దేశంలో అత్యంత సురక్షితమైన టాప్-10 కార్లు ఇవే! | Top 10 Safest Cars in India As Rated By Global NCAP | Sakshi
Sakshi News home page

దేశంలో అత్యంత సురక్షితమైన టాప్-10 కార్లు ఇవే!

Published Mon, Oct 18 2021 6:10 PM | Last Updated on Tue, Oct 19 2021 9:46 AM

Top 10 Safest Cars in India As Rated By Global NCAP - Sakshi

దేశంలో కార్లు కొనుగోలు చేసే వారి సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతుంది. వినియోగదారుల అభిరుచులకు తగ్గట్టు కంపెనీలు కూడా కార్లను మార్కెట్లోకి తీసుకొని వస్తున్నాయి. 10 లక్షల రూపాయల ధరలో మంచి కార్లు అందుబాటులో ఉండటం, మధ్యతరగతి ఆదాయం పెరగడం చేత కార్ల అమ్మకాలు పెరుగుతున్నాయి. అయితే, చాలా మంది వినియోగదారులు కారు కొనేముందు ఆ ఫీచర్ ఉందా? ఈ ఫీచర్ ఉందా? అని అడుగుతున్నారే కానీ, అన్నిటికంటే ముఖ్యమైన ఫీచర్ భద్రత పరంగా ఈ కారు ఎంత రేటింగ్ పొందింది అనేది ఎవరు తెలుసుకోవడం లేదు.

ఇంకొంత మంది రూ.2 లక్షలు తక్కువకు వస్తుంది కదా అని తక్కువ సేఫ్టీ రేటింగ్ ఉన్న కార్లను కొంటున్నారు. కానీ, అన్నింటికంటే సేఫ్టీ రెంటింగ్ చాలా ముఖ్యం. గ్లోబల్ కార్ సేఫ్టీ ఏజెన్సీ గ్లోబల్ ఎన్‌సీఏపీ గత కొన్ని ఏళ్లుగా భారతీయ వాహనాలకు రేటింగ్ ఇస్తూ వచ్చింది. కొద్ది రోజుల క్రితం రాబోయే టాటా పంచ్ ఎస్‌యువి కారుకు భద్రతా పరీక్ష నిర్వహించిన తర్వాత భద్రతా సంస్థ భారతదేశంలో ఉత్తమమైన రేటింగ్ పొందిన కార్ల జాబితాను వెల్లడించింది. ఈ జాబితాలో దేశీయ ఆటోమేకర్లు టాటా మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రా పై చేయి సాధించాయి. ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉన్న 10 కార్లు ఏవి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం..

(చదవండి: కష్టాల్లో ఉన్నాం కాపాడమంటూ భారత్​ను కోరిన శ్రీలంక)


 
1. టాటా పంచ్
యూకేకి చెందిన ఓ స్వచ్ఛంద సంస్థ న్యూ కార్‌ అసెస్‌మెంట్‌ ప్రోగ్రాం(ఎన్‌సీఏపీ)ను నిర్వహిస్తుంది. మనదేశంలో 'సేఫర్‌ కార్స్‌ ఫర్‌ ఇండియా' పేరుతో పలు కార్లపై టెస్టులు నిర్వహిస్తుంది. ఆ టెస్టుల్లో కార్ల సేఫ్టీని బట్టి  స్టార్‌ రేటింగ్‌ను అందిస్తుంది. తాజాగా నిర్వహించిన సేఫర్‌ కార్స్‌ క్యాంపెయినింగ్‌లో టాటా పంచ్‌ కారు 5 స్టార్‌ రేటింగ్‌((16.453), పిల్లల సేప్టీ విషయంలో 4 స్టార్((40.891) రేటింగ్ సాధించింది. 

2. మహీంద్రా ఎక్స్‌యువి300
గ్లోబల్ ఎన్‌సీఏపీ జాబితాలో మొదటి ఐదు స్థానాల్లో తన స్థానాన్ని నిలుపుకున్న మహీంద్రా ఎక్స్‌యువి300, అత్యున్నత స్థాయి భద్రతా ప్రమాణాలను పాటించినందుకు సేఫ్టీ ఏజెన్సీ మొట్టమొదటి 'సేఫర్ ఛాయిస్' అవార్డును కూడా అందుకుంది. ఇది వయోజనుల రక్షణ కోసం 5 స్టార్‌ భద్రతా రేటింగ్, పిల్లల రక్షణ కోసం 4 స్టార్ రేటింగ్ పొందింది. 

3. టాటా ఆల్ట్రోజ్
టాటా మోటార్స్ కంపెనీకు చెందిన ప్రముఖ ప్రీమియం హ్యాచ్ బ్యాక్ కారు క్రాష్ టెస్ట్ సమయంలో గ్లోబల్ ఎన్‌సీఏపీ ద్వారా వయోజనుల రక్షణ కోసం 5 స్టార్ రేటింగ్, పిల్లల సేప్టీ విషయంలో 3 స్టార్ రేటింగ్ సాధించింది. (చదవండి: సేఫ్టీలో టాటా మోటార్స్ కార్లకు తిరుగులేదు)

4. టాటా నెక్సన్
టాటా మోటార్స్ కంపెనీకు చెందిన నెక్సన్ వయోజనుల రక్షణ కోసం 5 స్టార్ రేటింగ్, పిల్లల సేప్టీ విషయంలో 3 స్టార్ రేటింగ్ సాధించింది. నెక్సన్ కారులో డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్ బ్యాగులు, ఫ్రంటల్ డబుల్ ప్రెటెన్షన్ లు, ఏబిఎస్ బ్రేకులు వంటివి ఉన్నాయి.

5. మహీంద్రా థార్
మహీంద్రా కంపెనీకు చెందిన ఆఫ్ రోడర్ ఎస్‌యువి వయోజనులు, పిల్లల సేఫ్టీ విషయంలో 4 స్టార్ రేటింగ్ పొందింది. భద్రతా రేటింగ్ పరంగా థార్ ఎస్‌యువి జాబితాలో ఐదువ స్థానంలో ఉంది.(చదవండి: క్రిప్టోకరెన్సీపై బిలియనీర్‌ ఆసక్తికర వ్యాఖ్యలు..!)

6. టాటా టిగోర్ ఈవీ
గ్లోబల్ ఎన్‌సీఏపీ మొట్టమొదటిసారి పరీక్షించిన ఎలక్ట్రిక్ వాహనం(ఈవీ)గా టిగోర్ ఈవీ నిలిచింది. వయోజనులు, పిల్లల సేఫ్టీ విషయంలో టాటా టిగోర్ ఈవీ 4 స్టార్ రేటింగ్ పొందింది. దీనిలో రెండు ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి. ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్(ఈఎస్ సీ), సైడ్ ఇంపాక్ట్ ప్రొటెక్షన్, వేహికల్ లో అన్ని సీటింగ్ పొజిషన్లలో త్రీ పాయింట్ బెల్ట్ ఫీచర్స్ ఉన్నాయి.

7. టాటా టిగోర్
టాటా మోటార్స్ టిగోర్ కంబస్టివ్-ఇంజిన్ వెర్షన్ కారు వయోజనుల రక్షణ విషయంలో 4 స్టార్ రేటింగ్, పిల్లల రక్షణ విషయంలో 3 స్టార్ రేటింగ్ సాధించింది.


 
8. టాటా టియాగో
మరో ప్రముఖ హ్యాచ్ బ్యాక్ టియాగో భద్రతా ప్రమాణాల పరంగా టాటా టిగోర్ తో సమానంగా ఉంది. టియాగో కూడా వయోజనుల రక్షణ విషయంలో 4 స్టార్ రేటింగ్, పిల్లల రక్షణ విషయంలో 3 స్టార్ రేటింగ్ సాధించింది. దీనిలో కూడా రెండు ఎయిర్ బ్యాగులు ఉన్నాయి. 

9. వోక్స్ వ్యాగన్ పోలో
వోక్స్ వ్యాగన్ ఇండియాకు చెందిన హ్యాచ్ బ్యాక్ 2014లో గ్లోబల్ ఎన్‌సీఏపీ సేఫ్టీ క్రాష్ టెస్ట్ చేసినప్పుడు ఇది వయోజనుల రక్షణ విషయంలో 4 స్టార్ రేటింగ్, పిల్లల రక్షణ విషయంలో 3 స్టార్ రేటింగ్ సాధించింది. డ్యాష్ బోర్డ్ లోని ప్రమాదకరమైన నిర్మాణాల కారణంగా ముందు ప్రయాణీకుల మోకాళ్లు ప్రమాదానికి గురవుతాయని భద్రతా నివేదిక పేర్కొంది. (చదవండి: ఆపిల్‌..గూగుల్‌..శాంసంగ్‌..! ఎవరు తగ్గేదెలే...!)


10. రెనాల్ట్ ట్రైబర్ ఎమ్‌పివి

రెనాల్ట్ ఇండియా ఫ్లాగ్ షిప్ ట్రైబర్ ఎమ్‌పివి వయోజనుల రక్షణ విషయంలో 4 స్టార్ రేటింగ్, పిల్లల రక్షణ విషయంలో 3 స్టార్ రేటింగ్ సాధించిన తర్వాత ఈ ఏడాది జూన్ లో సురక్షితమైన కార్ల జాబితాలోకి ప్రవేశించింది.


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement