భారత్ ఎన్సీఏపీ క్రాష్ టెస్టులో హ్యుందాయ్ టక్సన్ 5 స్టార్ రేటింగ్ సాధించింది. బీఎన్సీఏపీ పరీక్షించిన తొలి హ్యుందాయ్ కారు టక్సన్ కావడం గమనార్హం. ఇది అడల్ట్ సేఫ్టీలో 32 పాయింట్లకు 30.84 పాయింట్లు సాధించగా, పిల్లల రక్షణలో 49కు 41 పాయింట్లు సాధించింది.
హ్యుందాయ్ టక్సన్ కారులో ఫ్రంటల్ ఎయిర్ బ్యాగ్, బెల్ట్ ప్రీటెన్షనర్, బెల్ట్ లోడ్ లిమిటర్, సైడ్ హెడ్ కర్టెన్ ఎయిర్ బ్యాగ్, సైడ్ చెస్ట్ ఎయిర్ బ్యాగ్, సైడ్ పెల్విస్ ఎయిర్ బ్యాగ్ వంటివి ఉన్నాయి. ఇందులో చైల్డ్ సీట్ కోసం ఐసోఫిక్స్ మౌంట్స్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, సీట్ బెల్ట్ రిమైండర్లు మొదలైనవి ఉన్నాయి.
హ్యుందాయ్ టక్సన్ ధర రూ.29.02 లక్షల నుంచి రూ.35.94 లక్షల (ఎక్స్ షోరూమ్) మధ్య ఉంది. ఇది 2.0-లీటర్ పెట్రోల్ ఇంజన్, 2-లీటర్ డీజిల్ ఇంజన్ ఆప్షన్లలో లభిస్తుంది. పెట్రోల్ ఇంజన్ 156 బీహెచ్‌పీ పవర్, 192 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. డీజిల్ ఇంజిన్ 186 బీహెచ్‌పీ పవర్, 416 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది.
హ్యుందాయ్ టక్సన్ మంచి డిజైన్, ఫీచర్స్ పొందుతుంది. ఇది రెండు డ్యూయల్-టోన్ షేడ్స్, ఐదు మోనోటోన్ రంగులలో లభిస్తుంది. అవి అట్లాస్ వైట్, అబిస్ బ్లాక్, అమెజాన్ గ్రే, స్టార్రీ నైట్, ఫియరీ రెడ్, అట్లాస్ వైట్ విత్ అబిస్ బ్లాక్ రూఫ్, అబిస్ బ్లాక్ రూఫ్ తో ఫియరీ రెడ్.
Safety ratings of Hyundai-Tucson Gasoline.
The Hyundai Tucson Gasoline has scored 5 Star Safety Ratings in both Adult Occupant Protection (AOP) and Child Occupant Protection (COP) in the latest Bharat NCAP crash tests#bharatncap #safetyfirst #safetybeyondregulations #drivesafe pic.twitter.com/9vpaEUga8y— Bharat NCAP (@bncapofficial) November 28, 2024
Comments
Please login to add a commentAdd a comment