Global NCAP
-
కొత్త కారు కొంటున్నారా.. ఈ రూల్స్ తెలిస్తే ఎగిరి గంతేస్తారు!
Bharat NCAP New Rules: ఆధునిక కాలంలో కార్లను కొనే చాలామంది వినియోగదారులు ఎక్కువ సేఫ్టీ ఫీచర్స్ ఉన్న వాహనాలకే అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని కంపెనీలు కూడా తమ ఉత్పత్తులను మరింత పటిష్టంగా రూపొందిస్తున్నాయి. ఈ నేపథ్యంలో భాగంగానే 2023 అక్టోబర్ 01 నుంచి మన దేశంలో కొత్త రూల్స్ అమలులోకి రానున్నాయి. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. భారతదేశం కోసం ప్రత్యేకంగా రూపొందించిన 'భారత్ ఎన్సీఏపీ' (Bharat NCAP) అక్టోబర్ 01 నుంచి అమలులోకి రానుంది. మన దేశంలో తయారైన వాహనాలు మరింత భద్రతను కలిగి ఉండాలనే ఉద్దేశ్యంతో ఈ క్రాష్ టెస్ట్ నిర్వహించనున్నారు. దీనికి ఇప్పటికే దిగ్గజ ఆటోమొబైల్స్ సంస్థలు కూడా తమ అంగీకారం తెలిపాయి. భారత్ ఎన్సీఏపీ.. నిజానికి భారత్ ఎన్సీఏపీ అంటే 'న్యూ కార్ అసెస్మెంట్ ప్రోగ్రామ్'. ఇది భారతదేశంలోని వాహనాలను మరింత పటిష్టం చేయడానికి దోహదపడుతుంది. మన దేశంలో తయారైన వాహనాలు మాత్రమే కాకుండా ఇతర దేశాల నుంచి దిగుమతైన వాహనాలకు కూడా తప్పనిసరిగా భారత్ ఎన్సీఏపీ సర్టిఫికెట్ ఉండాలి. (ఇదీ చదవండి: వందల కోట్లు వదిలి.. సన్యాసిగా మారిన బిలియనీర్!) భారత్ ఎన్సీఏపీ క్రాష్ టెస్ట్ నిబంధనలను ప్రభుత్వం ఇప్పటికే ఫిక్స్ చేసింది. దీని ప్రకారం వాహనం డిజైన్, అడల్ట్ చైల్డ్ సేఫ్టీ, సేఫ్టీ అసిస్ట్ టెక్నాలజీ వంటివి తప్పకుండా కలిగి ఉండాలి. ఇప్పటికే అమలులో ఉన్న గ్లోబల్ ఎన్సీఏపీ అండ్ యూరో ఎన్సీఏపీ రెండు కూడా ఈ నియమాలనే పాటిస్తున్నాయి. (ఇదీ చదవండి: రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్, రూ.20కే కడుపు నిండా భోజనం!) ప్రస్తుతం ఉన్న గ్లోబల్ ఎన్సీఏపీ వాహనాలకు క్రాష్ టెస్ట్ నిర్వహించి 1 నుంచి 5 స్టార్ రేటింగ్ అనేది అందిస్తుంది. భారత్ ఎన్సీఏపీ కూడా ఇదే విధంగా ఉండే అవకాశం ఉంటుంది. ఈ విధానంలో నిర్వహణ సంస్థ ఏదైనా షోరూమ్ నుంచి తమకు నచ్చిన కారుని సెలెక్ట్ చేసుకుని టెస్ట్ చేసే అవకాశం ఉంది. ఇందులో పెట్రోల్, డీజిల్, CNG, ఎలక్ట్రిక్ వాహనాలు ఉంటాయి. మొత్తం మీద రానున్న రోజుల్లో భరతదేశంలో తయారయ్యే అన్ని కార్లు ప్రయాణికుల భద్రతకు పెద్ద పీట వేస్తాయని తెలుస్తోంది. -
ప్రమాదంలో ప్రాణాలు కాపాడే సేఫెస్ట్ కార్లు (ఫోటోలు)
-
సేఫెస్ట్ కార్ల జాబితాలో ఆ రెండు కార్లు
భారతీయ మార్కెట్లో కార్లను కొనుగోలు చేసే కస్టమర్లు మంచి డిజైన్, లేటెస్ట్ ఫీచర్స్ వంటి వాటితో సేఫ్టీ ఫీచర్స్ ఎక్కువగా ఉన్న కార్లను సెలక్ట్ చేసుకుంటారు. దీనిని దృష్టిలో ఉంచుకుని కార్ల తయారీ సంస్థలు కూడా తమ ఉత్పత్తులలో అత్యధిక సేఫ్టీ ఫీచర్స్ అందించడానికి ప్రయత్నిస్తున్నాయి. ఇప్పటికే సేఫ్టీలో 5 స్టార్ రేటింగ్ కలిగిన కార్లు చాలానే ఉన్నప్పటికీ తాజాగా ఈ జాబితాలో మరో రెండు కార్లు చేరాయి. ఈ కార్లను గురించి మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.. దేశీయ విఫణిలో అత్యధిక ప్రజాదరణ పొందిన స్కోడా స్లావియా, ఫోక్స్‌వ్యాగన్ వర్టస్ రెండూ గ్లోబల్ ఎన్‌సిఏపి టెస్ట్‌లో 5 స్టార్ రేటింగ్ కైవసం చేసుకుని సురక్షితమైన కార్ల జాబితాలో చోటు సంపాదించుకున్నాయి. GNCAP కొత్త టెస్టింగ్ ప్రోటోకాల్ క్రింద 5-స్టార్ రేటింగ్ పొందిన మొదటి మిడ్ సైజ్ సెడాన్లు ఈ స్లావియా & వర్టస్ కావడం గమనార్హం. (ఇదీ చదవండి: క్రెడిట్ కార్డ్ నుంచి బ్యాంక్ అకౌంట్‌కి ట్రాన్సాక్షన్ - సులభంగా ఇలా!) స్లావియా, వర్టస్ రెండూ కూడా అడల్ట్ ఆక్యుపెంట్ ప్రొటెక్షన్ టెస్ట్‌లలో మొత్తం 34 పాయింట్లకు గానూ 29.71 పాయింట్లు సాధించాయి. అదే సమయంలో చైల్డ్ ఆక్యుపెంట్ ప్రొటెక్షన్ టెస్ట్‌లలో 49 పాయింట్లకు 42 పాయింట్లు పొంది మొత్తం మీద సేఫ్టీలో 5 స్టార్ రేటింగ్ సొంతం చేసుకున్నాయి. కొత్త గ్లోబల్ NCAP టెస్టింగ్ ప్రోటోకాల్స్ ప్రకారం.. అడల్ట్ ఆక్యుపెంట్ & చైల్డ్ ఆక్యుపెంట్ టెస్ట్‌లలో మాత్రమే కాకుండా ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, పెడిస్ట్రియన్ ప్రొటక్షన్ (పాదచారుల రక్షణ), సీట్ బెల్ట్ రిమైండర్ వంటి వాటిలో కూడా ఉత్తమ స్కోరింగ్ పొందినప్పుడే ఆ వాహనానికి 5 స్టార్ రేటింగ్ లభిస్తుంది. అన్ని పరీక్షల్లో మంచి స్కోరింగ్ సాధించిన స్లావియా, వర్టస్ రెండూ అత్యంత సురక్షితమైన కార్ల జాబితాలో చేరటం నిజంగా హర్షించదగ్గ విషయం. -
2021లో వచ్చిన సేఫెస్ట్ కార్స్ ఇవేనండోయ్..!
2021లో దిగ్గజ ఆటోమొబైల్ కంపెనీలు పదుల సంఖ్యలో కొత్త కార్లను రిలీజ్ చేశాయి. వాటిలో కొన్ని మాత్రమే అత్యంత భద్రత కల్గిన కార్లుగా నిలిచాయి. ఒక కారు ఆయా వాహనదారుడుకి ఇచ్చే భద్రతను గ్లోబల్ ఎన్సీఏపీ (న్యూకార్ అసెస్మెంట్ ప్రోగ్రామ్) నిర్ణయిస్తోంది. పలు కార్లను రకరకాల పరీక్షలను నిర్వహించి, ప్రమాద సమయంలో ఆయా కారులో ప్రయాణించే వ్యక్తుల భద్రతను గురించి ఎన్‌సీఎపీ రేటింగ్స్‌ను ఇస్తోంది. 2014 నుంచి ఫోక్స్‌వ్యాగన్ పోలో, మారుతి సుజుకీ బ్రెజ్జా, మహీంద్రా ఎక్స్‌యూవీ300, టయోటా ఎటియోస్, టాటా నెక్సాన్ వంటి కార్లు ఎన్‌సీఎపీ రేటింగ్‌లో 4-5 రేటింగ్ స్టార్లను పొందాయి. ఈ ఏడాదిలో వచ్చిన కార్లలో కొన్ని మాత్రమే ఎక్కువ ఎన్సీఏపీ రేటింగ్‌ను పొందాయి. 1. టాటా పంచ్-మైక్రో ఎస్యూవీ భారత ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ లాంచ్ చేసిన ‘టాటా పంచ్-మైక్రో ఎస్యూవీ’ ఎన్‌సీఎపీ టెస్ట్‌లో ఎక్కువ రేటింగ్‌ను సాధించింది. అడల్ట్ ఆక్యుపెంట్ ప్రొటెక్షన్‌లో టాటా పంచ్ 17.00గాను 16.45 స్కోర్‌ను; చిల్డ్రన్ ఆక్యుపెంట్ ప్రొటెక్షన్‌లో 49.00 గాను 40.89 స్కోర్‌ను సాధించింది. ఈ ఎస్యూవీను సుమారు 64km/hr వేగంతో పరీక్షించారు. ఓవరాల్ చూసుకుంటే 5 స్టార్స్ అడల్ట్ ప్రోటెక్షన్లో, 4 స్టార్ చిల్డ్రన్ ప్రొటెక్షన్‌లో రేటింగ్‌ను సాధించింది. 2. మహీంద్రా ఎక్స్‌యూవీ700 స్వల్ప తేడాతో టాటా పంచ్ తరువాత మహీంద్రా ఎక్స్‌యూవీ 700 సేఫెస్ట్ కారుగా నిలిచింది. చిల్డ్రన్ అక్యుపెంట్ ప్రొటెక్షన్‌లో 49.00గాను 41.66 స్కోర్‌ను, అడల్ట్ ఆక్యుపెంట్ ప్రొటెక్షన్‌లో 17.00 గాను 16.03 సాధించింది. ఓవరాల్ చూసుకుంటే 5 స్టార్స్‌కు సుమారుగా 5 స్టార్ రేటింగ్‌ను ఇది సాధించింది. 3. టాటా టిగోర్ ఈవీ ఎలక్ట్రిక్ వాహనాల విషయానికి వస్తే, టాటా టిగోర్ ఈవీ గ్లోబల్ ఎన్‌సీఎపీ ఎక్కువ స్కోర్‌ను సాధించింది. అడల్ట్ అక్యుపెంట్ ప్రొటెక్షన్‌లో17.00 గాను 12.00 స్కోర్‌ను పొందగా, పిల్లల భద్రత విషయంలో 49.00 గాను 37.24 సాధించింది. ఓవరాల్ చూసుకుంటే 5 స్టార్స్‌కు 4 స్టార్ రేటింగ్‌ను ఇది సాధించింది. ఇక్కడ హై ఎండ్ లగ్జరీ కార్ల గురించి చర్చించలేదు. ఎందుకంటే #SaferCarsForIndia ప్రచారంలో భాగంగా గ్లోబల్ ఎన్సీఏపీ ఆయా లగ్జరీ కార్లను పరీక్షించలేదు. చదవండి: పేరుకు సెకండ్ హ్యాండ్ కార్లే..! హాట్‌కేకుల్లా అమ్ముడైన బ్రాండ్స్ ఇవే..! -
రక్షణలో రారాజు మహీంద్రా ఎక్స్యూవి700
ప్రముఖ దేశీయ ఆటోమొబైల్ తయారీ దిగ్గజం మహీంద్రా & మహీంద్రా ఇతర కంపెనీలకు గట్టి పోటీ ఇచ్చేందుకు ఎక్స్‌యూవీ700 కారును విడుదల చేసిన సంగతి మనకు తెలిసిందే. అయితే, ఈ మహీంద్రా ఎక్స్యూవి700 పిల్లలకు, పెద్దలకు సురక్షితం అని గ్లోబల్ ఎన్సీఏపీ తెలిపింది. గ్లోబల్ ఎన్సీఏపీ #SaferCarsForIndia పేరుతో నిర్వహించిన క్రాష్ టెస్ట్‌లో ఎక్స్‌యూవీ700 5 స్టార్ సేఫ్టీ రేటింగ్‌ను సంపాదించింది. పిల్లల రక్షణకు కారు సంబంధించి 4 స్టార్ సేఫ్టీ రేటింగ్‌ను పొందింది. ఇటీవల విడుదల చేసిన మహీంద్రా ఎక్స్యూవి700 రెండు ఎయిర్‌బ్యాగ్‌లు, ఏబీఎస్ బ్రేక్‌లతో అత్యంత సురక్షితమైన కారుగా నిలిచింది. మహీంద్రా ఎక్స్యూవి700లో సైడ్-బాడీ ఎయిర్‌బ్యాగ్‌లు, సైడ్ హెడ్ కర్టెన్ ఎయిర్‌బ్యాగ్‌లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ ఫీచర్స్ ఉన్నాయి .గ్లోబల్ ఎన్సీఏపీ సెక్రటరీ-జనరల్ అలెజాండ్రో ఫురాస్ మాట్లాడుతూ.. “పెద్దల రక్షణకు సంబంధించి మహీంద్రా టాప్ స్కోర్‌తో ఒక ప్రధాన మైలురాయిని సాధించింది. అలాగే, అటానమస్ ఎమర్జెన్సీ బ్రేకింగ్(AEB) వ్యవస్థ గల మొదటి భారతీయ కంపెనీగా మహీంద్రా నిలిచింది. ఈ లైఫ్-సేవింగ్ టెక్నాలజీని తీసుకొని రావడం గొప్ప విషయం" అని ఆయన అన్నారు. The adrenaline rush reaches an all new high with the #XUV700 being ranked as India’s Safest Vehicle. Highest Combined Safety Score of 57.69/66 & Highest Child Safety Score of 41.65/49, setting a 5-star Global NCAP rating. https://t.co/YzSD0plClP#SafersCarsForIndia @GlobalNCAP pic.twitter.com/8PoKHyA55O — MahindraXUV700 (@MahindraXUV700) November 10, 2021 ప్రీ బుకింగ్స్‌ను పరంగా కూడా ఈ కారు రికార్డు సాధించింది. ప్రీ బుకింగ్స్ ప్రారంభించిన 14రోజుల్లో 65,000 వెహికల్స్ బుకింగ్స్ జరిగినట్లు దేశీ ఆటోమొబైల్ దిగ్గజం మహీంద్రా సంస్థ తెలిపింది. బుకింగ్స్ ప్రారంభమైన తొలిరోజు అక్టోబర్ 7, అక్టోబర్ 8 రోజుల్లో మొత్తం 50వేల వెహికల్స్ బుకింగ్ జరిగినట్లు కంపెనీ ప్రతినిధులు వ్యక్తం చేశారు. చెన్నైలో ప్రూవింగ్ ట్రాక్ (ఎమ్‌ఎస్‌పీటీ) లో మహీంద్రా ఎక్స్‌యూవీ700 సరికొత్త రికార్డ్లని క్రియేట్ నమోదు చేసింది. ప్రూవింగ్ ట్రాక్‌లో జరిగిన 24 గంటల స్పీడ్ ఎండ్యూరెన్స్ ఛాలెంజ్‌లో మహీంద్రా ఎక్స్‌యూవీ ఒక్కొక్కటి సుమారు 4000 కి.మీ. మొత్తంగా 17000 కిలోమీటర్ల మేర ప్రయాణించాయి. గతంలో ఈ రికార్డు 3161 కిలోమీటర్లతో ఉండేది. (చదవండి: అయ్యో ఎలన్ మస్క్.. ఎంత కష్టం వచ్చే!) -
దేశంలో అత్యంత సురక్షితమైన టాప్-10 కార్లు ఇవే!
దేశంలో కార్లు కొనుగోలు చేసే వారి సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతుంది. వినియోగదారుల అభిరుచులకు తగ్గట్టు కంపెనీలు కూడా కార్లను మార్కెట్లోకి తీసుకొని వస్తున్నాయి. 10 లక్షల రూపాయల ధరలో మంచి కార్లు అందుబాటులో ఉండటం, మధ్యతరగతి ఆదాయం పెరగడం చేత కార్ల అమ్మకాలు పెరుగుతున్నాయి. అయితే, చాలా మంది వినియోగదారులు కారు కొనేముందు ఆ ఫీచర్ ఉందా? ఈ ఫీచర్ ఉందా? అని అడుగుతున్నారే కానీ, అన్నిటికంటే ముఖ్యమైన ఫీచర్ భద్రత పరంగా ఈ కారు ఎంత రేటింగ్ పొందింది అనేది ఎవరు తెలుసుకోవడం లేదు. ఇంకొంత మంది రూ.2 లక్షలు తక్కువకు వస్తుంది కదా అని తక్కువ సేఫ్టీ రేటింగ్ ఉన్న కార్లను కొంటున్నారు. కానీ, అన్నింటికంటే సేఫ్టీ రెంటింగ్ చాలా ముఖ్యం. గ్లోబల్ కార్ సేఫ్టీ ఏజెన్సీ గ్లోబల్ ఎన్సీఏపీ గత కొన్ని ఏళ్లుగా భారతీయ వాహనాలకు రేటింగ్ ఇస్తూ వచ్చింది. కొద్ది రోజుల క్రితం రాబోయే టాటా పంచ్ ఎస్యువి కారుకు భద్రతా పరీక్ష నిర్వహించిన తర్వాత భద్రతా సంస్థ భారతదేశంలో ఉత్తమమైన రేటింగ్ పొందిన కార్ల జాబితాను వెల్లడించింది. ఈ జాబితాలో దేశీయ ఆటోమేకర్లు టాటా మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రా పై చేయి సాధించాయి. ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉన్న 10 కార్లు ఏవి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం.. (చదవండి: కష్టాల్లో ఉన్నాం కాపాడమంటూ భారత్‌ను కోరిన శ్రీలంక) 1. టాటా పంచ్ యూకేకి చెందిన ఓ స్వచ్ఛంద సంస్థ న్యూ కార్ అసెస్మెంట్ ప్రోగ్రాం(ఎన్సీఏపీ)ను నిర్వహిస్తుంది. మనదేశంలో 'సేఫర్ కార్స్ ఫర్ ఇండియా' పేరుతో పలు కార్లపై టెస్టులు నిర్వహిస్తుంది. ఆ టెస్టుల్లో కార్ల సేఫ్టీని బట్టి స్టార్ రేటింగ్‌ను అందిస్తుంది. తాజాగా నిర్వహించిన సేఫర్ కార్స్ క్యాంపెయినింగ్లో టాటా పంచ్ కారు 5 స్టార్ రేటింగ్((16.453), పిల్లల సేప్టీ విషయంలో 4 స్టార్((40.891) రేటింగ్ సాధించింది. 2. మహీంద్రా ఎక్స్యువి300 గ్లోబల్ ఎన్సీఏపీ జాబితాలో మొదటి ఐదు స్థానాల్లో తన స్థానాన్ని నిలుపుకున్న మహీంద్రా ఎక్స్యువి300, అత్యున్నత స్థాయి భద్రతా ప్రమాణాలను పాటించినందుకు సేఫ్టీ ఏజెన్సీ మొట్టమొదటి 'సేఫర్ ఛాయిస్' అవార్డును కూడా అందుకుంది. ఇది వయోజనుల రక్షణ కోసం 5 స్టార్ భద్రతా రేటింగ్, పిల్లల రక్షణ కోసం 4 స్టార్ రేటింగ్ పొందింది. 3. టాటా ఆల్ట్రోజ్ టాటా మోటార్స్ కంపెనీకు చెందిన ప్రముఖ ప్రీమియం హ్యాచ్ బ్యాక్ కారు క్రాష్ టెస్ట్ సమయంలో గ్లోబల్ ఎన్సీఏపీ ద్వారా వయోజనుల రక్షణ కోసం 5 స్టార్ రేటింగ్, పిల్లల సేప్టీ విషయంలో 3 స్టార్ రేటింగ్ సాధించింది. (చదవండి: సేఫ్టీలో టాటా మోటార్స్ కార్లకు తిరుగులేదు) 4. టాటా నెక్సన్ టాటా మోటార్స్ కంపెనీకు చెందిన నెక్సన్ వయోజనుల రక్షణ కోసం 5 స్టార్ రేటింగ్, పిల్లల సేప్టీ విషయంలో 3 స్టార్ రేటింగ్ సాధించింది. నెక్సన్ కారులో డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్ బ్యాగులు, ఫ్రంటల్ డబుల్ ప్రెటెన్షన్ లు, ఏబిఎస్ బ్రేకులు వంటివి ఉన్నాయి. 5. మహీంద్రా థార్ మహీంద్రా కంపెనీకు చెందిన ఆఫ్ రోడర్ ఎస్యువి వయోజనులు, పిల్లల సేఫ్టీ విషయంలో 4 స్టార్ రేటింగ్ పొందింది. భద్రతా రేటింగ్ పరంగా థార్ ఎస్యువి జాబితాలో ఐదువ స్థానంలో ఉంది.(చదవండి: క్రిప్టోకరెన్సీపై బిలియనీర్ ఆసక్తికర వ్యాఖ్యలు..!) 6. టాటా టిగోర్ ఈవీ గ్లోబల్ ఎన్సీఏపీ మొట్టమొదటిసారి పరీక్షించిన ఎలక్ట్రిక్ వాహనం(ఈవీ)గా టిగోర్ ఈవీ నిలిచింది. వయోజనులు, పిల్లల సేఫ్టీ విషయంలో టాటా టిగోర్ ఈవీ 4 స్టార్ రేటింగ్ పొందింది. దీనిలో రెండు ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి. ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్(ఈఎస్ సీ), సైడ్ ఇంపాక్ట్ ప్రొటెక్షన్, వేహికల్ లో అన్ని సీటింగ్ పొజిషన్లలో త్రీ పాయింట్ బెల్ట్ ఫీచర్స్ ఉన్నాయి. 7. టాటా టిగోర్ టాటా మోటార్స్ టిగోర్ కంబస్టివ్-ఇంజిన్ వెర్షన్ కారు వయోజనుల రక్షణ విషయంలో 4 స్టార్ రేటింగ్, పిల్లల రక్షణ విషయంలో 3 స్టార్ రేటింగ్ సాధించింది. 8. టాటా టియాగో మరో ప్రముఖ హ్యాచ్ బ్యాక్ టియాగో భద్రతా ప్రమాణాల పరంగా టాటా టిగోర్ తో సమానంగా ఉంది. టియాగో కూడా వయోజనుల రక్షణ విషయంలో 4 స్టార్ రేటింగ్, పిల్లల రక్షణ విషయంలో 3 స్టార్ రేటింగ్ సాధించింది. దీనిలో కూడా రెండు ఎయిర్ బ్యాగులు ఉన్నాయి. 9. వోక్స్ వ్యాగన్ పోలో వోక్స్ వ్యాగన్ ఇండియాకు చెందిన హ్యాచ్ బ్యాక్ 2014లో గ్లోబల్ ఎన్సీఏపీ సేఫ్టీ క్రాష్ టెస్ట్ చేసినప్పుడు ఇది వయోజనుల రక్షణ విషయంలో 4 స్టార్ రేటింగ్, పిల్లల రక్షణ విషయంలో 3 స్టార్ రేటింగ్ సాధించింది. డ్యాష్ బోర్డ్ లోని ప్రమాదకరమైన నిర్మాణాల కారణంగా ముందు ప్రయాణీకుల మోకాళ్లు ప్రమాదానికి గురవుతాయని భద్రతా నివేదిక పేర్కొంది. (చదవండి: ఆపిల్..గూగుల్..శాంసంగ్..! ఎవరు తగ్గేదెలే...!) 10. రెనాల్ట్ ట్రైబర్ ఎమ్‌పివి రెనాల్ట్ ఇండియా ఫ్లాగ్ షిప్ ట్రైబర్ ఎమ్‌పివి వయోజనుల రక్షణ విషయంలో 4 స్టార్ రేటింగ్, పిల్లల రక్షణ విషయంలో 3 స్టార్ రేటింగ్ సాధించిన తర్వాత ఈ ఏడాది జూన్ లో సురక్షితమైన కార్ల జాబితాలోకి ప్రవేశించింది. -
సేఫ్టీలో టాటా మోటార్స్ కార్లకు తిరుగులేదు
టాటా మోటార్స్ తన కొత్త మైక్రో ఎస్యువి టాటా పంచ్ కారును ఇటీవల భారతీయ మార్కెట్లో ఆవిష్కరించన సంగతి తెలిసిందే. ఇటీవల గ్లోబల్ కార్ సేఫ్టీ రేటింగ్ ఏజెన్సీ గ్లోబల్ ఎన్సీఏపీ కొత్త టాటా పంచ్ ఎస్యువి సేఫ్టీ రేటింగ్ పరంగా 5-స్టార్ రేటింగ్ పొందినట్లు తెలిపింది. అలాగే, పిల్లల రక్షణ విషయానికి వస్తే 4 స్టార్ రేటింగ్ పొందినట్లు పేర్కొంది. కంపెనీ ఈ విషయాన్ని తన అధికారిక వెబ్సైట్లో షేర్ చేసింది. టాటా మోటార్స్ ఇప్పటికే తన టాటా నెక్సాన్, హారియర్, సఫారీ, ఆల్ట్రోజ్ కూడా సేఫ్టీ విషయంలో 5 స్టార్ రేటింగ్ పొందాయి.(చదవండి: ఫేస్‌బుక్‌కు మరో ముప్పు..జూకర్ ఏం చేస్తారో?) డిసెంబర్ 2018లో నెక్సాన్, జనవరి 2020లో ఆల్ట్రోజ్ తర్వాత ఈ రేటింగ్ అందుకున్న టాటా మోటార్స్ మూడో కారు ఈ పంచ్. అంతే కాకుండా కంపెనీ టిగోర్, టియాగో 4 స్టార్ సేఫ్టీ రేటింగ్ పొందాయి. ఈ కొత్త మైక్రో ఎస్యువి ధరను అక్టోబర్ 18న జరిగే కార్యక్రమంలో ఆవిష్కరించనున్నారు. టాటా మోటార్స్ ఎజిల్ లైట్ ఫ్లెక్సిబుల్ అడ్వాన్స్డ్ (ఆల్ఫా) ఆర్కిటెక్చర్ పై టాటా పంచ్ నిర్మించారు. ఇది చూడాటానికి టాటా ఆల్ట్రోజ్ లాగా కనిపిస్తుంది. ఈ పంచ్ అద్భుతమైన పర్ఫామెన్స్ అందింస్తుంది. దీని కోసం 1.2-లీటర్, త్రీ-సిలిండర్, రివోట్రాన్ పెట్రోల్ ఇంజిన్‌ను డైనా-ప్రో టెక్నాలజీతో తీసుకొచ్చారు. ఈ ఇంజన్ 6,000 ఆర్పీఎమ్ వద్ద 85 బిహెచ్పీ పవర్, 3,300 ఆర్‌పిఎమ్ వద్ద 113 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇంజిన్ 5-స్పీడ్ మాన్యువల్ మరియు ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్సన్స్ తో వస్తుంది. -
ఆ 5 మోడళ్ల కార్లు పనికిరావా?
♦ ఈ కార్లకు జీరో రేటింగ్ ఇచ్చిన గ్లోబల్ ఎన్సీఏపీ ♦ భారత ప్రమాణాలకనుగుణంగానే ♦ కార్ల తయారీ: వాహన కంపెనీలు ♦ గ్లోబల్ ఎన్‌సీఏపీవి సొంత ప్రమాణాలు న్యూఢిల్లీ: భారత్‌లో విక్రయమవుతున్న ఐదు కార్లలో ప్రయాణికుల భద్రతా ప్రమాణాలు తగిన విధంగా లేవని గ్లోబల్ ఎన్సీఏపీ (న్యూ కార్ అసెస్మెంట్ ప్రోగ్రామ్స్) వెల్లడించింది. మారుతీ సెలెరియో, ఈకో, రెనో క్విడ్, మహీంద్రా స్కార్పియో, హ్యుందాయ్ ఇయాన్... ఈ ఐదు కార్లు తమ క్రాష్ టెస్టుల్లో విఫలమయ్యాయని పేర్కొంది. భారత ప్రభుత్వ భద్రతా నియమ నిబంధనలకు అనుగుణంగానే కార్లను తయారు చేశామని మారుతీ, రెనో, హ్యుందాయ్ కంపెనీలు పేర్కొన్నాయి. గ్లోబల్ ఎన్సీఏపీ క్రాష్‌టెస్ట్‌లపై ఈ కంపెనీలతో పాటు సియామ్ కూడా సందేహాలు వ్యక్తం చేసింది. వివరాలు.. వాహన భద్రతకు సంబంధించి ఇంగ్లాండ్‌కు చెందిన గ్లోబల్ ఎన్సీఏపీ సంస్థ నిర్వహించిన క్రాష్ టెస్టుల్లో ఈ ఐదు కార్లకు జీరో రేటింగ్ లభించింది. తాజా క్రాష్ టెస్ట్ వివరాలను ఈ సంస్థ సెక్రటరీ జనరల్ డేవిడ్ వార్డ్ మంగళవారం వెల్లడించారు. ఎయిర్ బ్యాగ్‌లతో కూడిన మోడల్‌తో సహా మొత్తం మూడు వేరియంట్ల రెనో క్విడ్ కార్లను క్రాష్ టెస్ట్‌లు చేశామని, అన్ని కార్లకు జీరో రేటింగే వచ్చిందని డేవిడ్ వివరించారు. రెనో కూడా తగిన భద్రత లేని కార్లను తయారు చేయడం ఆశ్చర్యకరమని పేర్కొన్నారు. భారత నియమ నిబంధనల ప్రకారమే.. భద్రత నియమ నిబంధనలు కట్టుదిట్టంగా ఉండే యూరప్, అమెరికాల్లోనే గంటకు 56 కిమీ. వేగంతో స్పీడ్ టెస్ట్‌లు నిర్వహిస్తారని, కానీ గ్లోబల్ ఎన్సీఏపీ గంటలకు 64 కిమీ. వేగంతో ఈ స్పీడ్ టెస్ట్‌లు నిర్వహించిందని పరిశ్రమవర్గాలు పేర్కొన్నాయి. గ్లోబల్ ఎన్సీఏపీ ఒక ప్రైవేట్ సంస్థ అని, తన సొంత ప్రమాణాల మేరకు ఈ సంస్థ కార్లకు రేటింగ్‌లు ఇస్తుందని సియామ్ డెరైక్టర్ జనరల్ విష్ణుమాధుర్ చెప్పారు. భారత్‌లో సగటు వేగం అంత కంటే తక్కువని పేర్కొన్నారు. తమ కార్లన్నీ భారత నియమనిబంధనలకు అనుగుణంగానే ఉన్నాయని, ఒక రకంగా అంతకంటే మంచి ప్రమాణాలతోనే ఉన్నాయని మారుతి వెల్లడించింది. భారత ప్రభుత్వ భద్రతా ప్రమాణాల ప్రకారమే కార్లను తయారు చేశామని రెనో కంపెనీ స్పందించింది.