వాహన తయారీలో ఉన్న జర్మనీ సంస్థ ఫోక్స్‌వ్యాగన్ గ్రూప్, భారత్‌కు చెందిన మహీంద్రా అండ్ మహీంద్రా ఒక ఒప్పందం కుదుర్చుకున్నాయి.
ఇందులో భాగంగా మహీంద్రా భవిష్యత్తులో తేబోయే ఎలక్ట్రిక్ కార్లకు కావాల్సిన విడిభాగాలను ఫోక్స్‌వ్యాగన్ సరఫరా చేయనుంది.
ఫోక్స్‌వ్యాగన్ అభివృద్ధి చేసిన యూనిఫైడ్ సెల్ కాన్సెప్ట్‌ను మహీంద్రా తన ఎలక్ట్రిక్ ప్లాట్‌ఫామ్ అయిన ఇంగ్లో కోసం వినియోగించనుంది. ఇంగ్లో ప్లాట్‌ఫామ్‌పై అయిదు పూర్తి ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలను మహీంద్రా అభివృద్ధి చేస్తోంది. తొలి మోడల్ 2024 డిసెంబర్‌లో అడుగు పెట్టనుంది.
Comments
Please login to add a commentAdd a comment