
సోషల్ మీడియాలో చురుగ్గా ఉండే ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహింద్రా.. అబ్బురపరిచే, ఆలోచింపజేసే వీడియోలను, సమాచారాన్ని తన ఫాలోవర్లతో పంచుకుంటుంటారు. ఈ సారి ఓ కస్టమర్ తమ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని కొన్న వీడియోను తన ‘ఎక్స్’ ఖాతాలో షేర్ చేశారు. ఇది కేవలం వీడియో మాత్రమే కాదంటూ ఎమోషనల్ అవుతూ మూడు దాశాబ్దాల క్రితం నాటి కథను రాసుకొచ్చారు. ఇంతకీ ఆ కస్టమర్ ఎవరు.. ఎమోషనల్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి అన్నది ఇప్పుడు తెలుసుకుందాం..
ఆనంద్ మహీంద్రా ఇటీవల డాక్టర్ పవన్ గోయెంకా ప్రయాణంపై తన హృదయపూర్వక ఆలోచనలను పంచుకున్నారు. 1990ల ప్రారంభంలో గోయెంకా యూఎస్‌లో జనరల్ మోటార్స్‌లో మంచి హోదాతో కూడిన
ఉద్యోగాన్ని విడిచి భారత్‌కు తిరిగి వచ్చేయాలని సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు. అప్పుడు ఆనంద్ మహింద్రా ఆయన్ను కంపెనీ నాసిక్ ఫెసిలిటీలో ఆర్‌అండ్‌డీ డిప్యూటీ హెడ్‌గా మహీంద్రా అండ్ మహీంద్రా (ఎం& ఎం) లో చేరేలా ఒప్పించారు.
అప్పట్లో కంపెనీ ఆర్‌అండ్‌డీ విభాగం పరిస్థితిని చూసిన పవన్ గోయెంకా ఇక్కడ కొనసాగుతారా లేదా అన్న సందేహాలు ప్రారంభంలో ఉన్నప్పటికీ ఆయన కొనసాగారు. పరిశోధన, అభివృద్ధి బాధ్యతలు చేపట్టారు. ఐకానిక్ మహీంద్రా స్కార్పియో రూపకల్పనలో కీలక పాత్ర పోషించారు. ఆయన నాయకత్వం కంపెనీ ఉత్పత్తి శ్రేణిని రూపొందించడమే కాకుండా, భారతీయ ఆటోమోటివ్ పరిశ్రమలో సృజనాత్మకతను కొనసాగించే ప్రపంచ స్థాయి ఆర్ & డి కేంద్రానికి పునాది వేసింది. ఆ తర్వాత గోయెంకా ఎంఅండ్‌ఎం లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ & సీఈవో పదవి దాకా ఎదిగారు.
గోయెంకా, ఆయన భార్య మమత ఇటీవల మహీంద్రా లేటెస్ట్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలలో ఒకటైన ఎక్స్ఈవీ 9ఈ వాహనాన్ని కొనుగోలు చేశారు. దీనికి సంబంధించిన వీడియోనే ఆనంద్ మహీంద్రా షేర్ చేస్తూ భావోద్వేగాన్ని వ్యక్తం చేశారు. తన దృష్టిలో ఈ క్షణం కేవలం ఒక లావాదేవీ మాత్రమే కాదే.. అంత కంటే ఎక్కువ. మహీంద్రా ఆటోమోటివ్ ల్యాండ్ స్కేప్ ను మార్చడంలో కీలక పాత్ర పోషించిన గోయెంకా ఇప్పుడు తాను చేసిన ఆవిష్కరణలను స్వీకరిస్తున్నారు.
2021లో పదవీ విరమణ చేసిన తరువాత, పవన్ గోయెంకా భారతదేశ అంతరిక్ష కార్యక్రమాలలో ప్రైవేట్ రంగ భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడానికి ఉద్దేశించిన అంతరిక్ష విభాగం సంస్థ ఇన్-స్పేస్ చైర్మన్‌గా కొత్త సవాలును స్వీకరించారు. భారతీయ పరిశ్రమకు ఆయన చేసిన విశేష సేవలు ఇటీవలే ప్రతిష్టాత్మక పద్మశ్రీ అవార్డుతో గుర్తింపు పొందాయి. ప్రస్తుతం గోయెంకా ఐఐటీ మద్రాస్ లో బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ చైర్మన్ గా, వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ పరిధిలోని స్థానిక విలువ-యాడ్ అండ్ ఎక్స్ పోర్ట్స్ (స్కేల్ ) స్టీరింగ్ కమిటీకి నేతృత్వం వహిస్తున్నారు.
This is not just another video for me…
When Pawan Goenka decided to return to India in the early ‘90s, leaving behind a job at General Motors, I managed to convince him to join @Mahindra_Auto at Nashik as Deputy Head of R&D
He often relates how when he first went to Nashik and… pic.twitter.com/auggd8gEQ9— anand mahindra (@anandmahindra) March 27, 2025