారుతి డిజైర్.. 1.2లీటర్ 3 సిలిండర్ పెట్రోల్ ఇంజిన్ పొందుతుంది. ఇది 81.58 పీఎస్ పవర్, 111.7 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఇంజిన్ 5 స్పీడ్ మాన్యువల్, 5 స్పీడ్ ఆటోమాటిక్ ట్రాన్స్మిషన్ ఆప్షన్స్ పొందుతుంది.మారుతి కొత్త డిజైన్ ఎల్ఈడీ క్రిస్టల్ విజన్ హెడ్‌ల్యాంప్, ఎల్ఈడీ రియర్ కాంబినేషన్ ల్యాంప్స్, 15 ఇంచెస్ అల్లాయ్ వీల్స్, షార్క్ షార్క్ ఫిన్ యాంటెన్నా, బూట్ లిడ్ స్పాయిలర్, 9 ఇంచెస్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, 360 డిగ్రీ కెమెరా, ఆటోమేటిక్ ఏసీ, క్రూయిజ్ నియంత్రణ, ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, రియర్ ఏసీ వెంట్స్, రియర్ ఆర్మ్‌రెస్ట్ వంటి మరెన్నో లేటెస్ట్ ఫీచర్స్ పొందుతుంది.ఇదీ చదవండి: 38 ఏళ్ల వయసు.. 120 కోట్ల విరాళం: ఎవరో తెలుసా?ఇండియన్ మార్కెట్లో లాంచ్ కానున్న కొత్త మారుతి డిజైర్.. హ్యుందాయ్ ఆరా, హోండా అమేజ్, టాటా టిగోర్ వంటి వాటికి ప్రధాన ప్రత్యర్థిగా ఉంటుంది. అయితే దీని ధర రూ. 6.99 లక్షల నుంచి రూ. 10 లక్షల (ఎక్స్ షోరూమ్) మధ్య ఉంటుందని అంచనా. ధరలు అధికారికంగా నవంబర్ 11న వెల్లడవుతాయి. -
క్రాష్ టెస్ట్‌లో తడాఖా.. ప్రముఖ ఈవీలకు 5 స్టార్ రేటింగ్
క్రాష్ టెస్ట్‌లో దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం టాటాకు చెందిన ఎలక్ట్రిక్ కార్లు తడాఖా చూపించాయి. టాటా పంచ్ ఈవీ, నెక్సాన్ ఈవీ 5 స్టార్ భారత్-ఎన్సీఏపీ సేఫ్టీ రేటింగ్ సాధించాయని టాటా మోటార్స్ అనుబంధ సంస్థ టాటా ప్యాసింజర్ ఎలక్ట్రిక్ మొబిలిటీ లిమిటెడ్ (టీపీఈఎం) ప్రకటించింది.అడల్ట్ యాక్సిడెంట్ ప్రొటెక్షన్ (ఏఓపీ)లో 31.46/32 పాయింట్లు, చైల్డ్ యాక్సిడెంట్ ప్రొటెక్షన్ (సీఓపీ)లో 45/49 పాయింట్లు సాధించడం ద్వారా పంచ్ ఈవీ ఇప్పటివరకు ఏ వాహనం సాధించని అత్యధిక స్కోర్లను అందుకోవడం ద్వారా ఒక ప్రధాన మైలురాయిని నిర్దేశించింది. ఇక నెక్సాన్ ఈవీ కేఓపీలో 29.86/32 పాయింట్లు, సీఓపీలో 44.95/49 పాయింట్లను సాధించింది. దీంతో టాటా మోటార్స్ ఇప్పుడు భారత్-ఎన్సీఏపీ, గ్లోబల్-ఎన్సీఏపీ పరీక్షలలో 5-స్టార్ స్కోర్ చేసిన సురక్షితమైన శ్రేణి ఎస్యూవీ పోర్ట్‌ఫోలియో కలిగిన ఏకైక ఓఈఎంగా నిలిచింది.'భారత్-ఎన్సీఏపీ కింద నెక్సాన్ ఈవీ, పంచ్ ఈవీలకు 5 స్టార్ రేటింగ్ లభించడంపై టాటా మోటార్స్‌కు నా హృదయపూర్వక అభినందనలు. ఈ సర్టిఫికేషన్ దేశంలో సురక్షితమైన వాహనాల పట్ల భారత ప్రభుత్వ దార్శనికతకు అనుగుణంగా ఉంటుంది. భారతదేశ ఆటోమొబైల్ పరిశ్రమను 'ఆత్మనిర్భర్'గా మార్చడంలో భారత్-ఎన్సీఏపీ పాత్రను నొక్కి చెబుతుంది" అని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు.పంచ్ ఈవీ లాంచ్ అయినప్పటి నుంచి విశేష ఆదరణను సొంతం చేసుకుంది. గ్రామీణ మార్కెట్ల నుంచి 35 శాతానికి పైగా కస్టమర్లు ఉన్నారు. పంచ్ ఈవీని 10,000 మందికి పైగా కొనుగోలు చేశారు. భారతదేశ ఎలక్ట్రిక్ వాహనాల విప్లవానికి నాంది పలికిన నెక్సాన్ ఈవీ 2020 లో లాంచ్ అయినప్పటి నుంచి 68,000 యూనిట్లకు పైగా అమ్ముడుపోయాయి. ఈ ఎస్‌యూవీని అప్డేటెడ్ వర్షన్‌ను 2023లో ఆవిష్కరించారు. -
NCAP: ఇక దేశీయంగా కార్ల క్రాష్ టెస్టింగ్..
న్యూఢిల్లీ: వాహనాలను మరింత సురక్షితం చేసే దిశగా కేంద్రం దేశీయంగా తొలి కార్ల క్రాష్ టెస్టింగ్ ప్రోగ్రామ్‌ను ఆవిష్కరించింది. కేంద్ర రహదారి, హైవేల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ మంగళవారం భారత్ న్యూ కార్ అసెస్మెంట్ ప్రోగ్రాం (భారత్ ఎన్‌క్యాప్)ను ప్రారంభించారు. ఈ ఏడాది అక్టోబర్ 1 నుంచి ఇది అమల్లోకి వస్తుంది. విదేశాలతో పోలిస్తే చౌకగా దేశీయంగానే కార్ల క్రాష్ టెస్టింగ్‌ను నిర్వహించేందుకు ఇది ఉపయోగపడగలదని గడ్కరీ చెప్పారు. ‘విదేశాల్లో ఈ పరీక్షలు చేయించాలంటే దాదాపు రూ. 2.5 కోట్లవుతుంది. అదే భారత్ ఎన్‌క్యాప్ కింద చేస్తే సుమారు రూ. 60 లక్షలవుతుంది. కాబట్టి దీనికి మంచి మార్కెట్ కూడా ఉండగలదు‘ అని ఆయన పేర్కొన్నారు. ఈ ప్రోగ్రాం కింద కార్ల తయారీ సంస్థలు స్వచ్ఛందంగా తమ వాహనాలను పరీక్షలు చేయించుకోవచ్చు. టెస్టుల్లో వాహనాల పనితీరును బట్టి 0–5 వరకు స్టార్ రేటింగ్ ఇస్తారు. ఈ విధానం కింద 30 పైగా మోడల్స్‌ను టెస్ట్ చేయించుకునేందుకు పలు కంపెనీలు సంప్రదించినట్లు గడ్కరీ తెలిపారు. -
సేఫెస్ట్ కార్ల జాబితాలో ఆ రెండు కార్లు
భారతీయ మార్కెట్లో కార్లను కొనుగోలు చేసే కస్టమర్లు మంచి డిజైన్, లేటెస్ట్ ఫీచర్స్ వంటి వాటితో సేఫ్టీ ఫీచర్స్ ఎక్కువగా ఉన్న కార్లను సెలక్ట్ చేసుకుంటారు. దీనిని దృష్టిలో ఉంచుకుని కార్ల తయారీ సంస్థలు కూడా తమ ఉత్పత్తులలో అత్యధిక సేఫ్టీ ఫీచర్స్ అందించడానికి ప్రయత్నిస్తున్నాయి. ఇప్పటికే సేఫ్టీలో 5 స్టార్ రేటింగ్ కలిగిన కార్లు చాలానే ఉన్నప్పటికీ తాజాగా ఈ జాబితాలో మరో రెండు కార్లు చేరాయి. ఈ కార్లను గురించి మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.. దేశీయ విఫణిలో అత్యధిక ప్రజాదరణ పొందిన స్కోడా స్లావియా, ఫోక్స్‌వ్యాగన్ వర్టస్ రెండూ గ్లోబల్ ఎన్‌సిఏపి టెస్ట్‌లో 5 స్టార్ రేటింగ్ కైవసం చేసుకుని సురక్షితమైన కార్ల జాబితాలో చోటు సంపాదించుకున్నాయి. GNCAP కొత్త టెస్టింగ్ ప్రోటోకాల్ క్రింద 5-స్టార్ రేటింగ్ పొందిన మొదటి మిడ్ సైజ్ సెడాన్లు ఈ స్లావియా & వర్టస్ కావడం గమనార్హం. (ఇదీ చదవండి: క్రెడిట్ కార్డ్ నుంచి బ్యాంక్ అకౌంట్‌కి ట్రాన్సాక్షన్ - సులభంగా ఇలా!) స్లావియా, వర్టస్ రెండూ కూడా అడల్ట్ ఆక్యుపెంట్ ప్రొటెక్షన్ టెస్ట్‌లలో మొత్తం 34 పాయింట్లకు గానూ 29.71 పాయింట్లు సాధించాయి. అదే సమయంలో చైల్డ్ ఆక్యుపెంట్ ప్రొటెక్షన్ టెస్ట్‌లలో 49 పాయింట్లకు 42 పాయింట్లు పొంది మొత్తం మీద సేఫ్టీలో 5 స్టార్ రేటింగ్ సొంతం చేసుకున్నాయి. కొత్త గ్లోబల్ NCAP టెస్టింగ్ ప్రోటోకాల్స్ ప్రకారం.. అడల్ట్ ఆక్యుపెంట్ & చైల్డ్ ఆక్యుపెంట్ టెస్ట్‌లలో మాత్రమే కాకుండా ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, పెడిస్ట్రియన్ ప్రొటక్షన్ (పాదచారుల రక్షణ), సీట్ బెల్ట్ రిమైండర్ వంటి వాటిలో కూడా ఉత్తమ స్కోరింగ్ పొందినప్పుడే ఆ వాహనానికి 5 స్టార్ రేటింగ్ లభిస్తుంది. అన్ని పరీక్షల్లో మంచి స్కోరింగ్ సాధించిన స్లావియా, వర్టస్ రెండూ అత్యంత సురక్షితమైన కార్ల జాబితాలో చేరటం నిజంగా హర్షించదగ్గ విషయం. -
సేఫ్టీ క్రాష్ టెస్ట్‌లో స్విఫ్ట్, డస్టర్ ఫెయిల్!
రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు అందులో ప్రయాణించే వారికి రక్షణ కల్పించే విషయంలో మారుతి సుజూకి స్విఫ్ట్, రెనాల్ట్ డస్టర్ కార్ల పని తీరు అస్సలు బాగోలేదంటూ లాటిన్ ఎన్సీఏపీ స్పష్టం చేసింది. ఇటీవల నిర్వహించిన క్రాష్ టెస్ట్‌లో ఈ రెండు కార్లు దారుణమైన ఫలితాలను పొందాయి. క్రాష్ టెస్ట్ కార్లలో ప్రయాణికుల భద్రతకు సంబంధించి వివిద దేశాలు న్యూ కార్ ఎస్సెస్మెంట్ ప్రోగ్రామ్ (ఎన్సీఏపీ) పేరుతో క్రాష్ టెస్ట్‌లు నిర్వహించి రేటింగ్స్ ఇస్తుంటాయి. ఇటీవల లాటిన్ ఎన్సీపీఏ పరీక్షలు నిర్వహించగా మారుతి సుజూకి స్విఫ్ట్, రెనాల్ట్ డస్టర్ కార్లు ఈ పరీక్షలో పాల్గొన్నాయి. ఇటీవల కొత్తగా అమల్లోకి తెచ్చిన నిబంధనలను అనుసరించి ఈ పరీక్షలు నిర్వహించగా ఈ రెండు ప్రముఖ కార్లు దారుణంగా జీరో స్టార్స్ రేటింగ్ సాధించి నిరాశజనకమైన ఫలితాలు కనబరిచాయి. మారుతి స్విఫ్ట్ పరిస్థితి మారుతి సిఫ్ట్కి సంబంధించి హ్యాచ్‌బ్యాక్, సెడాన్ రెండు కార్లు సైతం ఈ టెస్టులో అత్తెసరు మార్కులు కూడా సాధించలేపోయాయి. ఆడల్డ్ ఆక్యుపెంట్ బాక్స్ కేటగిరిలో 15.53 శాతం, చిల్డ్రెన్ ఆక్యుపెంట్ బాక్స్ కేటగిరీలో సున్నా శాతం. పెడస్ట్రియన్ ప్రొటెక్షన్, వల్నరబుల్ రోడ్ బాక్స్ కేటగిరిలో 66 శాతం, సేఫ్టీ అసిస్ట్ బాక్స్ కేటగిరిలో 6.98 శాతం పాయింట్లనే సాధించగలిగింది. దీంతో మారుతి స్విఫ్ట్‌కి లాటిన్ ఎన్సీఏపీ జీరో రేటింగ్ ఇచ్చింది. డస్టర్దీ అదే దారి రెనాల్ట్ స్పోర్ట్స్ యుటిలిటీ వెహికల్ డస్టర్‌కి ఈ క్రాష్ టెస్ట్‌లో ఆడల్డ్ ఆక్యుపెంట్ బాక్స్ కేటగిరిలో 29.47 శాతం, చిల్డ్రెన్ ఆక్యుపెంట్ బాక్స్ కేటగిరీలో 22.93 శాతం. పెడస్ట్రియన్ ప్రొటెక్షన్, వల్నరబుల్ రోడ్ బాక్స్ కేటగిరిలో 50.79 శాతం, సేఫ్టీ అసిస్ట్ బాక్స్ కేటగిరిలో 34.88 శాతం పాయింట్లనే సాధించగలిగింది. రక్షణ చర్యలేవి లాటిన్ ఎన్సీఏపీ పరీక్షలో విఫలమైన మారుతి స్విఫ్ట్, రెనాల్ట్ డస్టర్ల్ కార్లలో స్టాండర్డ్‌గా రెండు ఎయిర్‌బ్యాగులు అందించారు. అయితే ప్రమాదం జరిగినప్పుడు సైడ్ ఇంపాక్ట్ ప్రొటెక్షన్ విషయంలో ఈ రెండు కార్లలో భద్రతా ప్రమాణాలు నాసిరకంగా ఉన్నాయని లాటిన్ ఎన్సీఏపీ అభిప్రాయపడింది. ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ సిస్టమ్ లేకపోవడం పెద్దలోటని తెలిపింది. ఇప్పుడే కష్టం యూఎన్ 95 నిబంధనలకు తగ్గట్టుగా స్విఫ్ట్ , డస్టర్ కార్లలో భద్రతా ఏర్పాట్లు లేనందున వీటిని ఇప్పుడే లాటిన్ దేశాల్లో అనుమతించే అవకాశం లేదు. 2018లో జరిగిన క్రాష్ టెస్ట్‌లో స్విఫ్ట్‌కి 2 స్టార్ రేటింగ్ వచ్చింది. ఈసారి రేటింగ్ మెరుగవుతుందని భావిస్తే దారుణంగా పడిపోయింది. యూరోపియన్, లాటిన్ దేశాల్లో కార్లకు 6 ఎయిర్‌బ్యాగ్స్‌తో పాటు ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ సిస్టమ్‌లు తప్పనిసరిగా మారాయి. చదవండి : హ్యుందాయ్ సంచలనం! త్వరలో హైడ్రోజన్ వేవ్ కారు!! -
క్రాష్ టెస్ట్: వోల్వో సంచలన నిర్ణయం
సాక్షి,న్యూఢిల్లీ: ప్రముఖ కార్ల తయారీ సంస్థ వోల్వో సంచలన నిర్ణయం తీసుకుంది. ఏకంగా 10 కార్లను 30 మీటర్ల ఎత్తునుంచి పడవేసి మరీ క్రాష్ టెస్ట్ నిర్వహించింది. అత్యున్నత ప్రమాణాలను సృష్టించే ప్రయత్నాల్లో భాగంగా తొలిసారి పలు మోడళ్ల కొత్త కార్లను క్రేన్ల సాయంతో 30 మీటర్ల ఎత్తునుంచి కిందికి తోసివేసింది. తద్వారా ప్రమాదాల్లో కారులోపల ఉన్నవారి పరిస్థితిని అంచనా వేయడం, రక్షణ చర్యల్లో రెస్క్యూ సిబ్బందికి సూచనలు సలహాలు ఇవ్వనుంది. సాధారణంగా 20ఏళ్ల నాటి కార్లపై చేసే ప్రయోగాలను కొత్త కార్లతో చేయడం విశేషం. ఘోర ప్రమాదాల్లో లోపల ఉన్నవారి పరిస్థితి విషమంగా ఉంటుంది. ఈ నేపథ్యంలో హైడ్రాలిక్ రెస్క్యూ టూల్స్ ఉపయోగించి వారిని వెలికి తీసి, వీలైనంత త్వరగా ఆసుపత్రికి తరలించడంలాంటి అంశాలను పరిశీలించింది. తద్వారా వారి ప్రాణాలను రక్షించే సామర్థ్యాలను మరింత అభివృద్ధి చేయడానికి వీలు కల్పిస్తుందని కంపెనీ భావిస్తోంది. రక్షణ సిబ్బంది నిరంతరం అప్డేట్ కావడం, కొత్త ఎక్స్ట్రికేషన్ టెక్నిక్లను అభివృద్ధి, సమీక్ష కీలకమని సంస్థ భావిస్తోంది. తీవ్రమైన ప్రమాదాల తర్వాత ప్రజలను వెలికితీసే కొత్త పద్ధతులను అవలంబించేలా అత్యవసర రక్షణ సిబ్బంది సహాయం చేయాలనుకుంటున్నాం. ఇందుకు సాధారణ క్రాష్ పరీక్షలు సరిపోవు. అందుకే కొంచెం విపరీతంగా ఆలోచించాల్సి వచ్చిందని వోల్వో తెలిపింది. అతివేగంతో కార్లు ప్రమాదానికి గురి కావడం, ఈ ఘోర ప్రమాదాల్లో కార్లు దెబ్బతినడం, కార్లలో ఇరుక్కుపోయిన వారిని రక్షించడం తదితర కీలక అంశాలపై నివేదికను రూపొందించడంతో పాటు, ఈ ఇంటెన్సివ్ అనాలిసిస్ రిపోర్టును సహాయక బృందాలకు ఉచితంగా అందిస్తుంది. రెస్క్యూ ప్రొవైడర్ల అభ్యర్థన మేరకు ఈ క్రాష్ టెస్ట్ చేసినట్టు వోల్వో వెల్లడించింది. ఫలితాల నుండి నేర్చుకోవడానికి, ప్రయాణీకుల ప్రాణాలను రక్షించే సామర్థ్యాలను అదనంగా అభివృద్ధి చేయడానికి ఇది వీలు కల్పిస్తుందని తెలిపింది. We wanted to help our Emergency Services develop new methods of extracting people after severe accidents, but our regular crash tests weren't enough. So, we had to think of something a little more extreme.... #ForEveryonesSafety pic.twitter.com/fMGF1A4HtU — Volvo Car UK (@VolvoCarUK) November 13, 2020 -
కారు సీట్లకు పందులను కట్టేసి...
న్యూఢిల్లీ : చైనాలోని కార్ల కంపెనీలు సజీవ పందులను నిజంగా ‘గినీ పిగ్స్’గా ఉపయోగిస్తున్నాయి. పిల్లల సీటు బెల్టుల పటిష్టతను పరీక్షించేందుకు జరిపే ప్రయాగాలలో వీటిని వాడుతున్నాయి. కార్ల సీట్లలో పందులను సజీవంగా బెల్ట్‌లతో కట్టేసి గంటకు 30, 40 కిలోమీటర్ల వేగంతో గోడలకు ఢీ కొట్టిస్తున్నాయి. ఇలా చేయడం వల్ల పందుల ఎముకలు విరగడమే కాకుండా వాటి లోపల అంతర్గతంగా గాయాలవుతున్నాయని, వాటి నుంచి రక్తస్రావం అవుతోందని, ఆ బాధను భరించలేక అవి వాంతులు చేసుకుంటున్నాయని, కొన్ని చనిపోతున్నాయని జంతు కారుణ్య కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల ఇలా చైనాలో ఓ కార్ల కంపెనీ 15 పందులపై ఈ ప్రయోగాలు నిర్వహించగా, వాటిలో ఏడు పందులు చనిపోయాయని జంతు కారుణ్య కార్యకర్తల అధికార ప్రతినిధి అన్నే మైనర్ట్ తెలిపినట్లు ‘బిల్డ్’ జర్మనీ వార్తా పత్రిక వెల్లడించింది. ప్రయోగాలకు ముందు కొన్ని గంటల నుంచి ఆ పందులకు తిండి, నీళ్లు కూడా ఇవ్వకుండా కూడా వేధిస్తున్నారని అన్నే మైనర్ట్ తెలిపారు. పందులు, చిన్న పిల్లల శరీర నిర్మాణం ఒకేలాగా ఉంటుంది కనుక కార్ల కంపెనీలు ఎక్కువగా పందులపై ప్రయోగాలు జరపుతున్నాయని తెల్సింది. అమెరికాలో జనరల్ మోటార్స్ కంపెనీ 1990 దశకం వరకు పందులతో ఇలాంటి ప్రయోగాలే నిర్వహించేది. జంతు కారుణ్య కార్యకర్తల ఆందోళనతో మానేసింది. -
క్రాష్ టెస్టులో మరో కారు ఫెయిల్.. 0 స్టార్ రేటింగ్
భారతదేశంలో తయారైన కార్లలో ఇటీవలి కాలంలో బాగా ఎక్కువ ప్రాచుర్యం పొందిన కార్లలో.. రెనో డస్టర్ ఒకటి. అయితే ఈ కారు బేస్ మోడల్ మాత్రం క్రాష్ టెస్టులో ఘోరంగా విఫలమైంది. అంతర్జాతీయంగా నిర్వహించే గ్లోబల్ ఎన్కాప్ క్రాష్ టెస్టులో దీనికి 0 స్టార్ రేటింగ్ ఇచ్చారు. వెనకాల సీట్లో ఉన్న పిల్లల రక్షణ విషయంలో దీనికి 2 స్టార్ల రేటింగ్ ఇచ్చారు. 2017 సంవత్సరానికి గాను భారతదేశంలో తయారైన కార్లకు క్రాష్ టెస్టు చేయడం ఇది రెండో రౌండు. తొలిరౌండులో షెవ్రోలె ఎంజాయ్, ఫోర్డ్ ఫిగో యాస్పైర్ కార్లను టెస్ట్ చేశారు. 2014 నుంచి గ్లోబల్ ఎన్కాప్ మన కార్లకు క్రాష్ టెస్టులు చేస్తోంది. ఐక్యరాజ్యసమితి నిర్ణయించిన టెస్టింగ్ ప్రోటోకాల్ ప్రకారం గంటకు 56 కిలోమీటర్ల వేగంతో వెళ్తుండగా కారు ముందు భాగానికి, పక్క భాగాలకు ఎలాంటి ప్రభావం ఉంటుందో చూడాలని మన దేశంలో చెబుతున్నారు. అయితే గ్లోబల్ ఎన్కాప్ మాత్రం 64 కిలోమీటర్ల వేగంతో చూస్తుంది. రెనో డస్టర్ బేసిక్ మోడల్‌కు ఎయిర్‌బ్యాగ్స్ ఉండవు. అందుకే అది ఈ టెస్టులో విఫలమైందని అంటున్నారు. డ్రైవర్ సీట్లో ఎయిర్‌బ్యాగ్ ఉండే డస్టర్ మోడల్‌కు గ్లోబల్ ఎన్కాప్ క్రాష్ టెస్టులో 3 స్టార్ రేటింగ్ వచ్చింది. అయితే వెనకాల సీట్లో ఉండే పిల్లల రక్షణ విషయంలో మాత్రం 2 స్టార్ రేటింగ్ అలాగే ఉంది. ఇదే మోడల్ డస్టర్ కార్లను లాటిన్ అమెరికా ప్రాంతం కోసం కొలంబియాలో తయారుచేయగా వాటికి 4 స్టార్ రేటింగ్ వచ్చింది. దీనిపై గ్లోబల్ ఎన్కాప్ వివరణ ఇస్తూ, భారతదేశంలో తయారయ్యేవాటి కంటే లాటిన్ అమెరికా వాటిలో ఎయిర్‌బ్యాగ్ సైజు పెద్దదని, అందుకే స్టార్ రేటింగ్ మారిందని తెలిపింది. -
ఆ 5 మోడళ్ల కార్లు పనికిరావా?
♦ ఈ కార్లకు జీరో రేటింగ్ ఇచ్చిన గ్లోబల్ ఎన్సీఏపీ ♦ భారత ప్రమాణాలకనుగుణంగానే ♦ కార్ల తయారీ: వాహన కంపెనీలు ♦ గ్లోబల్ ఎన్‌సీఏపీవి సొంత ప్రమాణాలు న్యూఢిల్లీ: భారత్‌లో విక్రయమవుతున్న ఐదు కార్లలో ప్రయాణికుల భద్రతా ప్రమాణాలు తగిన విధంగా లేవని గ్లోబల్ ఎన్సీఏపీ (న్యూ కార్ అసెస్మెంట్ ప్రోగ్రామ్స్) వెల్లడించింది. మారుతీ సెలెరియో, ఈకో, రెనో క్విడ్, మహీంద్రా స్కార్పియో, హ్యుందాయ్ ఇయాన్... ఈ ఐదు కార్లు తమ క్రాష్ టెస్టుల్లో విఫలమయ్యాయని పేర్కొంది. భారత ప్రభుత్వ భద్రతా నియమ నిబంధనలకు అనుగుణంగానే కార్లను తయారు చేశామని మారుతీ, రెనో, హ్యుందాయ్ కంపెనీలు పేర్కొన్నాయి. గ్లోబల్ ఎన్సీఏపీ క్రాష్‌టెస్ట్‌లపై ఈ కంపెనీలతో పాటు సియామ్ కూడా సందేహాలు వ్యక్తం చేసింది. వివరాలు.. వాహన భద్రతకు సంబంధించి ఇంగ్లాండ్‌కు చెందిన గ్లోబల్ ఎన్సీఏపీ సంస్థ నిర్వహించిన క్రాష్ టెస్టుల్లో ఈ ఐదు కార్లకు జీరో రేటింగ్ లభించింది. తాజా క్రాష్ టెస్ట్ వివరాలను ఈ సంస్థ సెక్రటరీ జనరల్ డేవిడ్ వార్డ్ మంగళవారం వెల్లడించారు. ఎయిర్ బ్యాగ్‌లతో కూడిన మోడల్‌తో సహా మొత్తం మూడు వేరియంట్ల రెనో క్విడ్ కార్లను క్రాష్ టెస్ట్‌లు చేశామని, అన్ని కార్లకు జీరో రేటింగే వచ్చిందని డేవిడ్ వివరించారు. రెనో కూడా తగిన భద్రత లేని కార్లను తయారు చేయడం ఆశ్చర్యకరమని పేర్కొన్నారు. భారత నియమ నిబంధనల ప్రకారమే.. భద్రత నియమ నిబంధనలు కట్టుదిట్టంగా ఉండే యూరప్, అమెరికాల్లోనే గంటకు 56 కిమీ. వేగంతో స్పీడ్ టెస్ట్‌లు నిర్వహిస్తారని, కానీ గ్లోబల్ ఎన్సీఏపీ గంటలకు 64 కిమీ. వేగంతో ఈ స్పీడ్ టెస్ట్‌లు నిర్వహించిందని పరిశ్రమవర్గాలు పేర్కొన్నాయి. గ్లోబల్ ఎన్సీఏపీ ఒక ప్రైవేట్ సంస్థ అని, తన సొంత ప్రమాణాల మేరకు ఈ సంస్థ కార్లకు రేటింగ్‌లు ఇస్తుందని సియామ్ డెరైక్టర్ జనరల్ విష్ణుమాధుర్ చెప్పారు. భారత్‌లో సగటు వేగం అంత కంటే తక్కువని పేర్కొన్నారు. తమ కార్లన్నీ భారత నియమనిబంధనలకు అనుగుణంగానే ఉన్నాయని, ఒక రకంగా అంతకంటే మంచి ప్రమాణాలతోనే ఉన్నాయని మారుతి వెల్లడించింది. భారత ప్రభుత్వ భద్రతా ప్రమాణాల ప్రకారమే కార్లను తయారు చేశామని రెనో కంపెనీ స్పందించింది.