‘ఈవీ’ విషయంలో జట్టు కట్టిన మహీంద్రా, ఫోక్స్‌వ్యాగన్‌లు | Mahindra And Volkswagen tie up over Electric Vehicles | Sakshi
Sakshi News home page

‘ఈవీ’ విషయంలో జట్టు కట్టిన మహీంద్రా, ఫోక్స్‌వ్యాగన్‌లు

Published Thu, May 19 2022 11:46 AM | Last Updated on Thu, May 19 2022 11:55 AM

Mahindra And Volkswagen tie up over Electric Vehicles - Sakshi

ఎలక్ట్రిక్‌ కార్లకు సంబంధించి కీలక ఒప్పందం జరిగింది. దేశీ ఆటోమొబైల్‌ దిగ్గజ కంపెనీ మహీంద్రా అండ్‌ మహీంద్రా కీలక నిర్ణయం తీసుకుంది. ఎలక్ట్రిక్‌ కార్ల తయారీలో ఫోక్స్‌ వ్యాగన్‌ సహకారం తీసుకోవాలని నిర్ణయించింది. ఈ మేరకు ఇరు సం‍స్థల మధ్య ఒప్పందం కుదిరింది. 

భవిష్యత్తులో మహీంద్రా గ్రూపు తయారు చేసే ఎలక్ట్రిక్‌ వాహనాలకు అవసరమైన బ్యాటరీలను ఫోక్స్‌ వ్యాగన్‌ సమకూరుస్తుంది. మోటార్‌, ఇతర ఎలక్ట్రిక్‌ కాంపోనెంట్స్‌ను ఎంఈబీ సంస్థ అందిస్తుంది. ఈ మేరకు ఇరు సంస్థలు అగ్రిమెంట్‌ చేసుకున్నాయి. ఈ ఏడాది చివరికల్లా ఈ ఒప్పందం అమల్లోకి వస్తుంది.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement