భారతీయ మార్కెట్లో కార్లను కొనుగోలు చేసే కస్టమర్లు మంచి డిజైన్, లేటెస్ట్ ఫీచర్స్ వంటి వాటితో సేఫ్టీ ఫీచర్స్ ఎక్కువగా ఉన్న కార్లను సెలక్ట్ చేసుకుంటారు. దీనిని దృష్టిలో ఉంచుకుని కార్ల తయారీ సంస్థలు కూడా తమ ఉత్పత్తులలో అత్యధిక సేఫ్టీ ఫీచర్స్ అందించడానికి ప్రయత్నిస్తున్నాయి. ఇప్పటికే సేఫ్టీలో 5 స్టార్ రేటింగ్ కలిగిన కార్లు చాలానే ఉన్నప్పటికీ తాజాగా ఈ జాబితాలో మరో రెండు కార్లు చేరాయి. ఈ కార్లను గురించి మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకుందాం..
దేశీయ విఫణిలో అత్యధిక ప్రజాదరణ పొందిన స్కోడా స్లావియా, ఫోక్స్‌వ్యాగన్ వర్టస్ రెండూ గ్లోబల్ ఎన్‌సిఏపి టెస్ట్‌లో 5 స్టార్ రేటింగ్ కైవసం చేసుకుని సురక్షితమైన కార్ల జాబితాలో చోటు సంపాదించుకున్నాయి. GNCAP కొత్త టెస్టింగ్ ప్రోటోకాల్ క్రింద 5-స్టార్ రేటింగ్ పొందిన మొదటి మిడ్ సైజ్ సెడాన్‌లు ఈ స్లావియా & వర్టస్ కావడం గమనార్హం.
(ఇదీ చదవండి: క్రెడిట్ కార్డ్ నుంచి బ్యాంక్ అకౌంట్‌కి ట్రాన్సాక్షన్ - సులభంగా ఇలా!)
స్లావియా, వర్టస్ రెండూ కూడా అడల్ట్ ఆక్యుపెంట్ ప్రొటెక్షన్ టెస్ట్‌లలో మొత్తం 34 పాయింట్లకు గానూ 29.71 పాయింట్లు సాధించాయి. అదే సమయంలో చైల్డ్ ఆక్యుపెంట్ ప్రొటెక్షన్ టెస్ట్‌లలో 49 పాయింట్లకు 42 పాయింట్లు పొంది మొత్తం మీద సేఫ్టీలో 5 స్టార్ రేటింగ్ సొంతం చేసుకున్నాయి.
కొత్త గ్లోబల్ NCAP టెస్టింగ్ ప్రోటోకాల్స్ ప్రకారం.. అడల్ట్ ఆక్యుపెంట్ & చైల్డ్ ఆక్యుపెంట్ టెస్ట్‌లలో మాత్రమే కాకుండా ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, పెడిస్ట్రియన్ ప్రొటక్షన్ (పాదచారుల రక్షణ), సీట్ బెల్ట్ రిమైండర్ వంటి వాటిలో కూడా ఉత్తమ స్కోరింగ్ పొందినప్పుడే ఆ వాహనానికి 5 స్టార్ రేటింగ్ లభిస్తుంది. అన్ని పరీక్షల్లో మంచి స్కోరింగ్ సాధించిన స్లావియా, వర్టస్ రెండూ అత్యంత సురక్షితమైన కార్ల జాబితాలో చేరటం నిజంగా హర్షించదగ్గ విషయం.
Comments
Please login to add a commentAdd a comment