టాటా మోటార్స్ తన కొత్త మైక్రో ఎస్‌యువి టాటా పంచ్ కారును ఇటీవల భారతీయ మార్కెట్లో ఆవిష్కరించన సంగతి తెలిసిందే. ఇటీవల గ్లోబల్ కార్ సేఫ్టీ రేటింగ్ ఏజెన్సీ గ్లోబల్ ఎన్‌సీఏపీ కొత్త టాటా పంచ్ ఎస్‌యువి సేఫ్టీ రేటింగ్ పరంగా 5-స్టార్ రేటింగ్ పొందినట్లు తెలిపింది. అలాగే, పిల్లల రక్షణ విషయానికి వస్తే 4 స్టార్ రేటింగ్ పొందినట్లు పేర్కొంది. కంపెనీ ఈ విషయాన్ని తన అధికారిక వెబ్‌సైట్‌లో షేర్ చేసింది. టాటా మోటార్స్ ఇప్పటికే తన టాటా నెక్సాన్, హారియర్, సఫారీ, ఆల్ట్రోజ్ కూడా సేఫ్టీ విషయంలో 5 స్టార్ రేటింగ్ పొందాయి.(చదవండి: ఫేస్‌బుక్‌కు మరో ముప్పు..జూకర్ ఏం చేస్తారో?)
డిసెంబర్ 2018లో నెక్సాన్, జనవరి 2020లో ఆల్ట్రోజ్ తర్వాత ఈ రేటింగ్ అందుకున్న టాటా మోటార్స్ మూడో కారు ఈ పంచ్. అంతే కాకుండా కంపెనీ టిగోర్, టియాగో 4 స్టార్ సేఫ్టీ రేటింగ్ పొందాయి. ఈ కొత్త మైక్రో ఎస్‌యువి ధరను అక్టోబర్ 18న జరిగే కార్యక్రమంలో ఆవిష్కరించనున్నారు. టాటా మోటార్స్ ఎజిల్ లైట్ ఫ్లెక్సిబుల్ అడ్వాన్స్డ్ (ఆల్ఫా) ఆర్కిటెక్చర్ పై టాటా పంచ్ నిర్మించారు. ఇది చూడాటానికి టాటా ఆల్ట్రోజ్ లాగా కనిపిస్తుంది. ఈ పంచ్ అద్భుతమైన పర్ఫామెన్స్ అందింస్తుంది. దీని కోసం 1.2-లీటర్, త్రీ-సిలిండర్, రివోట్రాన్ పెట్రోల్ ఇంజిన్‌ను డైనా-ప్రో టెక్నాలజీతో తీసుకొచ్చారు. ఈ ఇంజన్ 6,000 ఆర్‌పీఎమ్ వద్ద 85 బిహెచ్‌పీ పవర్, 3,300 ఆర్‌పిఎమ్ వద్ద 113 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇంజిన్ 5-స్పీడ్ మాన్యువల్ మరియు ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్సన్స్ తో వస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment